పశ్చిమగోదావరి

ఇంటింటికి టిడిపిలో సమస్యల వెల్లువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరవాసరం, అక్టోబర్ 12: తమ సమస్యలు పరిష్కరించాలంటూ మండల కేంద్రం వీరవాసరంలో ప్రజలు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. అడుగడుగునా సమస్యలపై నేతలను నిలదీశారు. కార్యక్రమంలో పాల్గొన్న భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు వాహన శ్రేణి ముందు బైఠాయించి నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళితే... మండల కేంద్రం వీరవాసరం గ్రామంలో గురువారం భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. వీరవాసరం పెద్ద వీధిలో మురుగునీటి సమస్యపై సామాజిక కార్యకర్త నక్కెళ్ల శివరామకృష్ణ ఆధ్వర్యంలో మహిళలు ఆందోళనకు దిగారు. నడిరోడ్డుపై ఉన్న మురుగునీటిలో ఎమ్మెల్యే కాన్వాయ్ ముందు బైఠాయించారు. దీనితో ఎమ్మెల్యే రామాంజనేయులు వాహనం దిగివచ్చి, శివరామకృష్ణతో చర్చించారు. రహదారి పల్లంగా ఉండటంతో నీరు నిలిచిపోతోందని ఎన్నోసార్లు పంచాయతీ కార్యదర్శి, ఎంపిడిఒకు మొరపెట్టుకున్నా ఫలితంలేదని ఈసందర్భంగా శివరామకృష్ణ తెలిపారు. మహిళలు కూడా ఎమ్మెల్యేకు ఆ వీధి సమస్యను వివరించారు. 24 గంటల్లో సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే రామాంజనేయులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కోళ్ళ నాగేశ్వరరావు హామీయివ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం పెద్ద వీధి రామాలయం వద్ద పూడి సత్యనారాయణ ఆధ్వర్యంలో 50 మంది మహిళలు రహదారి సమస్యను ఎమ్మెల్యేకు వివరించారు. సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీయిచ్చారు. అలాగే కొత్తపేటలో పలువురు మహిళలు రహదారి, డ్రైనేజీ సమస్యలపై టిడిపి నాయకులతో వాగ్వివాదానికి దిగారు. ప్రజలతో ఎమ్మెల్యే మాట్లాడుతుండగా వీరవాసరం సొసైటీ అధ్యక్షుడు నూకల అప్పాజీ కలగచేసుకోవడంతో స్థానికులు ఆయనపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమ్మెల్యే తమ సమస్యలను వింటుంటే, మధ్యలో మీ పెత్తనం ఏంటంటూ మహిళలు ఆగ్రహించారు. కొత్తపేట ఏరియాలో నూతనంగా కుళాయి కనెక్షన్లు ఇచ్చారని అయితే నీరు రావడం లేదని మహిళలు వివరించారు.
అనంతరం టిడిపి గ్రామ అధ్యక్షులు ఆదిరెడ్డి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ సమస్యల్లేని గ్రామంగా వీరవాసరంను తీర్చిదిద్దుతానని హామీయిచ్చారు. గ్రామంలో ముఖ్యంగా తాగునీరు, డ్రైనేజీ సమస్యలున్నాయని, వాటి పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. పంచాయతీ కార్యదర్శి జెడివి ప్రసాద్‌ను సమావేశం వద్దకు పిలిపించి వెంటనే పెద్దవీధిలోని డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. అక్కడే ఉన్న ఎఎంసి చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ శివరామకృష్ణ లేవనెత్తిన సమస్యను వెంటనే పరిష్కరించాలని, ఎన్ని అడ్డంకులు వచ్చినా లెక్కచేయవద్దని ఆదేశించారు. ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్ పి విక్టోరియా మహారాణి, ఎఎంసి డైరక్టర్లు గొలగాని సత్యనారాయణ, కడలి నెహ్రు, నీటి సంఘం అధ్యక్షులు ఆదిరెడ్డి గంగారావు, శివాలయం ఛైర్మన్ ఆదిరెడ్డి శంకర అప్పారావు, మోపిదేవి విశే్వశ్వరరావు, వీరవల్లి శ్రీనివాసరావు, ఆదిరెడ్డి దుర్గారావు, పీతల సుబ్రహ్మణ్యం, మద్దాల రాంబాబు, ముక్కు నాని, గొర్రె కృష్ణమూర్తి, కంచర్ల శివాజీ కుమార్, మతల సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.