పశ్చిమగోదావరి

ఇంకా పనిచేయని ధాన్యం కొనుగోలు కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమడోలు, నవంబర్ 21 : మరికొద్దిరోజుల్లో వరికోతలు పూర్తికానున్నప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ధాన్యం కొనుగోలు చేయడం ప్రారంభించకపోవడం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలుచేసిన ధాన్యాన్ని తరలించే విషయమై ఐకెపి, పౌర సరఫరాల శాఖ, మిల్లర్ల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఐకెపి ఆధ్వర్యంలో కొనుగోలు చేసే ధాన్యాన్ని ఏ మిల్లుకు తరలించాలనే విషయమై స్పష్టత లేకపోవడం కారణంగా పేర్కొనవచ్చు. గత సీజన్‌లో డిసిసిబి ఆధ్వర్యంలో రెండు, ఐకెపి ఆధ్వర్యంలో నాలుగు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా సుమారుగా 70 కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఐకెపి ఆధ్వర్యంలో భీమడోలు మండలంలో మూడు కొనుగోలు కేంద్రాలను మాత్రమే ప్రారంభించారు. వీటిని కూడా మండల పరిధిలోని 50 శాతం కోతలు పూర్తయ్యాక ప్రారంభించడం జరిగింది. తాజాగా ఏ మండల పరిధిలోని ధాన్యాన్ని ఆ మండలంలోనే అమ్మాలనే షరతు అధికారుల పరిశీలనలో వున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఇంకా పూర్తిస్థాయి నిర్ణయం తీసుకోకపోవడం వలన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనే పని ప్రారంభం కాలేదని చెప్పవచ్చు. అధికారులు త్వరితంగా స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనే ధాన్యాన్ని ఏ ఏ మిల్లులకు పంపించాలనే విషయంపై నిర్ణయం తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. రెండుమూడు రోజుల్లో ఉపరితల ఆవర్తనం వలన వర్షాలు పడే అవకాశం వున్నందున పొలాల్లో వుండే ధాన్యం తడిస్తే తాము నష్టపోయే ప్రమాదముందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నవ్యాంద్రకు ప్రాణం వ్యవసాయం
*అసెంబ్లీలో ఎమ్మెల్యే నిమ్మల
పాలకొల్లు, నవంబర్ 21: నవ్యాంధ్రకు ప్రాణం వ్యవసాయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తించారని, దీనికోసం ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయటంతోపాటు వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌తో కొత్త రూపాన్ని ఇస్తున్నారని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మంగళవారం అసెంబ్లీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పుంత రోడ్ల అభివృద్ధి, లింకు రోడ్లను వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా పూర్తిచేయాలని, రబీకి 25 టీఎంసీల నీరు కేటాయించాలని, కోనసీమ ప్రాంతంలో పూల నర్సరీలను అభివృద్ధి చేయాలని, కొబ్బరికి గిట్టుబాటు ధర ఇవ్వాలని సభలో కోరినట్టు ఆయన తెలిపారు.

భూముల్లోకి ప్రవేశించిన పట్టాదారులు
*అడ్డుకున్న పోలీసులు
గోపాలపురం, నవంబర్ 21: మండలంలోని భీమోలు గ్రామానికి చెందిన పట్టాదారులు మంగళవారం గ్రామశివారులో ఉన్న భూములను దునే్న ప్రయత్నం చేశారు. సమాచారం తెలుసుకున్న గోపాలపురం, కొయ్యలగూడెం ఎస్సైలు యు లక్ష్మీనారాయణ, సూర్యభగవాన్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పట్టాదారులతో మాట్లాడుతూ సమస్య న్యాయస్థానంలో ఉన్నందున ఎవరూ ఈ స్థలంలోకి రావద్దని హెచ్చరించి పంపించి వేశారు.