పశ్చిమగోదావరి

సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లిగూడెం, మే 1: సాగు, తాగునీటికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తుందని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేర్కొన్నారు. సోమవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో మైనర్ ఇరిగేషన్, తాడిపూడి కాలువ పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో మైనర్ ఇరిగేషన్ ద్వారా నిర్మించే పనులు సక్రమంగా, నాణ్యతగా నిర్మించేందుకు ఒక ప్రత్యేక కమిటీని నియమించామన్నారు. గొలుసుకట్టు చెరువుల ద్వారా పల్లెల్లో చెరువులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. సిఎం చంద్రబాబు నీరు - ప్రగతి ద్వారా భూగర్భ జలాలు పెంపొందించేందుకు వర్షపు నీరు వృథాకాకుండా గొలుసుకట్టు చెరువులకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. మండలంలో గొలుసు కట్టు చెరువులు పూడిక తీతకు రూ.3 కోట్లు నిధులు మంజూరయ్యాయన్నారు. జియోటాగింగ్ ద్వారా చెరువుల్లో మట్టి అనుమతులు లేకుండా దోచుకున్న వివరాలు తెలుస్తాయన్నారు. 20 నుంచి 25 అడుగులు మట్టి తవ్వడం వల్ల ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. తాడేపల్లిగూడెం వన్‌టౌన్‌లో వర్షపు నీరు నిల్వ లేకుండా డ్రెయినేజీ పనులు వేగవంతంగా పూర్తిచేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మైనర్ ఇరిగేషన్ ఇఇ డి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మండలంలో మంచినీటి చెరువులు, ఎర్ర కాలువ పనులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. జలవనరుల శాఖకు సంబంధించి 14 మంచినీటి చెరువులు, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి 28 చెరువులు ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సి ఉందన్నారు. తాడేపల్లిగూడెం మండలంలో పది రెగ్యులేటర్ గేట్లు రూ.17 లక్షలతో చేపట్టనున్నట్టు పోలవరం తాడిపూడి ఇరిగేషన్ అధికారి సత్యదేవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మేజర్ ఇరిగేషన్ అధికారి కెబి నాయక్, ఎఇ అనిల్, జెఇ ఎన్.హేమలత, బిజెపి కార్యదర్శి కంచుమర్తి నాగేశ్వరరావు, యెగ్గిన నాగబాబు తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తెలియజేయాలి
మంత్రి జవహర్
కొవ్వూరు, మే 1: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అధికారులు చిత్తశుద్ధితో నిర్వహించి ప్రజలకు తెలియజేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి మంత్రి కార్యాలయంలో కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని తహసీల్దార్లు, ఎంపిడిఒలు, ఇతర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జవహర్ మాట్లాడుతూ డిసెంబర్ నాటికి కొవ్వూరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం, సిమెంట్ రోడ్ల నిర్మాణం, తాగునీటి సరఫరా తదితర నిర్మాణ పనులను పూర్తిస్థాయిలో చేపట్టాలని ఆదేశించారు. నియోజకవర్గంలో ఇంకా 40 కిలోమీటర్ల పొడవునా పంచాయతీ రోడ్డు నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయాలన్నారు. జగన్నాధపురం - గజ్జెరం వరకూ రూ.5.7 కోట్లతో 20.4 కిలోమీటర్ల పొడవునా ఆర్‌అండ్‌బి రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్టు చెప్పారు. అన్ని పాఠశాలల్లోని విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ, నోటు పుస్తకాల పంపిణీకి అర్హులైన వారి జాబితాను సిద్ధం చేయాలన్నారు. ప్రతి గ్రామంలో మంచినీటి చెరువులో పూడికతీత పనులు, నీరు-చెట్టు పథకం ద్వారా వివిధ పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు పంపించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.