పశ్చిమగోదావరి

న్యాయం చేస్తా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూన్ 27: మీ సమస్య నాకు వదిలేయండి.. మీకు న్యాయం చేస్తా.. మీరు నష్టపోకుండా చూసే బాధ్యత నాది అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్కు పరిసర ప్రాంత ప్రజలకు, రైతులకు, మత్స్యకారులకు భరోసా ఇచ్చారు. మంగళవారం గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్కు వ్యతిరేక పోరాట కమిటీతోపాటు భీమవరం, నరసాపురం నియోజకవర్గాల్లో నివసిస్తున్న రైతులు, మత్స్యకారులు ముఖ్యమంత్రి చంద్రబాబును విజయవాడలో కలుసుకున్నారు. టిడిపి జిల్లా అధ్యక్షురాలు, ఎంపి తోట సీతారామలక్ష్మి, మంత్రులు పితాని సత్యనారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, బండారు మాధవనాయుడు సమక్షంలో ముఖ్యమంత్రికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా వ్యతిరేక కమిటీ నాయకులు ఆరేటి వాసు (తుందుర్రు), ముచ్చెర్ల త్రిమూర్తులు (కె బేతపూడి), జవ్వాది సత్యనారాయణ (తుందుర్రు), సముద్రాల వెంకటేశ్వరరావు (కె బేతపూడి), సత్యవాణి, బాబురావు, సత్తినేని మోహన్‌రావులు చంద్రబాబుకు కాలుష్యం వస్తుందని వివరించారు. దీనిపై స్పందించిన సిఎం చంద్రబాబు గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్కు ఒక వ్యక్తి కోసం నిర్మిస్తోంది కాదని స్పష్టం చేశారు. తాను ప్రజలందరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నట్లు వివరించారు. అనంతపురానికి కియో కార్ల ఫ్యాక్టరీని తీసుకువచ్చామని, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానని భరోసా ఇచ్చారు. దీని వల్ల భవిష్యత్తులో చాలా మందికి ఉపాధి లభిస్తోందని చంద్రబాబు వారికి వివరించి మరీ చెప్పారు. దీంతో భీమవరం, నరసాపురం, మొగల్తూరు తదితర ప్రాంతాలకు చెందిన రైతులు, మత్స్యకారులు, స్థానికులు సంతృప్తి వ్యక్తం చేశారు.