వరంగల్

ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరిస్తే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, ఆగస్టు 22: ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించినట్లైతే వందశాతం ప్రమాదాలు నివారించవచ్చని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రీతిమీనా అన్నారు. జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్మెట్ ర్యాలీని మంగళవారం కలెక్టర్ స్థానిక ఎన్‌టిఆర్ స్టేడియంలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సృష్టిలో ఉన్న జీవుల్లో మానవ జన్మ చాలా గొప్పదన్నారు. మనిషిని మూడు భాగాలుగా విభజిస్తే అందులో తల ఎంతో ప్రధానమైందని, దానికి హెల్మెటే రక్షణకవచం అన్నారు. వాహనాన్ని నడిపేటప్పుడు హల్మెట్ ధరించాలని, ప్రతి ఒక్క కుటుంబం మీపై ఉంచుకున్న నమ్మకం అన్నారు.

వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలి
* రూరల్ కలెక్టర్ పాటిల్
రాయపర్తి, ఆగస్టు 22: వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకుని కుటుంబ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. మంగళవారం మండలంలోని సంపూర్ణ పారిశుధ్య స్వచ్ఛత గ్రామంగా ఎంపికైన రాగన్నగూడెం గ్రామాన్ని కలెక్టర్ పాటిల్ సందర్శించారు. గ్రామంలోని నిర్మిస్తున్న వ్యక్తిగత మరుగుదొడ్లను పరిశీలించారు. అనంతరం ఆయన గ్రామస్తులతో మాట్లాడుతు గ్రామంలోని వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం వలన పారిశుధ్యంతోపాటు కుటుంబ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవచ్చని చెప్పారు. మరుగుదొడ్ల నిర్మాణంపై అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి ప్రతి ఇంటి వద్ద మరుగుదొడ్డి నిర్మించుకునేలా కృషి చేయాలని తెలిపారు. మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం వందశాతం సబ్సిడీని అందచేస్తోందని అన్నారు. ఈ అవకాశానిన అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. మరుగుదొడ్ల నిర్మాణం నిర్మాణం, ప్రాధాన్యత గురించి ప్రజలకు వివరించి చైతన్యపరచాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం హరితహార కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, ఈ కార్యక్రమం కింద మొక్కలు నాటడమే కాకుండా నాటిన మొక్కలను పరిరక్షించే బాధ్యత మనపై ఉందని అన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులదని అన్నారు. సాదాబైనామాల ద్వారా రైతులకు పాసుపుస్తకాలు అందిస్తున్నామని, ఇకనుంచి గ్రామాలలో భూపంచాయతీలు తలెత్తకుండా రెవెన్యూ రికార్డులు శుద్ధీకరణ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలోని ప్రతి రైతుల భూముల వివరాలను సేకరించి, వాటిని క్రోడీకరించి భూపంచాయతీలు తలెత్తకుండా పక్కాగా ప్రణాళిక సిద్ధం చేసామని తెలిపారు.

కలెక్టర్ కార్యాలయంలో
బాల్కనీ పైనుండి జారిపడిన వృద్ధుడు
* గాంధీకి తరలింపు..చికిత్స పొందుతూ మృతి
* అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణం
జనగామ టౌన్, ఆగస్టు 22: తమగోడును కలెక్టర్‌కు తెలిపేందుకు వచ్చిన ఓ వృద్దుడు ప్రమాదవశాత్తు కలెక్టర్ కార్యాలయం బాల్కానిపై నుండి జరిపడి తీవ్ర గాయాలపాలై హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ సంఘటన మంగళవారం జనగామలో జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... జనగామ మండలం పెదరాంచర్ల గ్రామానికి చెందిన వంగ భూపాల్‌రెడ్డి (65) తమ భూ సమస్యలను కలెక్టర్‌కు విన్నవించుకుందుకు కలెక్టర్ కార్యాలయానికి వచ్చాడు. ఆ సమయంలో కలెక్టర్ కార్యాలయంలో లేకపోవడంతో కార్యాలయం మొదటి అంతస్థు కలెక్టర్ ఛాంబర్ పక్కనే ఉన్న బాల్కానిపై కూర్చున్నాడు. ప్రమాదవశాత్తు కాలు జారి సుమారు కింద పడిపోయాడు. బేంచ్‌పై పడి అక్కడినుండి నేలపై పడడంతో తలకు తీవ్ర గాయాలై ముక్కు, చెవిల్లో నుంచి రక్తస్రావం జరిగింది.

అధికార లాంఛనాలతో మాజీ మంత్రి సమ్మయ్య అంత్యక్రియలు
భారీగా తరలి వచ్చిన కాంగ్రెస్ నేతలు *అంతిమయాత్రలో పాల్గొన్న పొన్నాల, ఇనగాల, మాజీ చీఫ్‌విప్
*నివాళులు అర్పించిన కలెక్టర్, సిపి సుధీర్‌బాబు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు
పరకాల, అగస్టు 22: కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకుడు, మాజీ మంత్రి బొచ్చు సమ్మయ్య (78) అనారోగ్యంతో సోమవారం మృతి చెందగా మంగళవారం పరకాల పట్టణంలో బొచ్చు సమ్మయ్యకు ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. పరకాల పట్టణంలోని దళిత వాడకు చెందిన బొచ్చు సమ్మయ్య 10వ తరగతి వరకు పరకాలలోనే విద్య అభ్యసించారు. 1977లో కాంగ్రెస్ పార్టీలో చేరి 1978లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పరకాల నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ క్రమంలో రెండు పర్యాయాలు మంత్రిగా పరకాల షెడ్యూల్డ్ కులాల రిజర్వుడు నియోజకవర్గ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
*అంతిమయాత్రలో పాల్గొన్న పొన్నాల, మాజీ చీఫ్‌విప్, ఇనగాల...
మాజీ మంత్రి బొచ్చు సమ్మయ్య అంతిమయాత్రలో మాజీ టిపిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, పరకాల కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, జంగా రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కొండేటి శ్రీ్ధర్, పోడెం వీరయ్య, ఆరోగ్యం, డాక్టర్ విజయరామరావు, ఆరెపెల్లి మోహన్, మాజీ జడ్పి చైర్మన్ సాంబారి సమ్మారావులు పాల్గొన్నారు. మొదట సమ్మయ్య పార్ధివ దేహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఇనగాల వెంకట్రాంరెడ్డి కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి నివాళ్లు అర్పించారు. అనంతరం డప్పుచప్పుళ్ల మద్య భారీ సంఖ్యలో తరలి వచ్చిన కార్యకర్తలు అంతిమయాత్రలో పాల్గొన్నారు.