పశ్చిమగోదావరి

చిరుత కాదు...హైనా !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీలుగుమిల్లి, నవంబర్ 19: మండలంలోని కామయ్యపాలెం ప్రాంతంలో సంచరించే అడవి జంతువు చిరుతపులి అయి ఉండదని, హైనా (కొండ్రమోతు) అయి ఉంటుందని రైతులు చెప్పారు. ఆదివారం ఆ ప్రాంతాన్ని సందర్శించిన విలేఖరులతో బాధిత రైతు శిరిబత్తుల దుర్గారావు మాట్లాడుతూ లేగదూడపై దాడిచేసిన జంతువు చిరుతపులి కాకపోవచ్చన్నారు. నాలుగు రోజులుగా అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని అడవి జంతువు పాద ముద్రలు చూశామని, అయితే ఆ పాదముద్రలపై తాము అనుమానించకపోవడంతో శనివారం తెల్లవారు ఝామున అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న మామిడితోటలో తన పశువులపై దాడిచేసిందన్నారు. తన లేగదూడను చంపిందన్నారు. దూడను కట్టివేసిన కట్టుగర్ర బలంగా ఉండటంతో తాడు తెగిరాకపోవడంతో జంతువు దూడ పొట్టను చీల్చివేసి గుండెను తినేసిందని వివరించారు. దాడిచేసిన విధానం, అడుగు జాడలు హైనా (కొండ్రమోతు)విగా భావిస్తున్నామని చెప్పారు. ఈ విషయం అటవీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ వారు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేసారు. హైనా సంచారంపై భయాందోళనలు ఉన్నందున ఉన్నతాధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
డ్రైవర్ల అప్రత్తతతోనే ప్రమాదాల నివారణ
* జిల్లా రోడ్డు భద్రతా కమిటీ ఛైర్మన్, ఎంపి మాగంటి బాబు
ఏలూరు, నవంబర్ 19 : జిల్లాలో రోడ్డు ప్రమాదాలను పూర్తిస్థాయిలో నివారించడానికి డ్రైవర్లు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని అప్పుడే ప్రమాదరహిత జిల్లాగా పశ్చిమను తీర్చిదిద్దగలుగుతామని జిల్లా రోడ్డు భద్రతా కమిటీ ఛైర్మన్, ఏలూరు ఎంపి మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) కోరారు. స్థానిక పోలీసు కమ్యూనిటీ హాలులో ఆదివారం జిల్లాస్థాయి రోడ్డు భద్రతా కమిటీ ఛైర్మన్‌గా నియమితులైన మాగంటి బాబును రవాణా శాఖ అధికారులు ఘనంగా సత్కరించారు. డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ సత్యనారాయణమూర్తి దుశ్శాలువాతో మాగంటి బాబును సత్కరించి ప్రత్యేకంగా అభినందించారు. ప్రపంచ వ్యాప్తంగా జరిగే రోడ్డు ప్రమాదాలలో అత్యధికంగా భారతదేశంలోనే జరుగుతున్నాయని దేశంలో పశ్చిమగోదావరి ప్రమాదాల్లో కూడా ఫస్ట్ ఉన్నదని ఈ పరిస్థితిని తొలగించి పశ్చిమలో ప్రశాంత వాతావరణంలో ప్రయాణం జరుగుతుందనే నమ్మకం భరోసా ప్రజలకు ఇవ్వాలంటే ముందు ప్రతీ డ్రైవరూ విధి నిర్వహణలో మద్యం సేవించకూడదని, అనుక్షణం అప్రమత్తతతో జాగ్రత్తగా వాహనాన్ని నడిపినప్పుడే ప్రమాదాలు జరగవని మాగంటి కోరారు. కెపాసిటీకి మించి ఏ వాహనంలో కూడా అధికంగా ప్రయాణీకులను ఎక్కించవద్దని ముఖ్యంగా ఆటోల్లో స్థాయికి మించి రెట్టింపు ప్రయాణీకులు కనిపిస్తున్నారని దీని వలన ఆటో డ్రైవరుకు కొంత ఆర్ధిక వెసులుబాటు ఉన్నప్పటికీ దురదృష్టవశాత్తూ ప్రమాదం సంభవిస్తే ప్రజల ప్రాణానికే హాని జరుగుతుందని చెప్పారు. జిల్లాలో ఎక్కడెక్కడ రోడ్లు బాగోలేదో ముఖ్యంగా జాతీయ రహదారులను మరింత పటిష్టవంతంగా నిర్వహిస్తామని, త్వరలోనే విజయవాడ - ఏలూరు జాతీయ రహదారి గోతులు లేకుండా పటిష్టమైన రోడ్డు నిర్మించాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తగు ఆదేశాలు జారీ చేసిందని పనులు మరింత వేగవంతంగా జరిగేలా చూస్తామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఎ ఆర్ అదనపు ఎస్‌పి మహేష్‌కుమార్, ఆర్‌టిసి ఆర్ ఎం ధనంజయరావు, రవాణా శాఖాధికారులు నాగమురళి, సుమ, సిద్ధిక్, ప్రసాద్, పౌల్ రాజు, వినోద్ తదితరులు పాల్గొన్నారు.