పశ్చిమగోదావరి

ఏలూరు జోన్‌లో రూ.8600 కోట్ల లావాదేవీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, నవంబర్ 23 : ఆంధ్రాబ్యాంకు 118 బ్రాంచీల ద్వారా ఏలూరు జోన్ పరిధిలో 8600 కోట్ల రూపాయలు లావాదేవీలు నిర్వహిస్తున్నామని మేనేజర్ కె భాస్కరరావు, విజయవాడ సర్కిల్ జోనల్ మేనేజర్ కె ఎస్‌బి ఎస్‌వి ప్రసాద్‌లు తెలిపారు. గురువారం స్థానిక బ్రాంచ్ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ 50 బ్రాంచీలను నవశక్తి బ్రాంచీలుగా రూపొందించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఖాతాదారులకు సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఈ నవశక్తి బ్రాంచ్‌లు 24 గంటల పాటు పనిచేస్తాయని, నగదు చెల్లింపులు స్వీకరించడం కూడా మిషనరీల ద్వారా జరుగుతుందని అన్నారు. అంతేకాకుండా పాస్‌బుక్‌ల పోస్టింగ్‌లు కూడా నిర్వహించుకోవచ్చునని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానంపై ప్రజల్లో అవగాహన కూడా కల్పిస్తున్నామని తెలిపారు. ఆంధ్రాబ్యాంక్ బ్రాంచీల ద్వారా 4600 కోట్ల రూపాయల డిపాజిట్లుగా సేకరించామని, 4 వేల కోట్లు రుణాలుగా అందజేసామని స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలు కూడా బ్యాంకు సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రతీ ఒక్కరూ కూడా ఖాతాలను తెరచి పొదుపు చేసుకోవాలని, అవసరాలకు వాడుకుని మరిన్ని అవసరాలకు రుణాలు కూడా పొందవచ్చునని, అన్ని వర్గాలకు కూడా రుణాలు అందిస్తామని స్పష్టం చేశారు. బ్యాంకులను ఉపయోగించుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే వుందని స్పష్టం చేశారు. ఆయన వెంట అశోక్‌నగర్ బ్రాంచి మేనేజర్ జి సురేష్, సబ్ మేనేజర్ పివివి సత్యనారాయణ, హెడ్ క్యాషియర్ పి లక్ష్మణరావు, ఆఫీసర్ ఎన్ దీప్తి, క్లర్క్‌లు పి మాధవి, బిందు, కె సూరిబాబు, హౌస్ కీపర్ కె జ్యోతి తదితరులున్నారు. ఈ సందర్భంగా జోనల్ మేనేజర్ ఖాతాదారులతో కొద్దిసేపు సమీక్షించి బ్యాంకు ద్వారా అందజేసే సేవలపై వివరించారు.

చివరి ధాన్యం బస్తా వరకు కొనుగోలు చేస్తాం
*జాయింట్ కలెక్టర్ కోటేశ్వరరావు
భీమడోలు, నవంబర్ 23 : రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా చివరి బస్తా వరకు కొనుగోలు చేస్తామని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లాజాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు హామీ ఇచ్చారు. గురువారం సాయంత్రం భీమడోలు మండలం గుండుగొలను గ్రామంలో ఏర్పాటుచేసిన రెండుధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యంలో ఉండే తడి శాతాన్ని ఏ విధంగా లెక్కిస్తున్నదీ అడిగి తెలుసుకున్నారు. రైతుకు కనీస గిట్టుబాటు ధర అందేలా చేయడమే ప్రభుత్వ ఉద్దేశ్యమని, అందుకై ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. భీమడోలు మండలంలో భీమడోలు, గుండుగొలను, అంబరుపేట గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు 99 మంది రైతుల నుంచి 1.13 కోట్ల రూపాయల విలువైన 13725 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలుచేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమడోలు తహశీల్దార్ గంగరాజు, సి ఎస్‌డిటి వై పూర్ణచంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.