పశ్చిమగోదావరి

లోక్ అదాలత్‌తో కేసుల పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, డిసెంబర్ 12: రాజీమార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవడానికి లోక్‌అదాలత్ ఒక అద్భుతమైన అవకాశమని జిల్లా ఇన్‌ఛార్జి ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్ధ అధ్యక్షులు ఎ హరిహరనాధశర్మ అన్నారు. స్దానిక జిల్లా కోర్టు ఆవరణలో శనివారం జాతీయ లోక్‌అదాలత్ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కక్షిదారులు రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించుకుని కేసుల నుండి విముక్తి పొందడానికి జాతీయ లోక్‌అదాలత్ ఒక వేదిక అన్నారు. ఇరువర్గాలవారు కేసులు నుండి బయటపడాలనే తపన కలిగి ఇరువురి అంగీకారంతో ముందుకువస్తే లోక్‌అదాలత్ వారిని కేసులు నుండి విముక్తి కలిగిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ చట్టాలపట్ల అవగాహన కలిగి చట్టాలను గౌరవించాలని, మన హక్కులు, బాధ్యతలు తెలుసుకుని మంచిపౌరులుగా సమాజంలో జీవనం సాగించాలని ఆయన కోరారు. వివాదరహిత సమాజానికి అందరూ ముందడుగు వేయాలన్నారు. ప్రతి చిన్న విషయానికి తగాదాల జోలికి పోకుండా విజ్ఞతతో మెలగాలని, తగాదాల వల్ల ఆర్దికంగా ఎంతో నష్టపోవడమే కాకుండా ఎంతో విలువైన సమయం వృధా అవుతుందన్నారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న అన్నిరకాల సివిల్, బ్యాంకు రుణాలు, టెలిఫోన్ బకాయికేసులు, వివాహ సంబంధ కేసులు, రెవిన్యూ, ట్రాన్స్‌కో, మోటారు వాహన ప్రమాద నష్టపరిహార కేసులు, చట్టప్రకారం రాజీ చేసుకోదగిన అన్నిరకాల క్రిమినల్ కేసులు ఈ జాతీయ లోక్‌అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చునన్నారు. రెండవ అదనపు జిల్లా జడ్జి వై లక్ష్మణరావు మాట్లాడుతూ అక్రమంగా, అనధికారికంగా చీటీవ్యాపారం నిర్వహించటం చట్టరీత్యానేరమని అటువంటి అనధికారికంగా నిర్వహించే చీటీలలో ఎవరూ పాల్గొనవద్దని ఆయన సూచించారు. ఎవరైనా అనధికారికంగా చీటీవ్యాపారం నిర్వహిస్తుంటే ఆ సమాచారాన్ని పోలీసులకుగాని, లోక్‌అదాలత్‌కుగాని తెలియజేయాలన్నారు. ఏలూరు డిఎస్పీ కెజివి సరిత మాట్లాడుతూ లోక్‌అదాలత్‌ల ద్వారా అవగాహన పెరిగి రాజీమార్గం ద్వారా అనేకమంది కేసులు పరిష్కరించుకుంటున్నారన్నారు. 8వ అదనపు జిల్లా జడ్జి కె సాయిరమాదేవి మాట్లాడుతూ ఏ ఒక్కరూ ఇతరులతో పోల్చుకుని గొప్పలకు పోయి ప్రతి చిన్నదానికి అవసరం ఉన్నా లేకపోయినా అప్పులు చేయకూడదని, అలా చేయటం వల్ల ఆర్దికంగా ఇబ్బందులు పడటమే కాకుండా సంఘంలో గౌరవప్రతిష్ఠలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఫ్యామిలీ కోర్టు, 7వ అడిషనల్ జిల్లా జడ్జి సిబి సత్యనారాయణ మాట్లాడుతూ ఖాళీ ప్రామెసరీ నోట్లపై ఎవ్వరూ సంతకాలు చేయవద్దని సూచించారు. సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు సిఎపి శ్రీనివాసరామానుజాచార్యులు, లీగల్ లిటరసీ రిసోర్స్‌పర్సన్ కె రామకృష్ణారావు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారులు, భూసేకరణ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పారిజాతగిరిలో విశేష పూజలు
జంగారెడ్డిగూడెం: స్థానిక గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శనివారం భక్తులు విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు నల్లూరు రవికుమారాచార్యులు ఆధ్వర్యంలో తెల్లవారు ఝామున స్వామివారికి సుప్రభాత, తోమాల సేవ, అర్చన సేవలు నిర్వహించారు. తీర్థ ప్రసాదగోష్ఠి అనంతరం ప్రత్యేకాలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయానికి వచ్చిన భక్తులకు నరసన్నపాలెంకు చెందిన మందపాటి వెంకటేశ్వరరావు దంపతులు, జంగారెడ్డిగూడెంకు చెందిన పిట్టల దుర్గాసురేష్ దంపతులు అన్నప్రసాద వితరణ జరిపించారు. ఈ కార్యక్రమాలలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెనె్మత్స విశ్వనాధరాజు (శివ), ఆలయ అభివృద్ది కమిటి సభ్యులు పేరిచర్ల జగపతిరాజు, కాకాని శ్రీహరిరావు, బిక్కిన సత్యనారాయణ, రాజాన సత్యనారాయణ, దండు ధనరాజు, కంది బాలకృష్ణారెడ్డి, రెడ్డి రంగప్రసాదరావు, పోరూరి వెంకటరావు, మాదల రామ్మోహనరావు పాల్గొన్నారు.