పశ్చిమగోదావరి

గొతెండుతున్న రేపాకగొమ్ము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేలేరుపాడు, మే 15: తమ గ్రామంలో నెలకొన్న మంచినీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని రేపాకగొమ్ము గ్రామస్థులు సంబంధిత అధికారులను అభ్యర్థిస్తున్నారు. గత వారం రోజులుగా మంచినీటి పథకం పనిచేయకపోవడంతో మంచినీటికై తాము పడుతున్న అవస్థలు వర్ణానాతీతంగా ఉన్నాయని పేర్కొన్నారు. మంచినీటి పథకాలు ఉన్నప్పటికీ అవి సక్రమంగా పనిచేయకపోవడంతో గ్రామంలో కొద్ది మందికి మాత్రమే నీరందుతోందని, 80 శాతం మంది మంచినీరు లేక పక్కనే గోదావరి ఉన్నా చుక్కనీరు లేకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి వివిధ వాహనాల్లో తెచ్చుకుని జీవించాల్సిన దుస్థితి నెలకొందన్నారు. తమ పరిస్థితి ఇలా ఉంటే..గ్రామంలోని పశువులు సుమారు 2 కిలోమీటర్ల దూరం తాము ఎదురొడ్డయినా తూర్పుగోదావరి జిల్లా వడ్డిగూడెం వరకూ మండుటెండలో నడిచి నీరు తాగి రావాల్సి వస్తోందని, ఈ విధంగా ఎడారి వంటి ఇసుకలో తమ పశువులు మృత్యువాతకు గురవుతున్నాయన్నారు. ఈ విధమైన నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న తమ గ్రామంలో మరో మోటారు ఏర్పాటుచేసి మంచినీరు అందించాలని అధికారులకు వారు మొరపెట్టుకుంటున్నారు.
ఆంధ్రాబ్యాంకు చీఫ్ మేనేజర్‌పై దౌర్జన్యం
జంగారెడ్డిగూడెం, మే 15: స్థానిక ఆంధ్రాబ్యాంక్ ప్రధాన శాఖ చీఫ్ మేనేజర్ టి.త్రినాథరావుపై సోమవారం మున్సిపల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి దౌర్జన్యానికి పాల్పడ్డాడు. బ్యాంక్ శాఖకు వచ్చిన యువకుడు తన పర్స్ పోయిందని సిబ్బందితో చెప్పడంతో రద్దీగా లేనందున పర్స్ ఇక్కడ పోయి ఉండదు, మరెక్కడైనా పోయిందేమో వెదుక్కోవలసిందిగా సూచించారు. వెళ్ళిపోయిన యువకుడు ఐదు నిమిషాల్లో మరల వచ్చి బ్యాంక్ శాఖలోనే పర్స్ పోయిందంటూ చీఫ్ మేనేజర్ ఛాంబర్‌లోకి చొరబడి సెల్‌ఫోన్‌తో ఆయన చిత్రాలు తీసి, వీడియో తీస్తూ పరుష పదజాలంతో దూషించాడు. అడ్డుకున్న చీఫ్ మేనేజర్ చొక్కా పట్టుకుని కింద పడవేసి దౌర్జన్యం చేశాడు. ఈ సంఘటనపై చీఫ్ మేనేజర్ త్రినాధరావు పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఫిర్యాదు పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. మున్సిపల్ సిబ్బంది రాజీ ప్రయత్నాలకు రావడంతో జోనల్ మేనేజర్‌ను సంప్రదించి నిర్ణయం తీసుకుంటానని చీఫ్ మేనేజర్ చెప్పారు.