పశ్చిమగోదావరి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొవ్వూరు, సెప్టెంబర్ 19: కొవ్వూరు మండలం దొమ్మేరు రాష్ట్ర రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. దీంతో మృతుని తల్లితో పాటు కుటుంబ సభ్యులు, గ్రామస్థులు సంఘటన స్థలం వద్ద పెద్ద ఎత్తున రాస్తారోకో, ఆందోళన చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. వివరాల్లోకి వెడితే కొవ్వూరు మండలం దొమ్మేరు సావరానికి చెందిన టి రమేష్ (28) తూర్పుగోదావరి జిల్లా రాజానగరం వద్ద ఉన్న జిఎస్‌ఎల్ ఆసుపత్రిలో ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో మోటారుసైకిల్‌పై విధి నిర్వహణకు వెడుతుండగా కొవ్వూరు గామన్ ఇండియా బ్రిడ్జి మీదుగా ఏలూరువైపు వెడుతున్న లారీ దొమ్మేరులో రమేష్‌ను ఢీకొంది. ఈ సంఘటనలో రమేష్ అక్కడికక్కడే మృతి చెందగా ఢీకొట్టిన లారీ ఆగకుండా వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న గ్రామస్థులు, మృతుని బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహం వద్ద ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న కొవ్వూరు డిఎస్పీ ఎస్ వెంకటేశ్వరరావు, సిఐ పి ప్రసాదరావు, ఎస్సై కెవి రమణ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. విషయం తెలుసుకున్న కొవ్వూరు ఆర్డీవో బి శ్రీనివాసరావు, తహసీల్దారు విజయకుమార్ తదితరులు అక్కడికి చేరుకున్నారు. ఆందోళన తీవ్రతరం కావడంతో ట్రాఫిక్‌ను నియంత్రించే విషయంలో పోలీసులు లాఠీచార్జీకి పాల్పడ్డారని గ్రామస్థులు ఆరోపించారు. ఇదిలావుండగా ఉద్రిక్త పరిస్థితుల నడుమ మృతుడు సోదరుడు మహేష్‌ను, అతని స్నేహతుడ్ని పట్టణ పోలీసుస్టేషనుకు తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న టిడిపి నాయకులు జెవిఎస్ చౌదరి, మాజీ ఎంపిపి చిన్న తదితరులు పోలీసుస్టేషనుకు వచ్చి ఎస్సై రమణతో చర్చలు జరిపారు. ఆందోళనకారులతో డిఎస్పీ చర్చలు జరిపారు. ఈ లోగా పోలీసులు మెయిన్‌రోడ్డుపై వేసిన టెంటును తొలగించి ఆందోళనకారులను తప్పించి ట్రాఫిక్‌ను నియంత్రించారు. ఇదిలావుండగా మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని మృతుని తల్లి, గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గామన్ ఇండియా బ్రిడ్జి మీదుగా భారీ వాహనాలు దొమ్మేరు మీదుగా వెడుతుండడం వల్ల తరచు ప్రమాదాలు జరిగి అనేక మంది మృతి చెందుతున్నారని, ఈ విషయమై అధికారులకు ఎన్నిమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. బ్రిడ్జిపై పయనిస్తున్న భారీ వాహనాలను వేరే మార్గం ద్వారా మళ్లించాలని వారు డిమాండ్ చేశారు.