పశ్చిమగోదావరి

పంచాక్షరినామ జపంతో పులకించిన గోదావరి తీరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆచంట, అక్టోబర్ 22:ప్రకృతి రమణీయతతో కూడిన పవిత్ర వశిష్టగోదావరి నదీ తీరంలో గోదావరి నది సవ్వడిలో పచ్చని కొబ్బరి వనాల నడుమ ఏకాదశ రుద్రులకు 11లక్షల రుద్రాక్షపూజ కన్నులపండువగా నిర్వహించారు. ప్రముఖ పండితులు గోపావజ్జుల మాధవశర్మ ఆధ్వర్యంలో సాక్షాత్తూ వారణాశి నుండి రప్పించిన 11లక్షల రుద్రాక్షలతో శివలింగ స్వరూపాన్ని తయారుచేసి దానికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఆచంట మండలం కోడేరులోని డొక్కాసీతమ్మ, వెలిచేటి సూర్యకాంతమ్మల ప్రాంగణంలో ఆదివారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు వివిధ రకాల పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి హాజరైన భక్తులు గోదావరి నదిలో స్నానమాచరించి పూజల్లో పాల్గొన్నారు. 40 మంది వేదపండితులు, అర్చకులు నాలుగు వేదాలను పారాయణ చేయడంతోపాటు రుద్రాక్షలతో అలంకరించిన పరమశివునికి పెద్ద ఎత్తున ఆవుపాలు, పెరుగు, పంచదార, నేయి, వట్టివేళ్లు, వివిధ రకాల పండ్లరసాలతో అభిషేకం చేశారు. ముందుగా విఘ్నేశ్వరపూజతో ప్రారంభమైన ఈపూజా కార్యక్రమంలో సూర్యనమస్కారాలు, సుందరకాండ పారాయణం, చండీపారాయణం, మహాలింగార్చన, రుద్రహోమం, లక్ష్మీనారాయణ పూజ, నవగ్రహ జపాలు, వేదపారాయణ లు నిర్వహించారు. ఈ సందర్భంగా పొట్టిశ్రీరాములు తెలుగుయూనివర్సిటీ జ్యోతిష్య విభాగం ఆచార్య డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం ఆధ్యాత్మిక ప్రసంగం గావించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయపార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.