పశ్చిమగోదావరి

విద్య, వైద్య కేంద్రంగా ద్వారకాతిరుమల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్వారకాతిరుమల, ఏప్రిల్ 8: శ్రీవారికి భక్తులు ఇస్తున్న కానుకల్లో కొంత మేర మానవాళికి ఉపయోగించాలన్న సదుద్దేశంతో ద్వారకాతిరుమల క్షేత్రాన్ని విద్యా, వైద్య పరంగా ముందుకు తీసుకెళ్తున్నామని ఆలయ ఛైర్మన్ రాజా ఎస్వీ సుధాకరరావు అన్నారు. స్థానిక మావులేటి సోమరాజు సదన భవనంలో భీమవరం విష్ణు దంత వైద్యశాల, చిన వెంకన్న దేవస్థానంల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డెంటల్ ఆసుపత్రిని శుక్రవారం ఆయన ప్రారంభించారు. విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ, డాక్టర్ బివి రాజు పౌండేషన్ సౌజన్యంతో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేయగా, ఇందుకు దేవస్థానం భవనాన్ని కేటాయించింది. ఈ సందర్భంగా ఛైర్మన్ సుధాకరరావు మాట్లాడుతూ ఈ ఆసుపత్రిలో దంత వైద్య సేవలు ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉంటాయన్నారు. రూట్ కెనాల్ వంటి ఖర్చుతో కూడిన చికిత్సలకు కేవలం నిర్వహణ ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తారని, మిగిలిన సేవలన్నీ ఉచితంగా అందుతాయని చెప్పారు. కార్యక్రమంలో విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ ఛైర్మన్ కెవి విష్ణురాజు, డైరెక్టరు జె ప్రసాదరాజు, వైస్-ప్రిన్సిపాల్ ఎవి రామరాజు, దేవస్థానం ఇఒ వేండ్ర త్రినాథరావు, ఇఇ డివి భాస్కర్ పాల్గొన్నారు.