పశ్చిమగోదావరి

పనిచేయకుండా మాపై నిందలా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మార్చి 25 : మీరు చేయాల్సిన పని చేయకుండా జిల్లా యంత్రాంగంపై నిందలు వేస్తే ఊరుకునేది లేదని హైవే అధికారులపై జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ నిప్పులు చెరిగారు. పనిచేయని కాంట్రాక్టరును తొలగించాలని చెప్పినా దానిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. స్థానిక కలెక్టరేట్‌లో శనివారం సేద్యపునీటి ప్రాజెక్టుల పనుల ప్రగతి తీరుపై ఆయన సమీక్షించారు. జిల్లాలో చించినాడ - లోసరి మధ్య జాతీయ రహదారి నిర్మాణ విషయంలో అవసరమైన భూసేకరణ పూర్తి చేశామని కేవలం టోల్‌ప్లాజాకు సంబంధించి భూమి సేకరణ కావాలనే ఆపామని కానీ రోడ్డు నిర్మాణ పనులు చేయించకుండా భూసేకరణ పూర్తి కానందువలనే పనిలో పురోగతి లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అందజేసిన నివేదికలో ఎలా పేర్కొన్నారని కలెక్టర్ ప్రశ్నించారు. టోల్‌ప్లాజాకు భూసేకరణ పూర్తి చేస్తే రోడ్డు పూర్తి కాకుండానే ప్రజల నుండి టోల్‌ఫీజు వసూలు చేస్తారనే భావనతో ఆ ఒక్క పనికి మాత్రమే భూసేకరణ కావాలనే జాప్యం చేస్తున్నారని, జాతీయ రహదారికి అవసరమైన భూమిని అప్పగించినప్పటికీ కాంట్రాక్టరుతో పనులు చేయించలేక కాంట్రాక్టరును తొలగించలేక తప్పులన్నీ దగ్గర పెట్టుకుని జిల్లా యంత్రాంగంపై బురదజల్లుతారా? తక్షణమే క్షమాపణ కోరుతూ వ్రాత పూర్వకంగా సాయంత్రంలోగా లేఖ తనకు అందాలని లేనిపక్షంలో తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ నేషనల్ హైవే అధారిటీ అధికారులను హెచ్చరించారు. జాతీయ రహదారి నిర్మాణ పనులు నత్తనడకతో సాగుతున్నాయని గతంలో అనేక సార్లు హెచ్చరించి కాంట్రాక్టరును తొలగించాలని ఆదేశించినప్పటికీ కాంట్రాక్టరుపై చర్య తీసుకోకుండా ఎందుకు ప్రేమ ఒలకపోస్తున్నారని ప్రశ్నించారు. జంగారెడ్డిగూడెం నుండి జీలుగుమిల్లి, భద్రాచలం వరకూ ఉన్న ఆర్ అండ్ బి రోడ్డును వచ్చే వారం లోగా నేషనల్ హైవే అధికారులకు అప్పగించాలని ఆ రోడ్డును జాతీయ రహదారిగా అభివృద్ధి చేయనున్నట్లు కలెక్టర్ చెప్పారు. మల్కాపురం - జాలిపూడి రోడ్డు నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో ఇన్‌ల్యాండ్ వాటర్ వే ప్రాజెక్టు ద్వారా జల రవాణాను పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి చేపట్టిన కార్యక్రమంలో కనీసం ప్లగ్ మార్కింగ్ కూడా ఎందుకు చేయించలేదని ఇలా అయితే జల రవాణా పనులు ఎలా అవుతాయని ఈ విషయంపై ఇరిగేషన్ ఇ ఎన్‌సికి ప్రత్యేక లేఖ వ్రాస్తున్నామని చెప్పారు. జిల్లాలో ఏలూరుతో సహా 9 పట్టణాలకు ఇంటింటా వంట గ్యాస్ సరఫరా కార్యక్రమాన్ని చిత్తశుద్ధిగా అమలు చేయాలని కేవలం కొన్ని పట్టణాలకే ఇంటింటా వంట గ్యాస్ పరిమితం చేస్తే సహించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో తమ్మిలేరు, ఎర్రకాల్వ అభివృద్ధి పనులు మార్చి నాటికి పూర్తి చేస్తామని ఆరు నెలల క్రితమే స్పష్టమైన హామీ ఇచ్చిన ఇరిగేషన్ ఎస్ ఇ శ్రీనివాస్ మాటపై నిలబడ లేదని నబీ పేట పనులకు సంబంధించి 38 చోట్ల పనులు జరగాల్సి వుండగా కేవలం 17 చోట్ల మాత్రమే పనులు ప్రారంభమైతే ఇంకా ఎన్ని నెలలకు పూర్తిస్థాయి పనులు అవుతాయని మీ మాటపై మీకే గౌరవం లేకపోతే ఎలా అని ఇరిగేషన్ ఎస్ ఇ శ్రీనివాస్‌ను కలెక్టర్ ప్రశ్నించారు. నిర్ణీత కాల వ్యవధిలో ప్రాజెక్టు పనులు చేపట్టకపోతే ప్రగతి ఎలా సాధ్యపడుతుందని కలెక్టర్ ప్రశ్నించారు. తాడిపూడి ఎత్తపోతల పధకం పనులు ఏడు ఏళ్ల నుండి నిర్లక్ష్యం చేసారని గత రెండేళ్ల క్రితమే కాంట్రాక్టరును బ్లాక్ లిస్టులో పెట్టాలని తాను ఆదేశించినా కేవలం నోటీసిచ్చి చేతులు దులుపుకున్నారని దీని వలన సకాలంలో పూర్తి చేయాల్సిన పనికి అదనంగా నేడు 50 నుండి 60 కోట్ల రూపాయల నిదులు ప్రభుత్వం వెచ్చించాల్సి వస్తోందని ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే అధికారం ఎవరిచ్చారని పోలవరం ప్రాజెక్టు కుడికాల్వ ఎస్ ఇ శ్రీనివాసయాదవ్‌ను ప్రశ్నించారు. జిల్లాలో తాడిపూడి ఎత్తిపోతల పధకం ఒక ఫార్స్‌గా మారిందని ప్రధాన కాల్వ పనులు పూర్తి చేయకుండా పిల్లకాల్వల నిర్మాణాన్ని చేపట్టడాన్ని రైతులు కూడా విమర్శిస్తున్నారని చెప్పారు. సమావేశంలో జెసి పి కోటేశ్వరరావు, భూసేకరణ స్పెషల్ కలెక్టర్ భాను ప్రసాద్, డి ఆర్‌వో కట్టా హైమావతి, ఐటిడి ఏ పివో షాన్ మోహన్, నరసాపురం సబ్ కలెక్టర్ సుమిత్ కుమార్ గాందీ, ఆర్ డివోలు జి చక్రధరరావు, బి శ్రీనివాసరావు, లవన్న, స్పెషల్ డిప్యూటీ కలెక్టరు సూర్యనారాయణ, పుష్పమణి, గృహ నిర్మాణ శాఖ పిడి శ్రీనివాస్, ఇరిగేషన్ ఎస్ ఇ శ్రీనివాసరావు, పోలవరం ప్రాజెక్టు ఎస్ ఇ శ్రీనివాసయాదవ్, ఆర్ అండ్ బి ఎస్ ఇ నిర్మల, సోషల్ వెల్ఫేర్ డిడి రంగలక్ష్మీదేవి, వ్యవసాయ శాఖ జెడి సాయిలక్ష్మీశ్వరి తదితరులు పాల్గొన్నారు.

‘పోలవరం’ను పరిశీలించిన జలవనరుల శాఖ సాంకేతిక నిపుణుల కమిటీ
పోలవరం, మార్చి 25: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ సాంకేతిక నిపుణుల కమిటీ శనివారం పరిశీలించింది. ఉదయం కాంట్రాక్టు ఏజన్సీ క్యాంపు కార్యాలయానికి సిఇ సిడిఒ ఎం గిరిధర్‌రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ప్రాజెక్టు నమూనాను పరిశీలించారు. అనంతరం స్పిల్‌వే నిర్మాణంలో జరుగుతున్న కాంక్రీటు పనులను, డయాఫ్రమ్‌వాల్ నిర్మాణ పనులతోపాటు స్పిల్ ఛానల్‌లో జరుగుతున్న మట్టి పనులను పరిశీలించారు. అక్కడ నుంచి కాంక్రీటును చల్లబరిచే కూలింగ్ ప్లాంటును కూడా పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. కమిటీకి నిర్మాణాల గూర్చి ప్రాజెక్టు సిఇ రమేష్‌బాబు వివరించారు. అలాగే ఆర్‌ఆర్ ప్యాకేజీ అమలు గూర్చి కమిటీ అడిగి తెలుసుకుంది. అనంతరం తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్న పవర్ ప్లాంట్ నిర్మాణాల వద్దకు బయల్దేరి వెళ్లారు. సాంకేతిక నిపుణుల కమిటీలో సభ్యులు కెవి సుబ్బారావు, రౌతు సత్యనారాయణ, ఎన్ రాజు, ఎంకె రెహ్మాన్, జి రాజగోపాల్ తదితరులు ఉన్నారు.