పశ్చిమగోదావరి

రూ. 3.78 కోట్లతో ఎనిమిది ప్రభుత్వ ఆసుపత్రుల్లో వౌలిక వసతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూన్ 15 : జిల్లాలో ఎనిమిది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు వౌలిక వసతులు కల్పించడానికి 3.78 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు జిల్లా వైద్య విధాన పరిషత్తు కో ఆర్డినేటర్ డాక్టర్ శంకరరావు చెప్పారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలోని ఎన్‌సిహెచ్ బ్లాక్‌లో జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల సూపరింటెండెంట్లతో ఆయన గురువారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా శంకరరావు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు స్థ్ధలంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని 30 నుండి 50 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తున్నామని అక్కడ ప్రజలకు వౌలిక వసతులు కల్పించి మంచి వైద్య సేవలు అందించాలని ఆయన ఆదేశించారు. ముఖ్యమంత్రి పోలవరం ప్రభుత్వాసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చిన దృష్ట్యా తక్షణమే ముఖ్యమంత్రి హామీని అమలుచేసి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. కొవ్వూరు ప్రభుత్వాసుపత్రిని 43 లక్షలతో, పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిని 80 లక్షలతో, దెందులూరు కమ్యూనిటీ హెల్త్ సెంటరును 72 లక్షలతో, పెనుగొండ ఆసుపత్రిని 48 లక్షలతో అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళిక అమలుచేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రభుత్వాసుపత్రుల సూపరింటెండెంట్లకు టాప్ గ్రేడింగ్ ఇస్తామని కావున ప్రతీ సూపరింటెండెంట్ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ క్షేత్రస్థాయిలో సిబ్బందిని సమన్వయపరుస్తూ ముందుకు నడవాలని ఆయన సూచించారు. ప్రభుత్వాసుపత్రులలో అవినీతి జరుగుతోందని దాన్ని క్షేత్రస్థాయిలో నిర్మూలించడానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజల వద్ద డబ్బులు వసూలుచేసే డాక్టర్లు, సిబ్బందిపై కఠినంగా వ్యవహరించాలని, ఎవరైనా వైద్యసేవలు అందిస్తూ ప్రజల నుండి డబ్బులువసూలుచేస్తున్నట్లు రుజువైతే ఉద్యోగం నుండి తొలగించడానికి కూడా వెనుకాడవద్దని హెచ్చరించారు. చంద్రన్న బీమా పధకాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న దృష్ట్యా ప్రభుత్వాసుపత్రులలో చనిపోయే వారి మరణ ధృవీకరణ పత్రాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. భీమవరం, నరసాపురం ప్రభుత్వాసుపత్రుల్లో బయోమెట్రిక్ హాజరు సక్రమంగా నమోదు కావడం లేదని ఈ విషయంపై పలుమార్లు హెచ్చరించినప్పటికీ వారిలో మార్పు రాలేదని త్వరలోనే బయోమెట్రిక్ హాజరు వేయని సిబ్బంది జీతాలు నిలుపుదల చేస్తామని హెచ్చరించారు. ప్రతీ ప్రభుత్వాసుపత్రిలో లింక్ ఆఫీసర్ల ఏర్పాటుజరగాలని, ఏ డాక్టరైనా సిబ్బందైనా లేకపోయినా ప్రజలు నిరుత్సాహంగా తిరిగివెళ్లడానికి వీల్లేదని అందుకు సకాలంలో ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందించాలని ఆదేశించారు. ప్రభుత్వాసుపత్రుల్లో శానిటేషన్, పరిసరాల పరిశుభ్రత ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి ఎంపిపి వచ్చి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కోరితే ఎంపిపి పట్ల డాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు జిల్లా పరిషత్తు సమావేశంలో ప్రస్తావించారని, భవిష్యత్తులో ప్రభుత్వాసుపత్రుల్లో కూడా ప్రజాప్రతినిధులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సామాన్య ప్రజల పట్ల కూడా గౌరవ భావంతో ఉండాలన్నదే ప్రభుత్వోద్దేశ్యమని ఆయన చెప్పారు. సమావేశంలో ఏలూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎవి ఆర్ మోహన్, వివిధ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు డాక్టర్ కె ఎస్ త్రిమూర్తులు, డాక్టర్ సునీత, డాక్టర్ తాతారావు, డాక్టర్ వెంకటేశ్వరరావు, డాక్టర్ రాంబాబు, డాక్టర్ శివప్రసాద్, డాక్టర్ స్వరూప్, డాక్టర్ స్వర్ణలత, డాక్టర్ అరుణ, డాక్టర్ భాస్కరరావు, డాక్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.