పశ్చిమగోదావరి

కలెక్టర్‌కు డిఆర్‌డిఎ పిడి అభినందనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఏప్రిల్ 1 : రెండేళ్ల క్రితం అదోగతిలో ఉన్న డిఆర్‌డిఎ నేడు రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచి ఇతరులకు ఆదర్శంగా ముందడుగు వేయడానికి కృషి చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్‌ను డి ఆర్‌డిఏ పిడి శ్రీనివాసులు, సిబ్బంది అభినందించారు. స్థానిక కలెక్టరేట్‌లో శనివారం డి ఆర్‌డి ఏ అధికారుల సమావేశంలో డ్వాక్రా మహిళల ఆర్ధిక పురోభివృద్ధికి అక్షరాస్యత సాధనకు అమలు చేస్తున్న చర్యలను కలెక్టర్ సమీక్షించారు. పశ్చిమగోదావరి డి ఆర్‌డి ఏ అంటే గతంలో చెడ్డపేరు ఉండేదని ప్రగతిలో కూడా రాష్ట్రంలో 13వ స్థానానికి దిగజారిందని ఇటువంటి స్థితిలో డి ఆర్‌డి ఏ పేరు చెప్పుకోవడానికే సిగ్గుతో తలదించుకునే సిబ్బంది నేడు రాష్ట్రంలో ఇతరులకు ఆదర్శంగా ఉండే స్థాయికి డి ఆర్‌డి ఏను తీసుకువెళ్లడంలో కలెక్టర్ వారం వారం సమీక్షలు నిర్వహించారని చెప్పారు. డ్వాక్రా గ్రూపులు తీసుకున్న రుణాల రికవరీలో 5 శాతం ఉండగా నేడు 82 శాతానికి తీసుకువెళ్లి పశ్చిమ డ్వాక్రా మహిళలు ప్రపంచానికే ఆదర్శంగా ఉండేలా కలెక్టర్ తీసుకున్న చొరవ ఎంతో ఉన్నదని చెప్పారు. గతంలో డ్వాక్రా మహిళలు రికవరీలో ఇతరులకు ఆదర్శంగా ఉండే వారని గత కొద్ది సంవత్సరాల క్రితం గాడితప్పి రికవరీలో వెనుకబడడంతో పశ్చిమగోదావరి జిల్లాకు కొంత చెడ్డ పేరు వచ్చిందని కలెక్టర్ రెండున్నరేళ్ల క్రితం కలెక్టరుగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి అదోగతిలో ఉన్న డి ఆర్‌డి ఏను గాడిలో పెట్టి నేడు సిబ్బంది తల ఎత్తుకుతిరిగేలా తీర్చిదిద్దారని శ్రీనివాసులు చెప్పారు.

ఏలూరు వైస్ ఎంపిపిగా మాణిక్యాలరావు ఏకగ్రీవంగా ఎంపిక
ఏలూరు, ఏప్రిల్ 1 : ఏలూరు మండల పరిషత్ ఉపాధ్యక్షులుగా శనివారపుపేట ఎంపిటిసి లంకపల్లి మాణిక్యాలరావు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. శనివారం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎన్నికల అధికారి రవికుమార్ ఎంపిటిసిలను సమావేశపర్చి ఎన్నికను నిర్వహించారు. వైస్ ఎంపిపి పదవికి మాణిక్యాలరావు ఒక్కరే నామినేషన్ వేయడం, సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. అనంతరం మాణిక్యాలరావును ఎంపిటిసిలు దుశ్శాలువాలతో, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు నేతల రవి, రెడ్డి అప్పలనాయుడు, మోరు సుబ్బారావు, అంబటి రజనీకుమార్, గుండు శివానీలతోపాటు మాజీ ఎంపిపి రెడ్డి అనురాధ, ఎంపిటిసిలు కొట్టే సుబ్బారావు, పాతూరి జ్యోతి, తంగిరాల సురేష్, బెజ్జం అచ్చాయమ్మ, చల్లారి కనకదుర్గ, సోమిశెట్టి రామ్మోహనరావు, మట్టా ధనలక్ష్మి, ఆళ్ల మోహనరావు, కూర్మా సారమ్మ, మారేపల్లి నాగేశ్వరమ్మ, చిన్ని ఆంథోనమ్మ, ఎం విజయలక్ష్మి, గుండు శివానీ, యండమూరి లక్ష్మి, మాకాల రమేష్, సుంకర సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

ద్వారకాతిరుమల వైస్ ఎంపిపిగా ప్రసాదరెడ్డి
ద్వారకాతిరుమల, ఏప్రిల్ 1: ద్వారకాతిరుమల వైస్ ఎంపిపి పదవికి శనివారం నిర్వహించిన ఎన్నికల్లో జంగా ప్రసాద్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలంలోని గుణ్ణంపల్లి ఎంపిటిసిగా విధులు నిర్వర్తిస్తున్న ఆయనను వైస్ ఎంపిపిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల నిర్వహణాధికారి విజయలక్ష్మి తెలిపారు. ఇటీవల ఉపాధ్యక్ష పదవికి మల్లారెడ్డి విశే్వశ్వరరెడ్డి అనారోగ్య కారణంగా రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. శనివారం నిర్వహించిన ఎన్నికలో నామినేషన్ ఘట్టం ముగిసేసరికి జంగా ప్రసాద్‌రెడ్డి ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఆమె అధికారికంగా ప్రకటించారు. ప్రసాద్‌రెడ్డిని పేరును తిమ్మాపురం ఎంపిటిసి కె శ్రీనివాసరావు ప్రతిపాదించగా, ద్వారకాతిరుమల ఎంపిటిసి కె కె మణెమ్మ బలపర్చారు. ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రసాద్‌రెడ్డిని ఎంపిపి వి ప్రసాద్, టిడిపి నేతలు మల్లిపెద్ది వెంకటేశ్వరరావు, దాలయ్య, ఎంపిడిఒ కె శ్రీదేవి తదితరులు అభినందించారు.