పశ్చిమగోదావరి

మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూన్ 16 : చంద్రన్న సంచార చికిత్సా వాహనాలలో పూర్తిస్థాయిలో మెడికల్ అండ్ హెల్త్ ఎక్విప్‌మెంట్ ఏర్పాటు చేసి ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ వైద్యాధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు, పి హెచ్‌సి డాక్టర్లతో ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ చంద్రన్న సంచార చికిత్సా వాహనాల ద్వారా గ్రామ స్థాయిలో ప్రజలకు వైద్య సేవలు మెరుగుపరచాలన్నారు. టీమ్‌లను ఏర్పాటు చేసి వారానికి ఒక టీమ్ గ్రామాలలో వైద్య సేవలు అందించేందుకు నైట్ హాల్ట్ చేసే విధంగా వాహనాల్లో బెడ్స్ కూడా ఏర్పాటుచేయాలన్నారు. ప్రతీ వారం చంద్రన్న సంచార చికిత్స ద్వారా ఎంత మందికి ఏ ఏ గ్రామాల్లో వైద్య సేవలు అందించిందీ నివేదిక అందించాలన్నారు. గ్రామాల్లో వాటర్ టెస్టింగ్ నమూనాలు పరిశీలించి పరిశుభ్రమైన తాగునీరు అందేలా చూడాలన్నారు. కలుషితమైన నీటి ద్వారానే అనేక రోగాలుసంభవిస్తున్నాయని కాబట్టి పరిశుభ్రమైన నీరు ప్రజలకు అందేలా చూడాలన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా డాక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రసవాలు సిజేరియన్ లేకుండా సాధారణంగా జరిగేలా డాక్టర్లు గర్భిణీలకు అవసరమైన సలహాలు సూచనలు అందించి అవసరమైన మందులు అందించాలని అంగన్‌వాడీలు, ఎఎన్‌ఎంలు గర్భిణీలకు అవసరమైన పౌష్టికాహారం అందేలా చూడాలన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో 40 శాతానికి మించి ప్రసవాలు జరగడం లేదని ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు ఆరోగ్యకరమనే సమాచారం ప్రతీ ఒక్కరిలో వెళ్లేవిధంగా అవగాహన కార్యక్రమాలు జరగాలన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో డాక్టర్లు సరిగ్గా చూడరనే అపోహను ప్రజల్లో దూరం చేసే విధంగా డాక్టర్లు, సిబ్బంది వైద్య సేవలు అందించడమే కాకుండా రోగుల పట్ల గౌరవభావం, సాదరంగా, శ్రద్ధగా వ్యవహరించాలన్నారు. ప్రతీ పిహెచ్‌సిలోనూ డాక్టర్లు ఖచ్చితంగా అందుబాటులో ఉండాలని పిహెచ్‌సిల్లో డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండడం లేదని అనేక ఆరోపణలు వస్తున్నాయని, డాక్టర్లు, సిబ్బంది బయోమెట్రిక్ హాజరు ఖచ్చితంగా వేసేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. కొంతమంది డాక్టర్లు పనిచేసే చోటే నివాసముండకుండా దూర ప్రాంతాల నుండిరావడం వలన రోగులకు అందుబాటులో లేక వైద్యం సరిగ్గా అందక అనేక ఇబ్బందులుపడుతున్నారని చెప్పారు. ఆసుపత్రుల్లో సరైన ప్రమాణాలుపాటించడం లేదని, రోగులకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అనేక మంది ఫిర్యాదులు చేస్తున్న దృష్ట్యా తాను తనిఖీకి వస్తే కొంతమంది ఉద్యోగాలుపోతాయని ఆ పరిస్థితి తెచ్చుకోకుండా డాక్టర్లు, సిబ్బంది వ్యవహరించాలని హెచ్చరించారు. ప్రతీ ఆసుపత్రిలోనూ పేషెంట్లకు స్ర్తిలకు, పురుషులకు విడివిడిగా టాయిలెట్స్ నిర్మించాలన్నారు. ఆసుపత్రుల్లో రోగులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడానికి నిధులు కొరత లేదని ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలన్నదే ముఖ్య ఉద్దేశ్యమన్నారు. అలాగే ఆసుపత్రులకు వచ్చే వారికి పరిశుభ్రమైన తాగునీరు అన్ని వేళలా అందుబాటులో ఉంచాలన్నారు. పేషెంట్లకు అందించే మంచినీరు, ఏర్పాటుచేసిన టాయిలెట్స్ డాక్టర్లు సైతం ఉపయోగించుకునేలా ఉండేవిధంగా తీర్చిదిద్దాలన్నారు. ఆసుపత్రుల్లో రోగులకు అవసరమైన ఏ సౌకర్యంకావాలన్నా తన దృష్టికి తేవాలని వాటిని వెంటనే ఏర్పాటుచేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ ఓ డాక్టర్ కె కోటేశ్వరి, డిసిహెచ్ ఎస్ డాక్టర్ కె శంకరరావు, వివిధ ఆసుపత్రుల డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
పార్టీశ్రేణులు కష్టపడి పనిచేయాలి: ఎమ్మెల్యే బండారు
నరసాపురం, జూన్ 16: తెలుగుదేశం పార్టీపై ప్రజలకు ఎనలేని విశ్వాశం ఉందని, ప్రజల నమ్మకానికి అనుగుణంగా పార్టీ శ్రేణులు మరింత కష్టపడి పనిచేయాలని నరసాపురం శాసన సభ్యులు బండారు మాధవనాయుడు అన్నారు. శుక్రవారం స్థానిక రాయపేటలో నిర్వహించిన నరసాపురం మండల, పట్టణ పార్టీ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రమాబు రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా నియోజకవర్గానికి రూ.394 కోట్లు అభివృద్ధి చేసామన్నారు. మరో రూ.100 కోట్లకు పైగా అభివృద్ధి పనుల ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందించాన్నారు. దీంతో ప్రజలకు టిడిపి పార్టీపై మరింత నమ్మకం పెరిగిందన్నారు. రానున్న రెండేళ్ల పాటు కార్యకర్తలు మరింత కష్టపడి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. అలాగే స్ధానిక సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులతో పాటు పార్టీ నాయకులు కూడా బాధ్యత తీసుకోవాలని ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు సూచించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ డెల్టా ప్రాజక్టు కమిటీ చైర్మన్ పొత్తూరి రామరాజు, ఎఎంసి చైర్మన్ రాయుడు శ్రీరాములు, కౌన్సిలర్లు అధికారి అనంతరామారావు, పెమ్మాడి శ్రీదేవి, సరిదే నాగజ్వోతి, అబేదా సుల్తాన, టిడిపి నాయకులు కొప్పాడ రవి, గుగ్గిలపు ధర్మాజీ, కొట్టు పండు, గుబ్బల హరిశ్చంద్ర, కొల్లు పెద్దిరాజు, ముస్కూడి రవి, తంగెళ్ళ నాగేశ్వర రావు, కొండేటి రామకృష్ణారావు, భూపత నరేష్ పాల్గొన్నారు.