పశ్చిమగోదావరి

ప్రమాదాల నివారణకు కృషిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, నవంబర్ 21: జిల్లాలోని పోలీసు ఉద్యోగులంతా అంకితభావంతో విధులు నిర్వహించి ప్రమాదాల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్‌పి ఎం రవిప్రకాష్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్‌పి వి రత్నతోపాటు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ నేరాలు, ఘోరాలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పెండింగ్‌లో వున్న కేసులన్నీ కూడా దర్యాప్తు పూర్తిచేయాలని, ఎన్‌బిడబ్ల్యు క్లీరెన్స్ చేయాలని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు హైవే మొబైల్స్ యొక్క సిబ్బంది ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రమాదం జరిగినప్పుడు అత్యవసర చర్యలు తీసుకునే హైవేలపై క్షతగాత్రులను హైవేలకు దగ్గరలో వున్న ఆసుపత్రులలో జాయిన్ చేయాలని, నేర నియంత్రణ కోసం సిబ్బంది అందరూ పనిచేయాలని ఆదేశించారు. పెండింగ్ ట్రయల్‌లోని కేసుల్లో సాక్షులను కోర్టులో హాజరుపర్చి నేరస్తులకు శిక్ష పడేలా అందరూ కూడా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసుస్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల రిసెప్షనిస్టులు మర్యాదగా నడుచుకోవాలని, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ గురించి విస్తృతంగా అపార్టుమెంట్ల వద్ద, గృహ వ్యాపార సముదాయాల వద్ద ప్రచారం చేయాలన్నారు. ప్రతీ పోలీసుస్టేషన్ల పరిధిల్లో ముఖ్య కూడళ్ల వద్ద సిసి కెమేరాలు ఏర్పాటు చేయించి కంట్రోల్ రూమ్‌ల ద్వారా అధికారులు పర్యవేక్షణ చేయాలని, తద్వారా నేర దర్యాప్తునకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. నేర సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందుపర్చాలని, డయల్ 100కు వచ్చే సమాచారంపై సత్వర చర్యలు తీసుకోవాలని, సంబంధిత అధికారులు నేరస్థలానికి వెళ్లాలని, ప్రతీ రోజూ, ప్రతీ పోలీసు స్టేషన్ పరిధిలో అధికారులు సాయంత్రం వేళలందు విజుబుల్ పోలీసింగ్ చేయాలని ఆదేశించారు. క్రికెట్ బెట్టింగ్, పేకాట, కోడిపందాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. రౌడీషీటర్ల కార్యకలాపాలపై ప్రత్యేక పర్యవేక్షణ జరపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు కే ఈశ్వరరావు, సీహెచ్ మురళీకృష్ణ, వెంకటేశ్వరరావు, ప్రసాదబాబు, జీ శేఖర్, నున్నా మురళీకృష్ణ, పైడేశ్వరరావు, శ్రీనివాసరావు, పీ భాస్కరరావు, ఎస్‌బి సీఐ కొండలరావు, డీసీఆర్‌బీ సీఐ జీవీ కృష్ణారావులతోపాటు సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు. సబ్ డివిజన్ల వారీగా, సర్కిళ్ల వారీగా కేసుల పెండింగులపై సమీక్షించారు.

చింతలపూడి ద్వారా రెండు లక్షల ఎకరాలకు సాగునీరు
ఏలూరు, నవంబర్ 21 : చింతలపూడి ఎత్తిపోతల పధకం ద్వారా మెట్ట ప్రాంతంలోని రెండు లక్షల ఎకరాలకు 2018 నాటికి సేద్యపునీరు అందించి మెట్ట ప్రాంత రైతులకు ఆనందం కలిగిస్తామని ఎంపి మాగంటి బాబు చెప్పారు. టి నర్సాపురం, చింతలపూడి, లింగపాలెం, కామవరపుకోట తదితర 16 మండలాలకు చెందిన రైతులు, ప్రజాప్రతినిధులు మాగంటిని మంగళవారం ఏలూరు క్యాంపు కార్యాలయంలో కలిసి మెట్ట ప్రాంత భూములకు సాగునీటితోపాటు తాగునీరు కూడా చింతలపూడి ఎత్తిపోతల పధకం ద్వారా అందించాలని కోరారు. దీనిపై మాగంటి బాబు స్పందిస్తూ రెండు వేల కోట్ల రూపాయల వ్యయంతో చింతలపూడి ఎత్తిపోతల పధకాన్ని చేపట్టి 68 కిలోమీటర్ల పరిధిలోని మెట్ట ప్రాంతంలో 191 గ్రామాలలోరెండు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి సౌకర్యం కల్పించడానికి చర్యలు వేగవంతం చేయడం జరిగిందని, వచ్చే ఖరీఫ్ నాటికల్లా చింతలపూడి ద్వారా సేద్యపునీరు అందించి తీరతామని ఈమేరకు ముఖ్యమంత్రి పనుల పురోగతిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని చెప్పారు. మెట్ట ప్రాంతంలో ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని, 300 అడుగుల పైబడి బోర్లు వేస్తేనే గానీ సేద్యపునీరు సాధ్యం కావడం లేదని ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో వ్యవసాయం ఇబ్బందికరంగా మారేదని చింతలపూడి ఎత్తిపోతల పధకం వలన భూగర్భ జలాలు కూడా పరిరక్షించడం జరుగుతుందని చెప్పారు. ప్రతీ పల్లెలో ప్రజలు వివాహ, ఇతర వేడుకలు జరుపుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక మల్టీపర్పస్ భవనాన్ని నిర్మించాలని నిర్ణయించిందని, దీని వలన ప్రజలు సభలు, సమావేశాలు ఇతర వివాహ వేడుకలు ఈ భవనంలో జరుపుకునే విధంగా ఆధునిక భవనాన్ని ప్రతీ పల్లెలో నిర్మిస్తామని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీటిసిలు గంటా సుధీర్‌బాబు, చలపతిరావు, తాళ్లూరి రాధారాణి, జంగారెడ్డిగూడెం జడ్పీటిసి శీలం రామచంద్రరావు, జీలుగుమిల్లి జడ్పీటిసి బాసిన రాజబాబు, చింతలపూడి టిడిపి నాయకులు ఎం ముత్తారెడ్డి, వివిద గ్రామాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను మాగంటి బాబుకు విన్నవించగా దీనిపై ఆయా శాఖల అధికారులతో మాగంటి బాబు ఫోన్‌లో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు.