పశ్చిమగోదావరి

రూ.20 కోట్లతో పర్యాటకాభివృద్ధి: కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, నవంబర్ 17 : జిల్లాలో 20 కోట్ల రూపాయలతో పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో శుక్రవారం పర్యాటక అభివృద్ధిపై అధికారులతో కలెక్టరు సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సిద్ధాంతం, కొవ్వూరు పట్టణాలలోని గోదావరి నదీ తీర ప్రాంతంలో పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు కాటేజీలు, కాన్ఫరెన్స్ హాల్స్, రెస్టారెంట్లు, వాటర్ స్పోర్ట్స్, రిసార్ట్స్ నిర్మాణాలకు గాను 14.45 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇందుకోసం సిద్ధాంతం వద్ద 7.74 ఎకరాలు, కొవ్వూరు పట్టణంలోని హేవలాక్ బ్రిడ్జి వద్ద గోదావరి గట్టు వద్ద 9.90 ఎకరాల భూమిని గుర్తించడం జరిగిందన్నారు. కొరుటూరు వద్ద 80 లక్షల రూపాయలతో కాటేజీలు, పర్యాటకులకు సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని, వీటిని పర్యాటకులకు వినియోగంలోనికి తీసుకురావలసిందిగా అటవీ శాఖాధికారులను కలెక్టరు ఆదేశించారు. దొంగరావిపాలెం, వలందర రేవు గోదావరి తీర ప్రాంతాలలోనూ, పెద్దమల్లం వద్ద మాచేనమ్మ దేవాలయం వద్ద పర్యాటకులకు కాటేజీలు, రెస్టారెంట్లు, తదితర సౌకర్యాలను పర్యాటకులకు 3.45 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని వీటి పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో పర్యాటక ప్రదేశాలను గుర్తించి ఆయా ప్రదేశాలలో పర్యాటక రంగ అభివృద్ధికి, పర్యాటకులకు సౌకర్యాలు ఏర్పాటుకు మరో 67 కోట్ల రూపాయలతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించడం జరిగిందని కలెక్టర్ చెప్పారు. జిల్లాలోని పేరుపాలెం బీచ్, గోదావరి నదీ తీర ప్రాంతాలలో పర్యాటకుల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టరు అధికారులను ఆదేశించారు. పర్యాటకానికి అనుమతి ఉన్న లాంచీలు, బోట్లను మాత్రమే అనుమతించాలని, లాంచీలు, బోట్లలో సామర్ధ్యానికి మించి ప్రజలను అనుమతించవద్దన్నారు. సామర్ధ్యంలో కనీసం 50 శాతం మేర లైఫ్ జాకెట్లు లాంచీలు, బోట్లలో తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతీ లాంచీలోనూ, బీచ్‌లలోనూ, వాటర్ స్పోర్ట్స్‌కు అనుమతి ఉన్న ప్రదేశాలలో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. లైఫ్ జాకెట్లు, లైఫ్ గార్డ్స్ లేకుండా ఏ లాంచీకాని, బోట్ కానీ నీటిలో విహారానికి వెళ్లడానికి వీలు లేదని కలెక్టరు స్పష్టం చేశారు. లాంచీలు, బోట్లు పరిస్థితిని ఇరిగేషన్ శాఖాధికారులతో పరీక్షించిన అనంతరమే అనుమతులు మంజూరు చేయాలన్నారు.
రూ.11 కోట్లతో కల్చరల్ సెంటర్
కళలకు నిలయమైన హేలాపురి నగరంలో 11 కోట్ల రూపాయల వ్యయంతో కల్చరల్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. బౌద్ధ్ధర్మానికి నిలయమైన వేంగీ నగరంగా పేరుగాంచిన హేలాపురి నగరంలో 73 అడుగుల బుద్ధుని విగ్రహంతోపాటు బుద్ధా పార్కు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. రెండు ఎకరాల విస్తీర్ణంలో ఈ కల్చరల్ సెంటర్‌లో ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్, ఆర్ట్ గ్యాలరీ, పార్కింగ్ సౌకర్యం, కాంపౌండ్ వాల్, ఆడిటోరియం, మినీ కాన్ఫరెన్స్ హాలు, స్టోర్ రూమ్, స్ట్ఫా రూమ్‌లతోపాటు వెయిటింగ్ లాంఛ్, ల్యాండ్ స్కేపింగ్, సీలింగ్ సౌకర్యాలను కల్పించడం జరుగుతుందని అడుగడుగునా కళాత్మకత ఉట్టిపడేలా ఈ సాంస్కృతిక భవనం తీర్చిదిద్దాలని ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్ పర్యాటక శాఖాధికారులను ఆదేశించారు.
సమావేశంలో సెట్‌వెల్ సి ఇవో సిహెచ్ సుబ్బిరెడ్డి, ఎపి టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇ ఇ ఎస్ శ్రీనివాస్, సహాయ పర్యాటక శాఖాధికారి పట్ట్భారామయ్య, డ్వామా పిడి గణేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.