పశ్చిమగోదావరి

జిల్లాలో 330 కిచెన్‌షెడ్ల నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, నవంబర్ 23: జిల్లాలో అయిదుకోట్ల రూపాయలతో 330 కిచెన్‌షెడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ చెప్పారు. స్ధానిక కలెక్టరేట్‌లో గురువారం విద్యాశాఖాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి పాఠశాలలోనూ కిచెన్‌షెడ్డు నిర్మించి నూరుశాతం లక్ష్యం సాధించాలన్నారు. ఇప్పటికే 652 కిచెన్‌షెడ్ల నిర్మాణానికి 10కోట్ల రూపాయల నిధులు విడుదల చేశామని, మిగిలిన 330 పాఠశాలల్లో వీటి నిర్మాణానికి 5కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో నూరుశాతం వౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 136 పాఠశాలల్లో డిజిటల్ క్లాస్‌రూంలు ఏర్పాటుచేయటం జరిగిందని, మరో 308 పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూంలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. జనవరి లోపు అన్ని హైస్కూల్స్‌లో డిజిటల్ క్లాస్‌రూంలు ఏర్పాటుచేయాలన్నారు. జిల్లాలో ఇంగ్లీషు, లెక్కలు, తెలుగు పాఠ్యాంశాల్లో చదువులో వెనుకబడిన విద్యార్ధినీవిద్యార్ధులకు ప్రత్యేక తరగతులు ఏర్పాటుచేసి పరీక్షలు నిర్వహించినా ఆశించిన ఫలితాలు రాకపోవడానికి సరైన బోధన లేకపోవటమేనని, ఈవిషయంలో విఫలం అయిన ఉపాధ్యాయులకు షోకాజ్‌నోటీసులు జారీ చేయాలని డిఇఓను ఆయన ఆదేశించారు. విధినిర్వహణలో విఫలం అయిన టీచర్లను బదిలీ సమయంలో డివిజన్ దాటి బదిలీ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. పాఠశాలల్లో విద్యార్ధుల హాజరు తగ్గుతుంటే టీచర్లు స్పందించి తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లలు బడికి వచ్చేలా చూడాలని కలెక్టరు సూచించారు. పెదవేగి, బుట్టాయిగూడెం, దెందులూరు, కుకునూరు తదితర మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధినీవిద్యార్ధుల స్దాయి ‘సి’ గ్రేడ్‌కు దిగజారిందని, సంబంధిత ఉపాధ్యాయులు సరైన విద్యాబోధన చేయడంలో విఫలమైనట్లు కన్పిస్తోందన్నారు. సి గ్రేడ్‌లో ఉన్న విద్యార్ధినీవిద్యార్ధులు ఏ సబ్జెక్టులలో వెనుకబడి ఉన్నారో గుర్తించి అయా సబ్జెక్టులలో ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. సమావేశంలో డిఇఓ గంగాభవాని, సర్వశిక్షాభియాన్ పిఓ బ్రహ్మనందరెడ్డి, డిఎఫ్‌ఓ రామకృష్ణ, డిప్యూటీ డిఇఓలు ఉదయకుమార్, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.