పశ్చిమగోదావరి

జిల్లాలో రెండు లక్షల ఎల్‌ఇడి వీధి దీపాల ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, నవంబర్ 17 : జిల్లాలోని అన్ని గ్రామాల్లో కూడా వీధి దీపాలను మార్పు చేసి ఎల్ ఇడి దీపాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నామని ఎల్ ఇడి దీపాల రాష్ట్ర కో ఆర్డినేటర్ పరదేశ్‌కుమార్ అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం ఇవో ఆర్‌డిలు, గ్రామ కార్యదర్శులు, పి ఆర్ ఉద్యోగులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పరదేశ్‌కుమార్ మాట్లాడుతూ అన్ని గ్రామాలు కూడా డిసెంబర్ 1వ తేదీ నుంచి వెనె్నల గ్రామాలుగా రూపొందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఎల్ ఇడి వీధి దీపాల ఏర్పాటు వల్ల పంచాయితీలపై ఎటువంటి భారం పడదని స్పష్టం చేశారు. ప్రస్తుతం వచ్చే విద్యుత్ బిల్లులో ఎల్ ఇడి దీపాల వాడకం వలన 80 శాతం ఖర్చు తగ్గుతోందని, ఈ వచ్చిన ఆదాయాన్ని పది సంవత్సరాల్లో ఎల్ ఇడి దీపాల నిర్వాహకులకు చెల్లించాల్సి వుంటుందని పేర్కొన్నారు. క్వాలిటీ లైట్లు ఏర్పాటుచేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో ఎల్ ఇడి దీపాలుంటే కనుక మిగిలిన ప్రాంతాల్లో కూడా వాటిని ఏర్పాటు చేసి వాటిని అనుసంధానం చేయాలని పేర్కొన్నారు. గ్రామాల్లో ఎల్ ఇడి దీపాల ఏర్పాటు వలన వివిధ సెంటర్లలో జంక్షన్ బాక్సులను కూడా ఏర్పాటు చేయాలనే చెప్పారు. ఈ బాక్సుల ఏర్పాటు వలన ఏ ప్రాంతంలోనైనా వీధి దీపం వెలగకపోతే వెంటనే నమోదవుతుందని, తద్వారా తక్షణమే మరమ్మత్తులు, మార్పులు చేసే అవకాశం వుందని చెప్పారు. గ్రామాల్లో ప్రస్తుతం వున్న దీపాల స్థానంలో ఎల్ ఇడి దీపాల ఏర్పాటుకు, ఇందుకు కావాల్సిన వైర్లను, అదనపు స్థంభాలు అవసరమైతే ఈ నెల 16వ తేదీన మీ-సేవ కేంద్రంలో నమోదు చేయాలని చెప్పారు. ఏ పంచాయితీ అయినా నమోదు చేయకపోతే వారి గ్రామంలో పూర్తిస్థాయిలో లైన్లు వున్నట్లుగా ఖరారు చేస్తామన్నారు. ఆయన వెంట సి ఇవో సత్యనారాయణ, డిపివో వెంకటరమణ, రిటైర్డ్ సి ఇవో కుమారస్వామి, నెడ్‌క్యాప్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.