పశ్చిమగోదావరి

మండలానికో స్టేడియం యోచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తణుకు, మే 10: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర క్రీడాభివృద్ధి శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తణుకు హౌసింగ్‌బోర్డు కాలనీలో రెండు కోట్ల రూపాయలతో నిర్మించిన ఇండోర్ స్టేడియంను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. మండలానికి ఒక స్టేడియం నిర్మించే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పాల్గొనేందుకు శిక్షణ ఇస్తున్నట్టు రవీంద్ర తెలిపారు. ఈ మేరకు పాఠశాల స్థాయిలో చదువుతో పాటు క్రీడలకు కూడ ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, మాజీ ఎమ్మెల్యే వైటి రాజా, మున్సిపల్ చైర్మన్ పరిమి వెంకన్నబాబు, మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, వైస్ చైర్మన్ మంత్రిరావు వెంకటరత్నం, ఎఎంసి చైర్మన్ బసవా రామకృష్ణ, కమిషనర్ సిహెచ్ మల్లేశ్వరరావు, టిడిపి నేత కలగర వెంకటకృష్ణ, కౌన్సిలరు చిట్యాల అనంతలక్ష్మి పాల్గొన్నారు.

నేత్రపర్వంగా శ్రీవారి రథోత్సవం
ద్వారకాతిరుమల, మే 10: భక్తులకు వరాలిచ్చేలా చినవెంకన్న ఉభయ దేవేరులతో కలిసి రథంపై బుధవారం తిరువీధుల్లో విహరించారు. వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి జరిగిన శ్రీవారి రథోత్సవం భక్తులకు నేత్ర పర్వమైంది. శ్రీదేవి, భూదేవితో రథంలో కొలువు తీరిన కరుణాంతరంగుని వీక్షించిన భక్తజనులు పరవశించారు. ముందుగా ఆలయంలో ఉభయ దేవేరులతో స్వామివారిని తొళక్క వాహనంపై ఉంచి అలంకరించారు. ఆ తరువాత అట్టహాసంగా ప్రత్యేకంగా అలంకరించిన రథం వద్దకు తెచ్చారు. రథంలో ఏర్పాటు చేసిన సింహాసనంపై కల్యాణమూర్తులను ఉంచి అలంకరించి హారతులిచ్చారు. అనంతరం ఆలయ అధికారులు రథానికి బలిహరణ సమర్పించగా విశేష వాయిద్యాలు, కోలాట భజనలు, భక్తుల గోవిందనామ స్మరణల మధ్య శ్రీవారి రథం క్షేత్ర పురవీధుల్లో తిరుగాడింది. ఇఒ త్రినాథరావు ఉత్సవ ఏర్పాట్లు పర్యవేక్షించారు.