పశ్చిమగోదావరి

పేదలకు ‘దివ్య దర్శనం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరవాసరం, నవంబర్ 21: దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో దివ్యదర్శనం పేరుతో ఎస్సీ, ఎస్‌టి, బిసి సామాజిక వర్గాలలోని పేద వారికి ప్రభుత్వం ఉచితంగా రాష్ట్రంలో వివిధ ప్రముఖ దేవాలయాల సందర్శన భాగ్యం కల్పిస్తోందని దేవాదాయ, ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ దుర్గాప్రసాద్ తెలిపారు. మంగళవారం వీరవాసరం శ్రీ వీరేశ్వర, విశే్వశ్వర దేవాలయం నుండి మండలంలోని సుమారు 200 మంది భక్తులు నాలుగు బస్సుల్లో దివ్యదర్శనానికి బయలుదేరి వెళ్లారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో భక్తులతో అసిస్టెంట్ కమిషనర్ దుర్గాప్రసాద్ ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యదర్శనం పేరిట ప్రముఖ దేవాలయాల సందర్శన ముఖ్య ఉద్దేశంగా సమాజంలో హిందూ ధర్మాన్ని పాటిస్తూ ఆర్థికంగా వెసులుబాటు లేని ఎస్సీ, ఎస్‌టి, బిసి సామాజిక వర్గాల్లో వారిని సంవత్సరానికి 10 వేల మందిని ప్రభుత్వం ఉచిత దర్శనానికి పంపిస్తుందన్నారు. 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల లోపు వయసుల భక్తులు ఆన్‌లైన్ ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోవచ్చన్నారు. వారికి ముందుగా అవకాశం లభిస్తుందని చెప్పారు. దివ్యదర్శనంలో నెల్లూరు జిల్లా జొన్నాడ పట్టణంలోగల కామాక్షితాయి అమ్మవారి ఆలయం, చిత్తూరు జిల్లాలోగల శ్రీకాళహస్తేశ్వరస్వామి దేవస్థానం, అలాగే తిరుచానూరులో గల శ్రీ పద్మావతి అమ్మవారి దేవస్థానం, అనంతరం తిరుమల తిరుపతి, కర్నూలు జిల్లా అహోబిలంలోగల నరసింహస్వామి వారి దేవస్థానం, శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దేవస్థానం, త్రిపురాంతకంలోగల శ్రీత్రిపురాంతకేశ్వరి అమ్మవారి దేవస్థానం భక్తుల సందర్శిస్తారన్నారు. బస్సులో భక్తులకు భోజన సదుపాయంతోపాటు వసతి ప్రభుత్వమే కల్పిస్తుందని చెప్పారు. నాలుగు రోజులపాటు దివ్యదర్శన యాత్ర కొనసాగుతుందని దుర్గాప్రసాద్ వివరించారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం దివ్యదర్శనానికి వెళ్లే భక్తులకు కంకణాలు, కండువాలు మత్స్యపురి దేవస్థానం ఈవో సత్యనారాయణరాజు, వీరవాసరం గ్రూపు దేవాలయాల ఈవో షణ్ముగం అందజేశారు. అలాగే దివ్యదర్శనానికి వెళ్లే వారికి ఆలయ ప్రాంగణంలో అల్పాహారాన్ని అందించారు. ఇతరులు కూడా వారికి బిస్కెట్లు, ఫలాలు అందజేశారు. ఉదయం 7.45 గంటలకు ఆలయ ప్రాంగణం వద్ద నుండి మండల టిడిపి అధ్యక్షుడు పోలిశెట్టి దాసు జెండా ఊపి దివ్యదర్శన యాత్రను ప్రారంభించారు. మేళతాళాలతో ఊరేగింపుగా సాగనంపారు. కార్యక్రమంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ట్రస్టుబోర్డు ఛైర్మన్ మద్దాలా రాంబాబు, పట్టణ టిడిపి కార్యదర్శి ముక్కు నాని, మత్స్యపురి గ్రామ సర్పంచ్ దిబ్బల నాని, మద్దాల నాగరాజు, కొణితివాడ దేవస్థానం ఛైర్మన్ నాగరాజు శ్రీనివాసరాజు, దేవాలయాల ఇన్‌స్పెక్టర్ కర్రి శ్రీనివాసరావు, ఆలయ పూజారులు కొడమంచిలి దుర్గాప్రసాద్, నాగేశ్వరరావు, శ్రీనివాసుల రాంబాబు, చేబ్రోలు ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.