పశ్చిమగోదావరి

రైతు శ్రేయస్సే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం, అక్టోబర్ 22: రైతు శ్రేయస్సే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని, రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీలు, విత్తనాలు, రుణాలు సకాలంలో అందిస్తున్నట్టు బిజెపి కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు బొమ్మారెడ్డి వెంకట నాగచంద్రారెడ్డి అన్నారు. మండలంలోని మైసన్నగూడెంలో బిజెపి రూరల్ మండల అధ్యక్షుడు పారేపల్లి వీరవెంకట సత్యనారాయణ అధ్యక్షతన ఆదివారం జరిగిన మండల కిసాన్ మోర్చా సమావేశంలో ఆయన ప్రసంగించారు. పంటల బీమా పథకం, కూరగాయల పంటలు పండించే రైతులకు పందిళ్లు వేసుకునేందుకు హెక్టారుకు 2.50 లక్షల రూపాయల సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు. ఈ సమావేశంలో మండల కిసాన్ మోర్చా అధ్యక్షునిగా కుర్రు నాగరాజు ఎన్నికయ్యారు. నాగరాజుకు నియామకప పత్రాన్ని బొమ్మారెడ్డి అందజేసారు. మండల కిసాన్‌మోర్చా ప్రధాన కార్యదర్శిగా పసుపులేటి కిషోర్, కార్యవర్గ సభ్యులుగా పారేపల్లి సుబ్రహ్మణ్యం, పేరాబత్తుల వెంకటరావు నియమితులయ్యారు. నూతనంగా ఎన్నికైన కిసాన్‌మోర్చా అధ్యక్ష, కార్యదర్శులను బిజపి సీనియర్ నేత మల్లాది సీతారామారావు, మండల ఇన్‌ఛార్జి మాటా రామ్మోహనరావు, డివివి సత్యనారాయణరాజు, కామవరపుకోట మండల అధ్యక్షుడు ఒంటెద్దు ఏసుబాబు, కిసాన్‌మోర్చా నేతలు యర్రావుల బాబూరావు, బ్రహ్మాచారి, కుర్రు ప్రభాకరరావు, ఏసులంక కృష్ణ, కురుకూరి చిన్న సూర్యారావు, బల్లె నవీన్, చంటి, మూర్తి, బాలం నరేష్ తదితరులు అభినందించారు.

పంట కాలువలో లారీ బోల్తా
ఆకివీడు, అక్టోబర్ 22: ఆకివీడు నుండి ఉండి వైపు వెళ్లే లారీ అజ్జమూరు చెక్‌పోస్టు సమీపాన అదుపు తప్పి పంట కాల్వలో బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయట పడ్డారు. నెల్లూరు జిల్లా నుండి ఉండి గ్రామానికి రొయ్యల మేత లోడుతో వెడుతున్న లారీ శనివారం అర్ధరాత్రి సమయంలో చెక్‌పోస్టు సమీపాన జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి పంట కాల్వలో బోల్తా పడింది. అయితే డ్రైవరు రంగయ్య, క్లీనర్ విష్ణు లారీ నుండి దూకేయడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమీప ప్రాంతానికి చెందిన ప్రజలు వారిని సురక్షితంగా బయటకు తీసి వైద్య సదుపాయం అందించారు.