పశ్చిమగోదావరి

ప్రభుత్వ భూమి అమ్మిన వారిపై క్రిమినల్ కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మే 15: ప్రభుత్వ భూమిని అమ్మి అమాయకుల నుండి సొమ్ము తీసుకున్న వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ పోలీసులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన మీ-కోసం కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ కలెక్టరుకు వినతిపత్రం అందిస్తూ పెదవేగి మండలం చక్రాయగూడెం గ్రామంలో ప్రభుత్వ భూమిని 1.75 లక్షల రూపాయలకు అమ్మిన ఇద్దరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పెదవేగి మండలం వేగివాడ గ్రామానికి చెందిన కటారి శ్రీనివాసరావుకు చక్రాయగూడెం గ్రామంలో ప్రభుత్వ భూమిని అమ్మి మోసం చేశారని దీని వలన శ్రీనివాసరావు కుటుంబం నష్టపోయిందని ఈ వ్యవహారంలో రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయిందని ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందని డాక్యుమెంట్ రైటర్‌పై కూడా తగు చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇటువంటి మోసాలు జరగకుండా ఉంటాయని ప్రభాకర్ సూచించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ తక్షణమే ఈ వ్యవహారంపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి ప్రభుత్వ భూమిని అమ్మిన బసవయ్య, రామకృష్ణపై చర్యలు తీసుకోవాలని నష్టపోయిన బాధితునికి సొమ్ము తిరిగి ఇప్పించాలని ఆదేశించారు.
పాలకొల్లు కమిషనర్‌గా రామ్మోహన్ బాధ్యతలు స్వీకరణ
పాలకొల్లు, మే 15: పాలకొల్లు మున్సిపల్ కమిషనర్‌గా ఎ రామ్మోహన్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన భీమిలి జోనల్ కమిషనర్‌గా పనిచేస్తూ బదీలీపై ఇక్కడకు వచ్చారు. పాలకొల్లు కమిషనర్‌గా పనిచేస్తున్న కె సాయిరామ్ గుంటూరు డిఎంఎ అఫీసుకు బదిలీ అయ్యారు. నూతనంగా వచ్చిన కమిషనర్‌కి మున్సిపల్ ఛైర్మన్ వల్లభు నారాయణమూర్తి, వైస్ ఛైర్‌పర్సన్ రోజారమణి స్వాగతం పలికారు. సాయిరామ్ సమయంలో పుష్కర పనులు, ఇతర అభివృద్ధి పనులు పూర్తి చేయగలిగామని, ఆయన అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయటంలో కీలక బాద్యత వహించారని అభినందించారు. మున్సిపల్ వివిధ శాఖల అధికార్లు, సెక్షన్ అఫీసర్లు నూతన కమిషనరును కలిసి స్వాగతం పలికారు.

పనితీరు మెరుగుపడకుంటే చర్యలు

బుట్టాయగూడెం, మే 15: ఉపాధిహామీ పథకం అమలులో సిబ్బంది పనితీరు మెరుగుపరచుకోకుంటే చర్యలు తప్పవని పథకం ఫీల్డు అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లపై ఐటిడిఎ పిఒ ఎస్ షణ్మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఎంపిడిఒ పి వెంకటలక్ష్మితో కలిసి ఉపాధిహామీ పథకంలో జరుగుతున్న పనులపై సమీక్ష నిర్వహించారు. కోయ రాజమండ్రి, నిమ్మలగూడెం, కామయ్యకుంటకు చెందిన పనులపై వివరాలు కోరగా సిబ్బంది పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పిఒ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది పనితీరుపై ఇకనుండి జిపిఆర్‌ఎస్ ద్వారా పరిశీలిస్తామని అన్నారు. పనులకు హారవుతున్న కూలీల సంఖ్యను గమనించి, కూలీల సంఖ్య గణనీయంగా పెంచాలని ఆదేశించారు. రోజువారీ 6000మంది పనిచేయాల్సి ఉండగా, కేవలం 2618మంది పనులకు వస్తున్నట్లు రికార్డుల ద్వారా తెలుస్తోందన్నారు. దొరమామిడి, కోర్సవారిగూడెం, రెడ్డిగణపవరం, నూతిరామన్నపాలెం, రాజానగరం పంచాయతీలకు సీనియర్ మేట్‌ను వెంటనే నియమించాలని ఎపిఒ నాగరాజును ఆదేశించారు. సమావేశంలో ఎపిడి జిలానీ, ఇసి రమణ, ప్రసన్నకుమార్, తదితరులు పాల్గొన్నారు.