పశ్చిమగోదావరి

ఆక్రమణదారులకు సహకరిస్తే కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మే 15 : జిల్లాలో ప్రభుత్వ స్థలాలు, భూములను ఆక్రమించే వారికి సహకరించే అధికారులను ఏ మాత్రం ఉపేక్షించబోనని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం మీ-కోసం కార్యక్రమం సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి వినతులు, ఫిర్యాదులు కలెక్టర్ భాస్కర్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పంచాయితీ స్థలాలు, ఆర్ అండ్ బి స్థలాలను కొంతమంది ఆక్రమించుకుంటున్నా అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని అంతేకాకుండా ఆక్రమణదారులకు సహకరిస్తున్నారంటూ మీ-కోసం కార్యక్రమంలో పలు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. జిల్లాలో ప్రభుత్వ ఆస్థులను ఎవరు ఆక్రమించుకున్నా వెంటనే వాటిని తిరిగి సంబంధితాధికారులు స్వాధీనం చేసుకోవాలన్నారు. ఏ అధికారి అయినా ఆక్రమణదారులకు సహకరించినట్లు రుజువైతే అటువంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. కొయ్యలగూడెం మండలం కన్నాపురం గ్రామానికి చెందిన వై వెంకటేశ్వరరావు కలెక్టరుకు ఫిర్యాదు చేస్తూ గ్రామంలో ఆర్ అండ్ బి స్థలంలో కొంతమంది పాకలు వేసుకున్నారని వాటిని ఇప్పుడు ఆక్రమణదారులు తొలగించి అక్కడే ఉన్న చెట్లను కూడా నరికి వేసి ఆ స్థానంలో పక్కా గృహాలను నిర్మించుకుంటున్నా అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారని చెప్పారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ జిల్లాలో ఎక్కడ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుంటున్నా వెంటనే తొలగించాలని తాను ఆదేశించినప్పటికీ కొంతమంది అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. ఈ విషయంలో ఆర్ అండ్ బి అధికారులు వెంటనే స్పందించి పరిశీలించి ఆక్రమణలు వెంటనే తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. ఏలూరు తంగెళ్లమూడి పంచాయితీ నేతాజీ నగర్ సర్వీసు అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నపూర్ణయ్య, వైస్ ప్రసిడెంట్ తులసి మరికొంతమంది సభ్యులు కలెక్టరుకు వినతిపత్రం సమర్పిస్తూ నేతాజీ నగర్‌లో అంగన్‌శాడీ కేంద్రం స్కూలు, మసీదు మధ్యలో బార్ పెట్టడానికి పనులు శరవేగంగా చేస్తున్నారని గృహాల మధ్యలో బార్ పెట్టకుండా నిలుపుదల చేయాలని కలెక్టరును కోరారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ విచారణ చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. ఏలూరు 12వ వార్డుకు చెందిన మామిడి వెంకట రాజ రాజేశ్వరి వినతిపత్రం సమర్పిస్తూ జీలుగుమిల్లి మండలం దర్భగూడెంలో సర్వే నెంబరు 121/2లో ఉన్న 5.25 ఎకరాల భూమిని పోలవరం ప్రాజెక్టు కోసం తీసుకున్నారని, దానికి సంబంధించిన సొమ్ము తనకు ఇంత వరకు అందజేయలేదని చెప్పారు. దీనిపై సమగ్ర విచారణ చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్‌ను ఆదేశించారు. కొవ్వూరు మండలం కొవ్వూరు పట్టణానికి చెందిన కాట్రు రమేష్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తూ కొవ్వూరు మున్సిపల్ కమిషనరు ఆశీలు పాటలో అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. దీనిపై కలెక్టరు స్పందిస్తూ సమగ్ర విచారణ చేసి నివేదిక తనకు అందజేయాలని కొవ్వూరు ఆర్‌డివోను ఆదేశించారు. కార్యక్రమంలో జెసి పి కోటేశ్వరరావు, జెసి-2 షరీఫ్, డి ఆర్‌వో కట్టా హైమావతి, ఆర్ అండ్ బి ఎస్ ఇ నిర్మల, హౌసింగ్ పిడి శ్రీనివాసరావు, ఎస్‌షి కార్పొరేషన్ ఇడి ఝాన్సీరాణి, బిసి కార్పొరేషన్ ఇడి పుష్పలత, సోషల్ వెల్ఫేర్ డిడి రంగలక్ష్మీదేవి, ఆర్‌డబ్ల్యు ఎస్ ఎస్ ఇ అమరేశ్వరరావు, డి ఎంహెచ్ ఓ డాక్టర్ కె కోటేశ్వరి, డిసిహెచ్ ఎస్ డాక్టర్ శంకరరావు, ఇరిగేషన్ ఎస్ ఇ శ్రీనివాసరావు, డిఆర్‌డిఎ పిడి కె శ్రీనివాసులు, ఎల్‌డి ఎం సుబ్రహ్మణ్యేశ్వరరావు, సిపివో వి బాలకృష్ణ, డిఇవో గంగాభవాని, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మొగల్తూరు తహసీల్దార్‌పై దాడి

నరసాపురం, మే 15: మొగల్తూరు తహసీల్దార్ శ్రీపాద హరనాథ్‌పై ఆదివారం రాత్రి ఒక వ్యక్తి దాడికి పాల్పడినట్టు పట్టణ ఎస్సై రమణ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. మొగల్తూరు మండల రెవెన్యూ కార్యాలయంలో విధులు పూర్తిచేసుకొని పట్టణంలోని గృహానికి కారులో వస్తున్న మొగల్తూరు తహసీల్దార్ హరనాధ్ కారును మేడిద రామారావు అనే వ్యక్తి ఆపాడు. రామారావు తాను ఎసిబి సిఐ త్రినాథరావుగా పరిచయం చేసుకున్నాడు. అనంతరం తహసీల్దార్ హరినాధ్‌పై రామారావు దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటనపై తహసీల్దార్ హరినాధ్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రమణ చెప్పారు.
ఉద్యోగుల సంఘం ఖండన
మొగల్తూరు తహసీల్దార్ శ్రీపాద హరనాధ్‌పై దాడిని రెవెన్యూ ఉద్యోగుల సంఘం తీవ్రంగా ఖండించింది. సోమవారం ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ సబ్ కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీకి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ విలేఖరులతో మాట్లాడుతూ గొంతేరు డ్రెయిన్ భూములు కోల్పోయిన వారికి పరిహారం అందించే పనులు పూర్తిచేసుకొని ఇంటికి తిరిగి వస్తున్న తహసీల్దార్‌పై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆదివారం కూడా విధులు నిర్వర్తిస్తున్న రెవెన్యూ ఉద్యోగులపై దాడులు పెరిగాయని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ఇసుక, మట్టి, ఆక్వా మాఫియాలు ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. రెవెన్యూ ఉద్యోగులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని, దాడికి పాల్పడిన వ్యక్తి ఎంతటివాడైనా తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్టస్థ్రాయి ఉద్యమం చేపడతామని విద్యాసాగర్ హెచ్చరించారు. సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చినవారిలో మొగల్తూరు తహసీల్దార్ శ్రీపాద హరనాధ్, డిటిలు నాగదేవి, రాయుడు ఝాన్సీ లక్ష్మీబాయి తదితరులున్నారు.