పశ్చిమగోదావరి

ఇందిర ఆశయ సాధనకు కృషిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరపల్లి, నవంబర్ 19: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి ఇందిరా గాంధీ అని, ఆమె ఆశయ సాధనకు యువత కృషిచేయాలని డీసీసీ అధ్యక్షుడు ఎండీ రఫీయుల్లాబేగ్ పేర్కొన్నారు. దేవరపల్లిలో ఆదివారం ఇందిరా శత జయంతి ఉత్సవాలలో ఆయన పాల్గొన్నారు. ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు వెలగా రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రఫీయుల్లాబేగ్ మాట్లాడుతూ ఇందిరా దేశ ప్రజలతో మమేకమై సమర్థవంతమైన పాలన అందించారన్నారు. స్థానిక యాదవోలు రోడ్డులో ఉన్న ఇందిరా విగ్రహానికి పూలమాలలువేసి ఘన నివాళులర్పించారు. అలాగే గొల్లగూడెంలోని భారతీయ వికలాంగుల ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు పండ్లు, రొట్టెలు అందజేశారు. కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శులు జ్యేష్ట సతీష్‌బాబు, గెడ్డం సాయిబాబు, డీసీసీ ఉపాధ్యక్షుడు మట్టపర్తి రామ్మోహనరావు, డీసీసీ కార్యదర్శులు సీహెచ్ వెంకటేశ్వరరావు, జీ రామానాయుడు, పీసీసీ సంయుక్త కార్యదర్శి పీ గోవిందరావు, గోపాలపురం, కొవ్వూరు మండలాల ఆ పార్టీ అధ్యక్షులు మద్దాల కాశీవిశ్వనాధ సనారి, వెంపాటి సూర్యారావు, ఎస్ చంద్రశేఖర్, జీ సూరిబాబు, పీ చిన్నబ్బులు, కే శ్రీహరిబాబు, పీ గంగారావు, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. కాగా ఇందిరా శత జయంతి ఉత్సవాలలో భాగంగా ప్రారంభమైన రథయాత్ర ఆదివారం దేవరపల్లి చేరుకుంది. డీసీసీ అధ్యక్షుడు రఫీయుల్లాబేగ్ జెండా ఊపి రథ ప్రచారాన్ని దేవరపల్లిలో ప్రారంభించారు. ఈ నెల 9నుంచి ఈ రథయాత్ర జిల్లాలో 860 గ్రామాలలో ప్రచారం చేశామని, దేవరపల్లిలో రథయాత్రతో ఈ కార్యక్రమం ముగిసినట్టు డీసీసీ అధ్యక్షుడు తెలిపారు.