పశ్చిమగోదావరి

పేరుపాలెం బీచ్‌లో ఇరువురు యువకులు గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొగల్తూరు, ఏప్రిల్ 15: పేరుపాలెం బీచ్‌లో శుక్రవారం ఉదయం కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు గల్లంతు కాగా వారిలో వినోద్ అనే యువకుని మృతదేహం గంటసేపటికే కొట్టుకు వచ్చింది. రెండవ యువకుని జాడ తెలియరాలేదు. పోలీసుల కథనం ప్రకారం కృష్ణా జిల్లా చాట్రాయ్ మండలం తుమ్మలగుంట గ్రామానికి చెందిన ములుగుబాటి వినోద్ (22) అనే యువకుడు బీచ్‌లో వేళంకిణి మాత ఆలయానికి కుటుంబ సభ్యులతో ప్రత్యేక వాహనంలో 70 మందితో కలిసి వచ్చాడు. వారంతా ఉదయం అయిదు గంటల సమయంలో వేళంకిణి మాత ఆలయంలో ధరించిన మాలలు విడిచారు. అనంతరం సముద్రం స్నానం చేస్తుండగా సముద్రం కెరటాల తాకిడికి వినోద్ సముద్రంలో గల్లంతయ్యాడు. వినోద్ కోసం తల్లి సరోజిని, తండ్రి రాజులుతోపాటు వారితో వచ్చిన కుటుంబ సభ్యులు గాలించారు. అయితే సముద్రంలో గల్లంతయిన వినోద్ కాసేపటికే వేరే వ్యక్తి సముద్ర స్నానం చేస్తుండగా వారి కాళ్లకు తగిలాడు. వెంటనే అందరూ కలిసి బయటకు లాగటంతో వినోద్ మృతదేహం కనిపించింది. మృతదేహానికి నరసాపురం ప్రభుత్వాసుప్రతిలో పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతుడు వినోద్ చిన తండ్రి మలుగుబాటి నవీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎఎస్సై వై.నాగేశ్వరరావు తెలిపారు.
కాగా ఇదే ఘటనలో మరో యువకుడు కృష్ణా జిల్లా ముసునూరు మండలం చెక్కపల్లి గ్రామానికి చెందిన దొమ్మతోట విజయరాజు గల్లంతయ్యాడు. అతడిని కుటుంబ సభ్యులు నరసాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి, చికిత్స చేయించి సురక్షితంగా ఇంటికి తీసుకువెళ్లారని నరసాపురం సిఐ పి. రామచంద్రరావు తెలిపారు.
పశ్చిమడెల్టా కాలువలకు
మరో రెండు రోజులు
నీరు విడుదల
ఉండి, ఏప్రిల్ 15: పశ్చిమడెల్టా కాలువలకు నీటి విడుదల మరో రెండు రోజులు పొడిగించినట్లు ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 17 వరకు కాలువలకు నీరు విడుదల ఉంటుందన్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈనెల 10న కాలువలకు నీరు నిలుపుదల చేయాల్సి ఉంది. ఇలా కాలువలకు నీరు ఇచ్చుకుంటూ పోతుంటే ఇక వేసవి పనులు చేసేది ఎప్పుడని ఒక అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి అందిన సమాచారం ప్రకారం ఈనెల 17వ తేదీ సాయంత్రం నీరు నిలుపుదల ఉంటుందని అధికారులు చెబుతున్నారు.