పశ్చిమగోదావరి

సంస్కృతి, సంప్రదాయాలు భావితరాలకు అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఏప్రిల్ 8: తెలుగువారి తొలి పండుగ ఉగాది అని కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ అన్నారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను ఉట్టిపడేలా ఉగాది వేడుకలను నిర్వహించి భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం ఉండి నియోజకవర్గ ఉగాది ఉత్సవాలు శుక్రవారం భీమవరంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో కలెక్టర్ భాస్కర్ పాల్గొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిలో జిల్లా ప్రథమ స్థానంలో ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రభుత్వ విప్ అంగర రామ్మోహన్ మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా అభివృద్ధికి, సంక్షేమానికి నిధుల కొరత లేదన్నారు. ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు మాట్లాడుతూ ఉగాది సంబరాలు ఘనంగా నిర్వహించడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వీరంపాలెం బాలత్రిపుర సుందరి పీఠం పీఠాధిపతి బ్రహ్మశ్రీ గరిమెళ్ళ వెంకటరమణ సిద్ధాంతి, అంతర్వేది శ్రీ వశిష్ఠ సేవాశ్రమం వ్యవస్థాపకులు, భీమవరం శంకరమఠం శారద పీఠం తృతీయ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీశ్రీ పూజ్యస్వామిజీ కలిదిండి ప్రసాదరాజు, ఆక్నూ ఉపకులపతి ముర్రు ముత్యాల నాయుడు, ఐఎఫ్‌ఎస్ డైరెక్టర్ రామలక్ష్మి, సినీరచయిత, డైరెక్టర్ జనార్ధన మహర్షి, సినీగేయ రచయిత భాస్కరభట్ల, తెలుగునాడు సంఘం సుభాష్ చంద్రబోస్, నరసాపురం వైఎన్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ చినిమిల్లి సత్యనారాయణ, భీమవరం ప్రభుత్వ ఐటిఐ కళాశాల ఛైర్మన్ డాక్టర్ సామంతపూడి బాలకృష్ణంరాజుకు జీవిత సాఫల్య పురస్కారాలు అందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ భాస్కర్, విప్ అంగర , డిసిసిబి చైర్మన్ ముత్యాల రత్నంను కూడ ఘనంగా సన్మానించారు. ఎఎంసి చైర్మన్లు మోటుపల్లి రామవరప్రసాద్, కొత్తపల్లి గోపాలకృష్ణంరాజు పాల్గొన్నారు.