పశ్చిమగోదావరి

యథేచ్ఛగా బయో పురుగు మందుల విక్రయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాళ్లపూడి, సెప్టెంబర్ 24: బయో పురుగు మందుల వినియోగం రైతులకు నష్టం తీసుకువస్తుందని, వీటిని అమ్మేందుకు అనుమతుల్లేవని ఒకపక్క శాస్తజ్ఞ్రులు చెబుతున్నా తాళ్లపూడి మండలంలో బయో పురుగుమందుల అమ్మకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. నలతగా ఉంటే సాధారణ వ్యక్తులు మందుల షాపులకు వెళ్లి మందు బిళ్ల ఇవ్వండని ఎలా అడుగుతారో అదేమాదిరిగా గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు తమ పంటల విషయంలో కూడా ఎదురయ్యే ఇబ్బందులను చెప్పి పురుగు మందుల షాపులవారిచ్చే మందులను నమ్మకంగా వాడుతుంటారు. ఈ నేపథ్యంలోనే పురుగు మందు షాపులవారు లాభాలు ఎక్కువగా వచ్చే బయో ఉత్పత్తులను రైతులకు నమ్మకంగా అమ్మేస్తున్నారు. వీటిని అమ్మేందుకు అనుమతులు లేకున్నా అధికారుల కన్నుగప్పి లక్షలాది రూపాయల బయో ఉత్పత్తులను ప్రతియేటా విక్రయించడం తాళ్లపూడి మండలంలో అలవాటుగా మారింది. గతేడాది సీజన్‌లో వ్యవసాయ శాఖ జెడి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించినప్పటికీ ఈ ఏడాది తిరిగి బయో ఉత్పత్తులను అమ్మటం ప్రారంభించారు. తాళ్లపూడి మండలంలో 17 పురుగు మందుల షాపులుండగా దాదాపు అందరూ బయో ఉత్పత్తులను విక్రయిస్తుండగా, వేగేశ్వరపురంలో మాత్రం అధిక మొత్తంలో బయో ఉత్పత్తులు విక్రయిస్తున్నారు. అంతేకాక వీటిని రహస్య ప్రదేశంలో ఉంచి విక్రయిస్తున్నారు. బయో ఉత్పత్తులకు బిల్లుగానీ,, ఈపోస్ ద్వారా గానీ అమ్మకాలు జరగవు. ఇటీవల తాళ్లపూడి మండలానికి వచ్చిన మార్టేరు పరిశోధనా సంస్థ శాస్తజ్ఞ్రులు బయో ఉత్పత్తులను వాడవద్దని, వీటికి అనుమతుల్లేవని హెచ్చరించారు. అంతేకాక వీటిని వాడిన తరువాత ఇతర రకాల తెగళ్లు కూడా పంటలకు వచ్చి పాడవుతాయని రైతులకు హెచ్చరించారు. బయో ఉత్పత్తుల అమ్మకంపై తాళ్లపూడి వ్యవసాయాధికారిణి రత్నప్రభను వివరణ కోరగా, బయో ఉత్పత్తుల విక్రయాలు తన దృష్టికి రాలేదని, దీనిపై పర్యవేక్షిస్తామని తెలిపారు.
ఆర్టీసీ సర్వీసుకు ఆదాయం సమకూర్చాలి

*ఎమ్మెల్యే బండారు
మొగల్తూరు, సెప్టెంబర్ 24: కాళీపట్నం బస్సు సర్వీసును ప్రయాణీకులు వినియోగించుకుని ఆర్టీసికి ఆదాయం సమకూర్చాలని నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు అన్నారు. ఆదివారం మొగల్తూరు మండలం కాళీపట్నం గ్రామంలో నరసాపురం ఆర్టీసి అధికారులు ఏర్పాటుచేసిన నరసాపురం-్భమవరం (వయా మొగల్తూరు, కాళీపట్నం, దిరుసుమర్రు, యనమదుర్రు) వరకు వేసిన నూతన బస్సు సర్వీసును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. బస్సు సర్వీసులు వేయటం చాలా తేలికని, దానిని నిలబెట్టుకోవడానికి గ్రామానికి చెందిన ప్రయాణికులు 100 శాతం వినియోగించుకోవాలని కోరారు. ఆర్టీసి సర్వీసుకు ఆదాయం లేకపోతే అధికారులు తక్షణం సర్వీసును నిలిపివేస్తారన్నారు. అటువంటి పరిస్థితి రాకుండా గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రయాణికులు సర్వీసును కాపాడుకోవాలన్నారు. ఆయన వెంట నరసాపురం ఏరియా ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ బండారు రాజా పటేల్ నాయుడు, ఎఎంసి ఛైర్మన్ రాయుడు శ్రీరాములు, మాజీ ఎంపిపి కొండేటి రామకృష్ణ, గ్రామ ఎంపిటిసి మాదాసు బొండయ్య, గ్రామ సర్పంచ్ మారుబోయిన సుజాత అప్పారావు తదితరులు పాల్గొన్నారు.