పశ్చిమగోదావరి

భీమారామానికి ఆధ్యాత్మిక శోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూన్ 19: భీమారామంలో భక్తజన సందోహం మధ్య భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో నూతన ధ్వజస్థంభ పునఃప్రతిష్ఠ, ఆలయ శిఖర పునఃప్రతిష్ఠ, మహాకుంభాభిషేకం అంగరంగ వైభవంగా సాగాయి. గత మూడు రోజులుగా పుల్లేటికుర్తి భోగేశ్వరశర్మ ఆచార్యత్వంలో భీమేశ్వర స్వామివారి దేవస్థానం ఆవరణలో ఈ కార్యక్రమం వైభవంగా సాగాయి. ఆలయ ధర్మకర్తల మండలి, ఆలయ అభివృద్ధి కమిటీ, ఉత్సవ కమిటీ, దేవస్థానం సంయుక్తంగా సోమవారం ఈ కార్యక్రమాలు నిర్వహించాయి. మాజీ మున్సిపల్ చైర్మన్ గ్రంధి వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, సోదరుడు గ్రంధి బాలాజీ, , గ్రంధి చల్లారావు, వెంకట లక్ష్మీరాధిక, కొటికలపూడి లక్ష్మణ్ బ్రహ్మజీ దంపతుల చేతుల మీదుగా నూతన ధ్వజస్థంభ పునఃప్రతిష్ఠ జరిగింది. మున్సిపల్ చైర్మన్ కొటికలపూడి గోవిందరావు, నాగ వెంకట సునీత దంపతులచే ఆలయ నూతన శిఖర పునఃప్రతిష్ఠ జరిగింది. ఇదే సమయంలో యాగశాలలో పండితులు పూర్ణాహుతి నిర్వహించారు. భీమేశ్వర సహిత మహిషాసురమర్ధిని అమ్మవార్లకు శాంతి కల్యాణం, మహాకుంభాభిషేకం నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, మెంటే పార్ధసారధి తదితర ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు.
ఎట్టకేలకు 82 ఎకరాల్లో భూమిపూజ

భీమవరం, జూన్ 19: ఎన్నో వివాదాల సుడిగుండం భీమవరం 82 ఎకరాలు. మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పేదలకు సొంత ఇంటి కల నెరవేర్చేందుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఈ 82 ఎకరాల వ్యవసాయ భూమిని సేకరించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఈ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేకపోయారు. స్థల పూడిక ప్రారంభించారు. అంతే ఆ వెంటనే కోర్టు వివాదాల్లో చిక్కుకుంది ఈ అంశం. 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన పులపర్తి రామాంజనేయులు కష్టపడి స్థల పూడిక చేయించారు. అదీ వివాదమే. అయితే భీమవరం మున్సిపల్ చైర్మన్ కొటికలపూడి గోవిందరావు ఈ 82 ఎకరాల అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్‌తో సంప్రదింపులు చేశారు. ఆన్‌లైన్ విధానం ద్వారా ఇప్పటివరకు సుమారు 13వేల మందిని ఎంపిక చేశారు. వీరిలో ప్రస్తుతం 9500 మంది అర్హులైన లబ్ధిదారులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకువచ్చిన ప్రధాన మంత్రి ఆవాస యోజన ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ పథకం ద్వారా అపార్ట్‌మెంట్ల విధానంలో ఇళ్ళను నిర్మించి ఇవ్వనున్నారు. రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ఈ భూమికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు భూమిపూజ చేశారు. ఎమ్మెల్యే రామాంజనేయులు ఆధ్వర్యంలో కౌన్సిలర్లు, కమిషనర్ సిహెచ్ నాగనర్సింహరావు తదితరులు కార్యక్రమంలో భాగస్వామలయ్యారు. అనంతరం స్థానిక చాంబర్ ఆఫ్ కామర్స్‌లో సమావేశం జరిగింది. తహసీల్దారు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వార సీఎంతో ఇక్కడ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడారు.