పశ్చిమగోదావరి

పునరావాస గ్రామాల్లో ఇళ్లు బాగున్నాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, నవంబర్ 21: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు కల్పించిన పునరావాస గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన గృహాలు బాగున్నాయని ఆర్‌ఆర్ ప్యాకేజీ కేంద్ర కమిటీ సభ్యురాలు మీనానాయర్, లతా కృష్ణారావు అన్నారు. అయతే చిన్న చిన్న సమస్యలున్నాయన్నారు. మంగళవారం వీరిరువురు పునరావాస గ్రామాలు, ఖాళీ చేయాల్సిన గ్రామాల్లో పర్యటించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ చదువుకున్న గిరిజన యువకుల్లో ఇంగ్లీషుపై అవగాహన తక్కువగా ఉందని, వారికి శిక్షణ ఇప్పించాల్సి ఉందన్నారు. ఉదయం 12 గంటలకు వారి పర్యటన ప్రారంభం కావాల్సి ఉండగా, పది గంటలకే ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి చేరుకున్న వారికి ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు కె భాస్కర్, కార్తికేయ మిశ్రా స్వాగతం పలికారు. అక్కడ నుండి రామన్నపాలెం పునరావాస గ్రామానికి చేరుకున్న వారు అంగన్‌వాడీ భవనాన్ని పరిశీలించారు. నిర్మాణం పూర్తికాని స్కూలు భవనం పరిశీలించి నిర్వాసితులను తరలించి మూడేళ్లు పూర్తియినా స్కూలు భవన నిర్మాణం ఎందుకు పూర్తికాలేదని కలెక్టర్‌ను ప్రశ్నించారు. ఈ గ్రామంలో విద్యార్థులు ఎక్కడ చదువుకుంటున్నారని గ్రామస్థులను అడగడంతో పక్కనే ఉన్న గార్లగొయ్యి గ్రామంలో చదువుతున్నారని బదులిచ్చారు. అలాగే 40 కుటుంబాల వారికి 70 సెంట్ల చొప్పున వ్యవసాయ భూమి కేటాయించారని, వాటికి ఇప్పటివరకు పట్టాలు ఇవ్వలేదని కొవ్వాసి అబ్బులు అనే నిర్వాసితుడు తెలిపారు. అనంతరం రెండో ఫేజ్‌లో ఖాళీ చేయాల్సిన కొత్తూరు గ్రామానికి చేరుకుని నిర్వాసితులతో మాట్లాడారు. 18 సంవత్సరాలు నిండిన యువతులకు ప్యాకేజీ ఇవ్వడం లేదని, ముందుగా ఖాళీ చేసిన ఏడు గ్రామాలకు ఇచ్చిన విధంగా ప్యాకేజీ ఇవ్వాలని చక్రాల పోసిరత్నం అనే నిర్వాసితురాలు కోరింది. కలెక్టర్ భాస్కర్ వారితో మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన యువతులకు పెళ్లిళ్లు కావడంతో వారు ప్యాకేజీలకు అనర్హులని తెలిపారు. అలాగే భూమికి పరిహారం పాత చట్టం ప్రకారమే చెల్లించారని, ప్యాకేజీ కొత్త చట్టం ప్రకారం ఇస్తామని కలెక్టర్ చెప్పారు. అక్కడ నుండి ప్రాజెక్టు క్యాంపు కార్యాలయానికి చేరుకుని ప్రాజెక్టు నమూనా ద్వారా వివరాలు తెలుసుకున్నారు. ఆర్‌అర్ ప్యాకేజీ అమలుపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వారికి వివరించారు. కార్యక్రమంలో జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆర్‌అర్ కమిషనర్ జి రేఖారాణి, సిడబ్ల్యూసీ సీఈ పచౌరి, అథారిటీ మెంబరు సెక్రటరీ ఎస్‌కె శ్రీవాత్సవ, ఈఎన్‌సీ ఎం వెంకటేశ్వరరావు, సీఈ విఎస్ రమేష్‌బాబు, జేసీ పి కోటేశ్వరరావు, భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.