పశ్చిమగోదావరి

పరిహారం కోసం మళ్లీమళ్లీ అర్జీలు పెట్టవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుకునూరు, నవంబర్ 23: కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో పోలవరం ఆర్‌అండ్‌ఆర్ పరిహారం విషయంలో బాధితులు ఒకసారి అర్జీపెట్టుకున్న వారు అదే సమస్యపై మళ్లీమళ్లీ అర్జీలు సమర్పించాల్సిన అవసరం లేదని సబ్ కలెక్టర్ హరేంద్రీయ ప్రసాద్ స్పష్టం చేశారు. గురువారం బాధితుల ఫిర్యాదు మేరకు మండల రెవెన్యూ కార్యాలయానికి చేరుకున్న ఆయన వద్దకు బాధితులు అర్జీలతో వెళ్లగా వెంటనే ఆయన స్పందిస్తూ ఒకసారి అర్జీపెట్టుకున్నవారు మరోసారి తీసుకురావద్దని, ప్రతి అర్జీనీ పరిశీలిస్తున్నామని, అర్హులందరకీ న్యాయం జరుగుతుందన్నారు. అక్కడ నుంచి వెంటనే ఫిర్యాదుచేసిన పింజరం గ్రామానికి చెందిన మడకం చిన్నక్కకు చెందిన భూమిని పరిశీలించేందుకు వెళ్లారు. అనంతరం తప్పకుండా మీకు రావాల్సిన రెండున్నర ఎకరాల భూమిని రికవరీ చేయించి, మీకు న్యాయం చేస్తానని సబ్ కలెక్టర్ హామీ ఇచ్చారు. మరికొన్ని భూములను కూడా కుకునూరులో ఆయన పరిశీలించారు. అక్కడ నుంచి వేలేరుపాడు గ్రామానికి చేరుకుని బాధితుల ఫిర్యాదు మేరకు 385 సర్వే నెంబరు భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవార్డు పాస్ అయిన మాట వాస్తవేమని, కొన్ని అవకతవకల జరిగినవని తెలియడంతో వాటిని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. అర్హులకు మాత్రం తప్పక ప్యాకేజీ వస్తుందని, అయితే అనర్హులకు మాత్రం వేటుపడుతుందన్నారు. సబ్ కలెక్టర్ వెంట కుకునూరు తహసీల్దార్ రామాంజనేయులు, వేలేరుపాడు తహసీల్దార్ రవికుమార్ తదితరులు ఉన్నారు.
డిసెంబర్ 1 నుంచి ఆన్‌లైన్ చెల్లింపులు
*కలెక్టర్ భాస్కర్
ఏలూరు, నవంబర్ 23: జిల్లాలో ప్రభుత్వ చెల్లింపులన్నీ డిసెంబర్ 1వ తేదీ నుండి ఆన్‌లైన్ ద్వారా అమలుచేయనున్నట్లు కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ తెలిపారు. స్ధానిక కలెక్టరేట్‌లో సెంట్రల్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ కొత్త సాఫ్ట్‌వేర్ అమలుతీరుపై గురువారం వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 1900 మంది జీతాలు చెల్లించే అధికారులు ఉన్నారని, వారిలో 436మంది ఈవిధానం ద్వారా ఇప్పటివరకు పాస్‌వార్డ్‌గాని, యూజర్ నేమ్ గాని ఏర్పాటుచేసుకోలేదని, వారంతా రాబోయే 48గంటల్లో ఈవిధానానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని పొందుపర్చాలని ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో ప్రభుత్వపరంగా ట్రజరీల ద్వారా జీతభత్యాలు, ఇతర ఆర్ధికలావాదేవీలన్నీ జరుగుతున్నాయని, అయితే దీనివల్ల కాలయాపన అవుతున్న దృష్ట్యా సత్వర చెల్లింపులు అమలుచేసేందుకు నూతన సిఎఫ్‌ఎంఎస్ విధానాన్ని అమలుచేస్తున్నామన్నారు. జిల్లాలో 526మంది జీతాలిచ్చే అధికారులు తమ పరిధిలో ఉద్యోగుల కనీస సమాచారాన్ని కూడా ఈ నూతనవిధానంలో పొందుపర్చలేదని, కొత్త విధానం యుద్దప్రాతిపదికపై అమలుచేయాల్సిన అవసరం ఉందని, జీతాలు పొందే ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఆన్‌లైన్ విధానంలో పొందుపర్చాలన్నారు. జీతాలతోపాటు ప్రభుత్వపరంగా చెల్లించే ప్రతి పైసా కూడా ఇకపై నూతన విధానం ద్వారా సత్వరమే చెల్లింపులు జరిగేలా అమలుచేస్తున్నామన్నారు. సమావేశంలో ట్రజరీ డిడి జి లలిత, డిఆర్వో కె హైమావతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.