పశ్చిమగోదావరి

సొసైటీ సభ్యులకు మెరుగైన సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, సెప్టెంబర్ 24 : ఇరిగేషన్ డిపార్టుమెంట్ ప్రొవిన్షియల్ వర్క్స్ ఛార్టర్డ్ మినిస్టీరియల్ అండ్ లాస్ట్ గ్రేడ్ ఎంప్లాయిస్ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సభ్యులకు మెరుగైన సేవలందించాలని జలనవరుల శాఖ ఎస్‌ఇ కె శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం స్థానిక ఐఎడిపి హాలు వద్ద ఇరిగేషన్ ఉద్యోగుల సొసైటీ 34వ మహాజన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఎస్‌ఇ శ్రీనివాసరావు మాట్లాడుతూ సొసైటీని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత సభ్యులపైనే వుందని, సకాలంలో రుణాలు తీసుకోవడం, పొదుపు చేసుకోవడం నిర్వహించుకుని అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. సంఘ కార్యదర్శి జవంగుల బాపయ్య మాట్లాడుతూ సొసైటీ ద్వారా 2016-17 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదిక రిపోర్టును ప్రవేశపెట్టారు. షేరుధనంపై 13 శాతం డివిడెంట్ ఇచ్చే అంశాన్ని ప్రవేశపెట్టారు. 2017-18 సంవత్సరపు అంచనా బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టడంతో సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. కార్యదర్శి నివేదికలో ఈ ఏడాది సెప్టెంబర్ 17వ తేదీ వరకు ప్రగతిని, జమాఖర్చులను అంశాల వారీగా వివరించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యుల పిల్లల విద్యా ప్రతిభను పరిగణనలోకి తీసుకుని 2016-17 సంవత్సరానికి ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. 10వ తరగతికి చెందిన ఏడుగురికి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు చొప్పున, ఇంటర్మీడియట్‌కు చెందిన ఒక్కొక్కరికి 1200 రూపాయలు చొప్పున, డిగ్రీకి చెందిన విద్యార్ధికి 1500 రూపాయలు అందజేశారు. కార్యక్రమంలో సంఘ సహాయ కార్యదర్శి దేవ రమణకుమార్, డైరెక్టర్లు విప్పర్తి అంబెట్ బాబు, కొల్లాటి ఉమామహేశ్వర నాగరాజు, భూక్యా వెంకటేశ్, యాసలపు శ్రీను, సిబ్బంది నాగరాజు, సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమానికి విశిష్ట అతిధులుగా ఆర్‌ఎస్ హరనాధ్, సిహెచ్ శ్రీనివాసరావు, ఎస్‌ఎస్ సత్యనారాయణ, కె మల్లికార్జునరావు, కెపి వెంకన్న, కెవి భాస్కరరావులు హాజరయ్యారు.
తొలి మంచు కురిసింది..
ద్వారకాతిరుమల, సెప్టెంబర్ 24: అప్పుడే తొలి మంచు కురిసింది. శీతాకాలం రాకుండానే కమ్మిన మంచుతెరలు చూపరులను కనువిందు చేశాయి. ప్రముఖ క్షేత్రమైన ద్వారకాతిరుమల పరిసర ప్రాంతాలను ఆదివారం ఉదయం మంచు దుప్పటి కమ్మింది. ఉదయం 8.30 గంటలైనా భానుడి జాడ తెలియరాలేదు. ద్వారకాతిరుమల-్భమడోలు రహదారిలో ప్రయాణించే వాహనదారులకు మంచు కినె్నరలు కాస్త ఇబ్బంది కలిగించాయి. అలాగే గొల్లగూడెం చెరువు పరిసర ప్రాంతాలను మంచు చుట్టుముట్టింది. ఒక్కసారిగా దట్టంగా మంచు కురవడంతో అప్పుడే చలికాలం చొరబడిందన్న సంకేతాలు కనిపించాయి. ఏదేమైనా ఆదివారం కనిపించిన మంచు తెరల నడుమ ప్రకృతి రమణీయ దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి.