పశ్చిమగోదావరి

నేను సైతం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసాపురం, అక్టోబర్ 17: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు పురష్కరించుకొని మంగళవారం పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక సర్కిల్ కార్యాలయం వద్ద రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన సబ్ కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ రాక్తదానం చేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రక్తదానంతో ఎంతోమంది ప్రాణాలు కాపాడవచ్చన్నారు. 18 నుంచి 50 ఏళ్ల వయస్సున్న ఆరోగ్యవంతులు ఎవరైనా రక్తదానం చేయవచ్చని సబ్ కలెక్టర్ అన్నారు. కార్యక్రమంలో డిఎస్పీ టిటి ప్రభాకరబాబు, సిఐ సుబ్బారావు, ఎస్సై చంద్రశేఖర్, ఎఎస్సైలు శ్రీమన్నారాయణ, ముత్యాలరావు, రెడ్‌క్రాస్ యెనుమల సతీష్ తదితరులు పాల్గొన్నారు
ఇదోరకం అంకితభావం

ఏలూరు, అక్టోబర్ 17 : ఈ అధికారి విధి నిర్వహణలో చూపుతున్న అంకితభావం చూస్తే ముఖం ప్రకాశవంతంగా వెలగకమానదు. అయితే ఒక్కటే తేడా... ఆయన సస్పెన్షనలో వున్నారు. అందువల్లే నేమో అసలు కుర్చీలో కాకుండా ఎదురుగా వున్న మరో కుర్చీలో కూర్చుని యధాప్రకారం విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఏలూరులోని మెప్మా కార్యాలయంలో దర్శనమిచ్చిన దృశ్యమిది. ప్రాజెక్టు డైరెక్టర్‌గా పనిచేస్తున్న ప్రకాశరావుపై సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే. ఇంతకుముందు ఏలూరు ఎంపిడివోగా పనిచేసిన కాలంలో మరుగుదొడ్ల నిర్మాణాలకు సంబంధించి జరిగిన గోల్‌మాల్ విషయంలో ఇప్పటికే పలు క్రమశిక్షణా చర్యలు తీసుకున్న యంత్రాంగం కొద్దిరోజుల క్రితం అప్పటిలో ఎంపిడివోగా పనిచేసిన ప్రకాశరావును సస్పెన్షన్‌లో ఉంచుతూ ఉత్తర్వులు జారీచేసింది. అయితే ఆయన మంగళవారం కూడా యధాప్రకారం విధులు నిర్వహిస్తూ దర్శనమిచ్చారు. కాగా ఆయన కార్యాలయానికి సంబంధించిన ఫైళ్లను పరిశీలిస్తూ సంతకాలు కూడా చేశారని కార్యాలయ సిబ్బందే పేర్కొంటున్నారు. అయితే సస్పెన్షన్ కాలంలో ఆయన సంతకాలు ఏ విధంగా చెల్లుతాయి అన్న సందేహం రాకమానదు. అయితే దానికి మరో తరుణోపాయం కూడా వుందని కార్యాలయ వర్గాలే చెబుతున్నాయి. పాత తేదీలతో కొత్త సంతకాలు చేస్తూ యధాప్రకారం వ్యవహారాలను ముందుకు తీసుకువెళుతూ సస్పెన్షన్ ఇబ్బంది లేకుండా కొనసాగిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే జిల్లా మొత్తంగా చూస్తే క్రమశిక్షణా చర్యలకు సంబంధించి వ్యవహారాలు చాలా వరకు ఇలాగే ఉన్నాయన్న విమర్శలు కూడా లేకపోలేదు. ఉన్నతాధికారులు పరుష పదజాలం వాడుతున్నారని, చీటికీ మాటికి చర్యల వ్యవహారాన్ని తెరపైకి తీసుకువస్తున్నారంటూ ఉద్యోగ వర్గాల నుంచి ఎంతోకాలంగా విమర్శలు వినిపిస్తూనే వున్నాయి.
అదే నాణేనికి మరో కోణంగా మెప్మా వ్యవహారాలు కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. వాస్తవానికి ఏలూరు మండలం వెంకటాపురం పంచాయతీ పరిధిలో మరుగుదొడ్ల నిర్మాణాలకు సంబంధించి గోల్‌మాల్ వ్యవహారంపై స్థానికులు న్యాయస్థానానికి ఫిర్యాదు చేసిన నేపధ్యంలో ఈ తేనెతుట్టె భారీగా కదిలింది. ఆ తరువాతే వరుస విచారణలు, నివేదికలు అనంతరం వాటి ఆధారంగా పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్లు వంటివి చకచకా జరిగిపోయాయి. ఆ తరువాత పంచాయతీ సర్పంచ్‌పై కూడా వేటుపడింది. అయితే అప్పట్లో మండలాధికారిగా పనిచేసిన ప్రకాశరావు విషయంలో పెద్దగా కదలిక లేకపోవడం గమనించిన స్థానికులు ఆయనకు కొందరు ప్రజాప్రతినిధులు అభయహస్తం ఇచ్చారని, అందువల్లే ఆయనపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారన్న అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. చివరకు ఈ వ్యవహారం చిలికిచిలికి గాలివానగా మారడంతో జిల్లా యంత్రాంగం ఆయనపై సస్పెన్షన్ వేటువేసింది. అప్పట్లో ఎంపిడివోగా పనిచేసిన ప్రకాశరావు ఆ తరువాత మెప్మా ప్రాజెక్టు డైరెక్టరుగా విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా సస్పెన్షన్‌కు గురైన ప్రకాశరావు యధాప్రకారం మరో కుర్చీలో కూర్చుని విధులు నిర్వహిస్తుండటం పట్ల అధికార వర్గాల్లోనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.