పశ్చిమగోదావరి

మోడల్ ఎలక్షన్’గా ఇంటింటికి తెలుగుదేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, సెప్టెంబర్ 19: తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ఒక మోడల్ ఎలక్షన్‌గా ముందుకు తీసుకువెళ్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే ముందుగానే పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేస్తోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలన్న సంకేతాలను పంపించింది. దీంతో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని చాలా పకడ్బందీగా నిర్వహిస్తోంది. ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుని ముందుకు సాగుతోంది. ఖచ్చితంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ఎవరెవరు హాజరయ్యారు, వేదిక మీద ఆశీనులైన వారు ఎందరు, ఇంటింటికి వెళ్తున్నారా, వెళ్ళి అక్కడ వారి నుంచి ఎటువంటి వివరాలు సేకరిస్తున్నారు, వారికి పార్టీ శ్రేణులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏం చెబుతున్నారు తదితర వివరాలన్నీ ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తున్నారు. ఇంటింటికి తెలుగుదేశం పేరుతో తిరిగిన ఆ ప్రాంతంలో ఎన్ని తెలుగుదేశం పార్టీకి ఓటర్లు ఉన్నారు, వైసిపి ఓటర్లు ఎంతమంది, వీరితో పాటు తటస్థ ఓటర్లు ఎంతమంది ఉన్నారో గుట్టుచప్పుడు కాకుండా ఒక నివేదికను పార్టీకి పంపుతున్నారు. పార్టీకి ఎంత శాతం ఆదరణ ఉంది, అసలు పార్టీ చేసే పనులు నమ్ముతున్నారా? ప్రతీ కుటుంబంలోని కుటుంబ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల్లో భాగస్వాములుగా ఉన్నారా అనేది కూడా నిశితంగా పరిశీలకులు పరిశీలిస్తున్నారు. ఈ రిపోర్టులను పార్టీకి పంపిస్తున్నారు. చాలా సీరియస్‌గా పార్టీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో పాటు పట్టణం, మండలం, గ్రామం అనే భేదాలు లేకుండా పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న వారు ఖచ్చితంగా అన్ని ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనాలి. నియోజకవర్గంపై ప్రతీ కార్యకర్తకు ఒక అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని భావించిన పార్టీ మండలాలు, పట్టణాలు అనే తేడాలు లేకుండా అన్నిచోట్ల పర్యటించి +వారి ద్వారా నివేదికలను తెప్పించుకుంటున్నట్టు సమాచారం.
ఇక తెలుగుదేశం పార్టీలోని క్రీయాశీలక పాత్ర పోషించేవారి కోసం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించారు. ఇది కేవలం పార్టీ శ్రేణుల కోసమే. కార్యకర్తల స్థాయిని బట్టి అధిష్ఠానం పేర్లను నమోదు చేసుకుని వారికి మాత్రమే ఈ యాప్ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటోంది. ఇంటింటికి తెలుగుదేశం పేరుతో ఆయా వార్డులు, గ్రామాలు, పట్టణాల్లో పర్యటించిన సమయంలో ఇంటింటికి వెళ్ళి వారి సమస్యలు తెలుగుకుని ఈ యాప్ ద్వారా ప్రభుత్వం వెబ్‌సైట్‌కి ఆయా డిపార్ట్‌మెంట్‌లకు సమాచారాన్ని పంపుతున్నారు. వారు ఆ ప్రాంతానికి వచ్చి వారి సమస్యను పరిష్కరిస్తారు. ఆ విధంగా ఓటరు కార్డు, రేషన్ కార్డు తదితర వాటిపై ఫిర్యాదు చేయడం, వెంటనే వారికి ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారాన్ని కూడా చేరవేస్తారు. అదే విధంగా ఇంటింటికి చేసే కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు జియోట్యాగింగ్ చేస్తారు. దీని ద్వారా ఎప్పటికప్పుడు ఏం జరుగుతోందన్న విషయాన్ని పార్టీ గమనిస్తోంది. తప్పుఒప్పులు ఏమైనా ఉంటే వెంటనే వారికి సమాచారాన్ని అందిస్తోంది. ప్రతీ ఇంటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాల గురించి చెప్పడమే లక్ష్యంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని పసుపుదళం చేపట్టింది.