పశ్చిమగోదావరి

అండర్ 19 బాస్కెట్ బాల్ పోటీల్లో విజేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉంగుటూరు, సెప్టెంబర్ 21: నారాయణపురం బాపిరాజు స్టేడియంలో అండర్ 19 బాస్కెట్ బాల్ పోటీల్లో విజేతల వివరాలను నిర్వాహకులు ప్రకటించారు. విశాఖ జట్టు విన్నర్స్‌గాను, గుంటూరు జట్టు రన్నర్స్‌గాను నిలిచారు. బాలికల విభాగంలో (45 కేజీల లోపువారికి) బాక్సింగ్ విజేతలుగా కె కవిత (విశాఖ) విన్నర్‌గాను, పి శిరీష (తూర్పు గోదావరి జిల్లా) రన్నర్స్‌గాను, 45నుంచి 48 కేజీల వారికి నిర్వహించిన పోటీలో ప్రీతిదుర్గ (విశాఖ), బి లక్ష్మి (తూ.గో.జిల్లా), 48నుంచి 51 కేజీల బాక్సింగ్‌లో యు గణేశ్వరి (విశాఖ), వి రేణుకాదేవి (కడప), 51నుంచి 54 వరకూ నిర్వహించగా, కె సంధ్య (విశాఖ), టి శిరీష (గుంటూరు), 54నుంచి 57 కేజీల్లో ఎన్‌విఎస్‌ఎన్ ఉమా హర్షిత (విశాఖ), కె ఎస్తేరురాణి (గుంటూరు), 60నుంచి 64 కేజీలలో బి వౌనిక (విశాఖ), సిహెచ్ హర్షిణి (కృష్ణా), 64నుంచి 66కేజీలలో షేక్ నజ్రీనా (తూ.గో.), వి హారికాబాయి (గుంటూరు), 66నుంచి 69 కేజీల విభాగంగా కెవిఎ పావని (కృష్ణా), కె అనూష (గుంటూరు), 69-70 కేజీలలో బి కీర్తిక (విశాఖ), పి లోకపావని (గుంటూరు)లు విజేతలుగా నిలిచారు.
బాలుర విభాగంలో విజేతలు
45 కేజీలలోపు పోటీల్లో వి ధర్మరాజు (విశాఖ), వి జయకుమార్ (పశ్చిమ), 46-49 కేజీల విభాగంగా జి వంశీ (విశాఖ), ఎం హేమంత్ కుమార్ (శ్రీకాకుళం), 49-52 విభాగంలో కె గోవింద్ (విశాఖ), కెటి అమర్‌నాధ్ (పశ్చిమ గోదావరి), 52-56 విభాగంలో ఎం సతీష్ (విశాఖ), పి రఘురామ్ (శ్రీకాకుళం), 56-60 విభాగంలో హెచ్ భానుప్రకాష్ (విశాఖ), ఆర్ అమర్‌నాధ్ (కర్నూల్), 60-64 విభాగంలో కెడి మాధవరావు (తూ.గో.జిల్లా), జె సుందర్‌బాబు (గుంటూరు), 64-69 కేజీల విభాగంలో పిఎస్‌ఎస్ సందీప్ (విశాఖ), జి శ్రీ్ధర్ (కర్నూల్), 69-75 కేజీల విభాగంలో ఎస్ నవీన్‌కుమార్ (విశాఖ), పి లక్ష్మణ సూర్య (తూ.గో.జిల్లా), 75-81 విభాగంలో ఎండి వజహత్ అలీ (విశాఖ), ఎ కిరణ్ (కర్నూల్), 81-91 కేజీల విభాగంలో ఎ మనోజ్‌వర్మ (ప.గో.జిల్లా), బి చంద్రయ్య (విశాఖ), 91కేజీల పై విభాగం పోటీల్లో పి యశ్వంత్ (విశాఖ), పి మణిదీప్ (అనంతపురం)లు విజేతలుగా నిలిచారు.
బాస్కెట్ బాల్ పోటీల్లో
బాస్కెట్ బాల్ పోటీలు సెమీ ఫైనల్స్‌కు చేరుకున్నాయి. పశ్చిమ గోదావరి, కృష్ణా, తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాల జట్లు సెమీ ఫైనల్స్‌కు చేరుకున్నాయి. విజయనగరం బాలికల జట్టుపై 8-20 తేడాతో పశ్చిమ గోదావరి జట్టు విజయం సాధించింది. విశాఖపై 9-14 తేడాతో కృష్ణా జిల్లా విజయం సాధించింది. గుంటూరుపై 10-19 తేడాతో తూర్పుగోదావరి జిల్లా జట్టు విజయం సాధించింది. చిత్తూరు జట్టు 10-15 తేడాతో అనంతపురం జట్టుపై విజయం సాధించింది. బాలుర విభాగంలో కర్నూల్ జట్టుపై గుంటూరు 21-30 తేడాతో విజయం సాధించగా, కడపపై అనంతపూర్ 1-16 తేడాతోను, ప్రకాశంపై విజయనగరం జట్టు 0-6 తేడాతో విజయం సాధించింది.
అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
ద్వారకాతిరుమల, సెప్టెంబర్ 21: శ్రీవారి శేషాషల కొండపైన ఒక ట్రావెల్స్ బస్సు గురువారం తెల్లవారు ఝామున అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. డ్రైవరు లేని సమయంలో క్లీనర్ వాహనాన్ని నడుపుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో అటుగా ఏవిధమైన వాహనాలూ రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల కథనం ప్రకారం హైదరాబాద్ నుండి ద్వారకాతిరుమలకు వచ్చిన ఒక ట్రావెల్స్ బస్సును డ్రైవరు కొండపై నిలిపి క్లీనర్‌కు అప్పగించి వెళ్లాడు. దీంతో క్లీనర్ బస్సును నడిపే క్రమంలో అది అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. వెనుక టైర్లు పగిలిపోవడంతో వాహనం అక్కడే నిలిచిపోయింది. ఇలావుండగా బస్సు ఆయిల్ ట్యాంకర్లోని డీజిల్‌ను దొంగిలించేందుకు కొండ కిందికి వెళ్లే క్రమంలో వాహనం అదుపుతప్పి ప్రమాదం జరిగిందని బస్సు యజమాని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.