వరంగల్

గ్రామీణ పోస్టల్ ఉద్యోగుల అర్ధనగ్న ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఆగస్టు 22: గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న పోస్టల్ ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం వారం రోజులుగా చేస్తున్న సమ్మె విషయంలో కేంద్రప్రభుత్వం, పోస్టల్‌శాఖ ఉన్నతాధికారులు స్పందించకపోవటాన్ని నిరసిస్తూ గ్రామీణ పోస్టల్ ఉద్యోగులు మంగళవారం నగరంలోని వరంగల్ ప్రధాన తపాలా కార్యాలయం ముందు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు.
సమాన పనికి సమాన వేతనం, ప్రభుత్వ పథకాల అమలులో భాగం పంచుకుంటున్న గ్రామీణ పోస్టల్ ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగా ఇనె్సంటివ్‌లు ఇవ్వటం, అర్హతలు ఉన్న గ్రామీణ పోస్టల్ ఉద్యోగులను రెగ్యులర్ చేయటం తదితర సమస్యలను పరిష్కరించాలని కోరుతు ఈనెల 16నుంచి తాము నిరవధిక సమ్మెలోకి దిగినా కేంద్రప్రభుత్వం, పోస్టల్ శాఖ ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్ యూనియన్ ప్రతినిధులు ఆరోపించారు. 2004కు ముందు నియమితులైన ఉద్యోగులకు పెన్షన్, పిఎఫ్, సెలవులు తదితర సమస్యలను కూడా పట్టించుకోవటం లేదని అన్నారు. వారం రోజుల సమ్మెతో గ్రామీణ ప్రాంతాలలలో పోస్టల్ సేవలు నిలచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవటాన్ని తప్పుపట్టారు. సత్వరం తమ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోకుంటే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.