పశ్చిమగోదావరి

జనరిక్ మందుల విక్రయాలకు ప్రోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఏప్రిల్ 28: నాణ్యమైన మందులను ప్రజలకు తక్కువ ధరకే అందించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జనరిక్ మందుల విక్రయాలను ప్రోత్సహిస్తున్నారని ఎమ్మెల్యే బడేటి కోట రామారావు (బుజ్జి) చెప్పారు. స్థానిక పాండురంగా ధియేటరు రామతులసి ఆసుపత్రి వద్ద మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో జనరిక్ మందుల షాపును శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బ్రాండెడ్ మందుల పేరుతో మందుల షాపుల్లో లభించే మందులు ఏ విధంగా పనిచేస్తాయో అదే తరహాలో జనరిక్ మందులు కూడా పనిచేస్తాయని, కానీ మందుల ధరలో 50 శాతం పైబడి వ్యత్యాసం ఉంటుందని ప్రజలు ఈ వాస్తవాన్ని గుర్తించి జనరిక్ మందుల వాడకాన్ని పెంచుకోవాలని కోరారు. జిల్లాలో ప్రతీ ఏటా వెయ్యి కోట్ల రూపాయల మందులు మందుల షాపుల్లో విక్రయిస్తున్నారని ఈ విక్రయాల్లో కేవలం 20 శాతం వ్యాపారాన్ని జనరిక్ మందుల వపు మళ్లించగలిగితే ప్రజలకు వంద కోట్ల రూపాయలు లాభం కలుగుతుందని ఈ వ్యాపారం చేసే డ్వాక్రా మహిళలకు కూడా ఉపాధి సౌకర్యాలు మెరుగుపడతాయని చెప్పారు. ప్రతీ ప్రభుత్వ ఆసుపత్రిలో విధిగా జనరిక్ మందులను ప్రజలకు అందుబాటులో ఉంచడం జరుగుతుందని కొన్ని రకాల మందులపై 50 నుండి 80 శాతం రాయితీ కూడా ఉన్నాయని ముఖ్యంగా బిపి, షుగర్, వంటి వ్యాధిగ్రస్తులు తమకు కావాల్సిన నెలవారీ మందులను జనరిక్ షాపులో తీసుకుంటే ప్రతీ నెలా 500 నుండి 800 రూపాయల వరకూ సొమ్ము ఆదా అవుతుందని చెప్పారు. నగర మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ ఆధునిక యుగంలో ప్రతీనిత్యం మందులు మింగని కుటుంబం లేదని, శారీరక శ్రమ లేకనో వంశపారంపర్యంగానో చాలా మంది దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారని అటువంటి కుటుంబాలు ప్రతీ నెలా జనరిక్ మందులను వాడితే ఆర్ధికంగా ఎంతో వెసులుబాటు ఉంటుందని చెప్పారు. నగరంలో డ్వాక్రా మహిళలతో జనరిక్ మందుల విక్రయాలను చేపట్టేలా ప్రధాన సెంటర్లలో మందుల షాపులను ప్రారంభించేలా చర్యలు చేపట్టామని చెప్పారు. డిప్యూటీ మేయర్ గుడివాడ రామచంద్రకిషోర్, కమిషనర్ వై సాయి శ్రీకాంత్, కో ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు, మెప్మా పిడి ప్రకాశరావు, కార్పొరేటర్లు గోపాల్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం తక్కువ ధరకే జనరిక్ మందులను ప్రజలకు ఎమ్మెల్యే బుజ్జి అందజేశారు.

ఆధ్యాత్మిక జ్ఞానంతో మనశ్శాంతి
ఉమర్ అలీషా
యలమంచిలి, ఏప్రిల్ 28: ఆధాత్మిక, తాత్విక జ్ఞానం మనలో ఉన్న భయాన్ని, ఒత్తిడిని నివారించి మనశ్శాంతిని కలుగ చేస్తుందని పిఠాపురం విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అన్నారు. కొంతేరు ఆశ్రమంలో శుక్రవారం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఆధ్యాత్మికత సమాజంలో సుఖ సంతోషాలతో జీవించేలా చేస్తుందన్నారు. పరమాత్మ శక్తి జీవాత్మలో ఇమిడి ఉందన్నారు. ప్రస్తుత సమాజంలో కులమతాల రూపంలో ద్వేష భావాలు ఏర్పరచుకుని ఒకరినొకరు హింసించుకుని వినాశనానికి గురవుతున్నారన్నారు. ప్రతి గురువారం కొంతేరు ఆశ్రమంలో ఆరాధన పొంది మనశ్శాంతిని పొందాలని సూచించారు. ఆత్మ అనే చైతన్యశక్తి శరీరానికి, మనస్సుకు శక్తిని ప్రసాదిస్తుందని, ఆ శక్తితో మనుగడ సాగుతుందన్నారు. శరీరతత్వాన్ని, మానసికతత్వాన్ని ఏకీకృతం చేస్తే తెలియచేయబడే చైతన్యవంతమైన శక్తి స్వరూపమే ఆత్మ స్వరూపమన్నారు. సదస్సుకు విశేష సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఉమర్ అలీషాను పలువురు ఘనంగా సత్కరించారు. సదస్సుకు త్సవటపల్లి ఉమామహేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యుడు ఎఎన్ వెంకటరత్నం, జి సాయిబాబు, వై భీమేశ్వరరావు తదితరులు ఆధ్వర్యం వహించారు.