పశ్చిమగోదావరి

బయోమెట్రిక్ తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, అక్టోబర్ 16 : ప్రభుత్వం నుంచి డబ్బు రూపంలో జీతం పొందుతున్న ప్రతీ ఒక్కరూ బయోమెట్రిక్ అటెండెన్సు వేయాల్సిందేనని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ స్పష్టం చేశారు. అలాగే పాలనాపరమైన వ్యవహారాలన్నీ ఇ- ఆఫీస్‌లోనే కొనసాగాలని, క్రిందిస్థాయి సిబ్బందికి కూడా ఈ విషయంలో శిక్షణ అందించాలని కలెక్టర్ చెప్పారు. జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ శాఖలోనూ తప్పనిసరిగా 90 శాతం బయోమెట్రిక్ అటెండెన్సు నమోదు కావాలని పేర్కొన్నారు. అలాగే ఇక నుంచి వి ఆర్‌వోలు, తహశీల్దార్లు, పంచాయితీ సెక్రటరీలు వారి నివేదికలను ఇ- ఆఫీస్‌లో పంపాలని పేర్కొన్నారు. దీనికి సంబంధించి వారికి అవసరమైన శిక్షణ అందించాలని చెప్పారు. ప్రతీ శాఖ తనకు పంపి ఇ- ఆఫీస్‌లో అనుమతి పొందిన తరువాత ఆ శాఖ అధిపతికి పంపే ఫైళ్లకు కూడా ప్రభుత్వం సాఫ్ట్‌వేర్ రూపొందించిందని చెప్పారు. శాఖ వారీ హోదాలు, ఇతర వివరాలు తీసుకుని మ్యాపింగ్ చేయాలని ఎన్ ఐసి అధికారులను కలెక్టర్ ఆదేశించారు. చంద్రన్న బీమాపై జరిగిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ పంచాయితీల్లో 22, డిసిహెచ్ ఎస్ దగ్గర 3, పోలీసు, మున్సిపల్ కార్పొరేషన్లలో పెండింగ్ సర్ట్ఫికెట్లను త్వరితగతిన ఇవ్వాలని, దీని వలన క్లెయిమ్‌లను సకాలంలో అందించడానికి అవకాశం వుంటుందని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్ ఉండకూడదని స్పష్టం చేశారు. మీ-సేవలో ఇపిడిసి ఎల్ పరిధిలో గడువు దాటి 32, సివిల్ సప్లయిస్‌లో 7, తూనికలు, కొలతల్లో 3, నర్సాపురం మున్సిపాల్టీల్లో 24 సమస్యలున్నాయని, వాటిని సోమవారం సాయంత్రానికల్లా పరిష్కరించాలని ఆదేశించారు. మీ-కోసంలో జిల్లాస్థాయిలో వచ్చిన దరఖాస్తులు గడువుదాటి 31, క్షేత్రస్థాయిలో 110 వున్నాయని, వాటిని కూడా త్వరితగతిన పరిష్కరించాలని స్పష్టం చేశారు. పరిష్కార వేదిక 1100లో జిల్లాస్థాయిలో 43, క్షేత్రస్థాయిలో 154 సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించాలని, తిరిగి పరిశీలించాల్సిన దరఖాస్తులు 101 వున్నాయని, వాటి విషయంలోనూ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రతీ శాఖ వారు పట్టికలో పరిష్కారాలు శూన్య నివేదిక అందించాలని కలెక్టర్ ఆదేశించారు. దేవాదాయ శాఖ, రిజిస్ట్రేషన్లు, స్టాంప్స్, రెవిన్యూలలో క్రిందిస్థాయి వారిని ఇంకా ఎంప్లాయిస్ మాస్టర్ డేటా ఫైల్ హెడ్స్ రూపొందించలేదని, వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జిల్లా వ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ నెల 31 వరకు పారిశుద్ధ్యంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించామన్నారు. జిల్లాలోని 8 మున్సిపాల్టీలు, ఒక నగర పంచాయితీలో ఈ కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంపై లైసన్ అధికారులుగా నియమితులైన వారు ప్రత్యేక శ్రద్ధ చూపాలని చెప్పారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు, జెసి-2 ఎంహెచ్ షరీఫ్, డి ఆర్‌వో కె హైమావతి, జడ్పీ సి ఇవో డి సత్యనారాయణ, ఇరిగేషన్ ఎస్ ఇ శ్రీనివాసరావు, ఆర్‌డబ్ల్యు ఎస్ ఎస్ ఇ అమరేశ్వరరావు, డి ఆర్‌డి ఏ పిడి కె శ్రీనివాసులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఎడి డి ప్రసాదరావు, డ్వామా పిడి ఎం వెంకటరమణ, డి ఎంహెచ్ ఓ డాక్టర్ పి కోటేశ్వరి, డిసిహెచ్ ఎస్ డాక్టర్ కె శంకరరావు, సర్వే, లాండ్ రికార్డ్స్ ఎడి లాల్ అహ్మద్, ఎస్‌సి కార్పొరేషన్ ఇడి ఝాన్సీరాణి, సోషల్ వెల్ఫేర్ డిడి రంగలక్ష్మీదేవి, ఆర్ అండ్ బి ఎస్ ఇ నిర్మల, డి ఇవో గంగాభవానీ, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.