పశ్చిమగోదావరి

సమతానగర్‌కు ‘సడక్ దశ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూన్ 19: ఆకివీడులోని సమతానగర్ రహదారికి సడక్ దశ పట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన నడక్ యోజన ద్వారా ఈ రహదారికి రూ.2.5 కోట్లు నిధులు మంజూరు చేశారు. సమతానగర్ ఎస్సీ కాలనీ వంతెన వద్ద నుంచి కోళ్ళపర్రు వంతెన వరకు సుమారు మూడు కిమీ మేర ఈ రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. గ్రామీణ ప్రాంతాలను పట్టణాలతో అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ సడక్ యోజన ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు దేశంలో 5,10,379 కిమీ మేర రహదారిని నిర్మించారు. దీని కోసం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం యాప్‌ను ప్రవేశపెట్టారు. మేరీ సడక్ యాప్ ద్వారా ఆయా ప్రాంతాలకు చెందిన రహదారులను జిపిఆర్‌ఎస్ సిస్టం ద్వారా అప్‌లోడ్ చేస్తే నిధులు మంజూరుకు కేంద్రం చర్యలు తీసుకుంటుంది. ఈ రహదారి నిర్మాణంతో గణపవరం, నిడమర్రు, పాములపర్రు, ఆకివీడు మండలాలకు ప్రయాణ మార్గం తగ్గుతుంది. ఎన్నో ఏళ్ళుగా అపరిష్కృతంగా ఉన్న రహదారి సమస్యకు మోక్షం కలిగింది.

శివాలయంలో తాచుపాము ప్రత్యక్షం
నల్లజర్ల, జూన్ 19: శివాలయంలో తాచుపాము ప్రత్యక్షమైన అద్భుత సంఘటన మండలంలోని దూబచర్ల గ్రామంలో చోటు చేసుకుంది. సోమవారం ఉదయం గర్భాలయంలోకి ఎనిమిది అడుగులు ఉన్న ఈ తాచుపాము ప్రవేశించి శివలింగంపైకి పడగ విప్పి నాట్యం చేసింది. ఆలయ అర్చకులు సమయమంతుల ఆంజనేయశర్మ ఆలయ చైర్మన్ తాతిన సత్యనారాయణకు సమాచారం అందించగా, ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో పెద్ద సంఖ్యలో భక్తులు శివాలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం కావడంతోమరింత ప్రత్యేకతను సంతరించుకుంది. శివలింగం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేసినట్లు పలువురు భక్తులు పేర్కొంటున్నారు. పాము గర్భాలయంలో ఉండటంతో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. సోమవారం ఆ పాము ఆలయంలోకి వచ్చి శివునిపై నాట్యం చేయడంతో దేవుని లీలగా వారంతా భావిస్తున్నారు.