పశ్చిమగోదావరి

68.69 కోట్లతో పాలకొల్లులో అభివృద్ధి పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకొల్లు, నవంబర్ 19: పాలకొల్లులో ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం సందర్భంగా చేపట్టాల్సిన అభివృద్ధి కోసం రూ. 68.69 కోట్లు మంజూరు చేస్తున్నట్టు పురపాలక శాఖా మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆదివారం స్థానిక ప్రధానమంత్రి ఆవాస యోజన, ఎన్టీఆర్ గృహ సముదాయ నిర్మాణ పనులు పరిశీలనకు వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మట్లాడారు. స్థానిక యడ్ల బజారులో డంపింగు యార్డు తొలగింపునకు కోటి రూపాయలు కోరారని, ఇక్కడే దానిని మంజూరు చేస్తున్నానని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 110 మున్సిపాల్టీలు ఉన్నాయని, మరో 100 మున్సిపాల్టీలను పెంచాలని, ఉన్న మున్సిపాల్టీల పరిధి పెంచాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా ఉన్నారని, పంచాయితీల పాలకవర్గం గడువు పూర్తయిన తరువాత ఈ పనులు చేబడతామని ఆయన వెల్లడించారు. పేదల కోసం నిర్మించే గృహల గురించి రష్యా, బ్రటిన్, జపాన్, మలేషియా వంటి దేశాల్లో చంద్రబాబు తాను పర్యటించినప్పుడు పేదలకు కూడా నాణ్యమైన గృహాలు నిర్మించిన పద్ధతి చూసి అటువంటి గృహాలను ఆంధ్రప్రదేశ్‌లో ఇవ్వాలని చేసిన నిర్ణయం వల్ల ఇప్పుడు దేశంలోనే పేదలకు ఇళ్లు సంపన్నుల గృహాలు ఏవిధంగా ఉంటాయో అ విధంగా నిర్మిస్తున్నామన్నారు. భూకంపాలు వచ్చినా చెక్కు చెదరని పద్దతిలో నిర్మాణం చేస్తున్నామని, రాష్ట్రంలో అతి పెద్ద నిర్మాణ సంస్థలకు నాణ్యతలో రాజీపడకుండా నిర్మించే వారికి ఈ పనులు అప్పగించామని ఆయన వెల్లడించారు. వెంకయ్యనాయుడు కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో నిర్మిస్తున్న గృహాల గురించి చెప్పటంతోనే అయిదు లక్షలు గృహాలకు మంజూరు ఇచ్చారని, భారతదేశంలో 37 రాష్ట్రాల్లో 20 లక్షల గృహాలు మంజూరు చేశారని ఆయన చెప్పారు. పాలకొల్లు అభివృద్ధికి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పడే తపన చాలగొప్పదని, ఎప్పుడు వచ్చినా ఏదో ఒక కాగితం తెస్తారని, అ పనిచూసి చేస్తానని అనే వరకు కదలరని, అలా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్న తపన చాల మంచిదని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఏ మున్సిపాల్టీకి ఇవ్వనంతగా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాను నిధులు పాలకొల్లుకు వచ్చాయని ఆయన చెప్పారు. సభకు ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు అధ్యక్షత వహించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు వెనకడుగు వేయడం లేదని, అవసరమైతే హడ్కో రుణం తెచ్చి రాష్ట్రంలో ప్రజలు అవసరాలు తీర్చమని తమకు ఆదేశాలు జారీ చేశారని ఆయన వెల్లడించారు. నిరంతరం పనిచేస్తూ రాజధాని నిర్మాణంలో చంద్రబాబు, నారాయణ కలిసి చేస్తున్న ఆలోచన పరంగా తాత్కాలిక అసెంబ్లీయే గొప్పగా నిర్మించారని, ఇక అసలు అసెంబ్లీ సెక్రటేరియట్ భవనాలు నిర్మిస్తే ఎంత గొప్పగా ఉంటాయో ఊహించుకోవచ్చని ఆయన చెప్పారు. ఎమ్మెల్సీ అంగర రామమోహన్ మాట్లాడుతూ కూడు, గుడ్డ, గూడు అనే నినానాదంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారని, కేంద్ర సహకారంతో రాష్ట్రంలో అయిదు లక్షల కార్పోరేట్ స్థాయి గృహాలు పేదలకు కట్టి ఇవ్వటం ఒక రికార్డని అన్నారు. జగన్ పాదయాత్ర దేని కోసం చేస్తున్నారో తెలియదని, రాష్ట్రంలో ప్రజల కోసం అన్నీ చేస్తున్న ప్రభుత్వం ఉండగా ఇంకా ఏదో చేస్తానని ప్రజలను మాటలతో మోసం చేస్తే నమ్మే స్థితిలో లేరన్నారు. ఎమ్మెల్యే రామానాయుడు చేస్తున్న అభివృద్ధికి అందరూ మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. మున్సిపల్ ఛైర్మన్ వల్లభు నారాయణమూర్తి తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణను ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల , ఎమ్మెల్సీ అంగర ఘనంగా సన్నానించారు. తొలుత మంత్రి 70 ఎకరాల్లో ఏడువేల మందికి ఎల్‌అండ్‌టి సంస్థ నిర్మిస్తున్న గృహ నిర్మాణ పనులను పరిశీలించారు. భీమవరం నుండి పాలకొల్లు వస్తున్న మంత్రి నారాయణకు ఘన స్వాగతం పలికారు. శివదేవుని చిక్కాల నుండి పాలకొల్లు వేదిక వరకు ఆయన మోటారు సైకిల్ నడిపి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ గొట్టుముక్కల గాంధీ భగవాన్‌రాజు, ఎంపీపీ పెనె్మత్స శ్రీదేవి, జడ్పీటీసీలు కోడి విజయలక్ష్మి, బోనం నాని, జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు, నర్సాపురం సబ్ కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ, మున్సిపల్ కమిషనర్ ఆళ్ల రామమోహనరావు, నర్సాపురం ఛైర్‌పర్సన్ పసుపులేటి రత్నమాల తదితరులు పాల్గొన్నారు. పాలకొల్లులో 15 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న మంచినీటి విస్తరణ పనులకు పురపాలక శాఖామాత్యులు పి నారాయణ ఆదివారం శంకుస్థాపన చేశారు.