పశ్చిమగోదావరి

ఫైనల్స్‌లో తలపడనున్న ఏపీ, మహరాష్ట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉంగుటూరు, డిసెంబర్ 11: ఉంగుటూరు మండలం నారాయణపురం బాపిరాజు స్టేడియంలో మూడు రోజులుగా జరుగుతున్న అండర్-17 జాతీయస్థాయి ఖోఖో పోటీల్లో ఆంధ్రప్రదేశ్, మహరాష్ట్ర జట్లు ఫైనల్స్‌కు చేరుకున్నాయి. సోమవారం క్వార్టర్స్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్ నువ్వానేనా అన్న చందంగా జరిగాయి. సెమీ ఫైనల్స్‌లో కర్ణాటక జట్టుపై ఏపీ 8-9 స్కోరు తేడాతో విజయం సాధించింది. అలాగే ఢిల్లీ జట్టుపై మహారాష్ట్ర జట్టు 3-11 స్కోరుతో విజయం సాధించింది. దాంతో ఏపీ, మహారాష్ట్ర జట్లు ఫైనల్స్‌కు చేరాయి. ఈ రెండు జట్లు మంగళవారం తలపడనున్నాయి. అలాగే ఈ రెండు జట్లపై పరాజయం చెందిన కర్ణాటక, ఢిల్లీ జట్లు మూడు, నాలుగు స్థానాల కోసం తలపడనున్నాయి. ఇదిలావుండగా ఉదయం క్వార్టర్ ఫైనల్స్‌లో ఒడిస్సా జట్టుపై ఆంధ్ర జట్టు 8-18 స్కోరుతో, తెలంగాణా జట్టుపై మహారాష్ట్ర జట్టు 8-12 స్కోరుతో విజయం సాధించాయి. తమిళనాడు జట్టుపై కర్ణాటక జట్టు 10-18 స్కోరుతో, కేరళ జట్టుపై ఢిల్లీ జట్టు 12-15 స్కోరుతో విజయం సాధించాయి. పరిశీలకులుగా భాటియా, టెక్నికల్ ఆఫీసర్లుగా గురుజా, అమిత్‌మిశ్రా వ్యవహరించారు. క్రీడల కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి సత్యనారాయణ పర్యవేక్షణలో పోటీలు జరుగుతున్నాయి.

బాలలు, మహిళల హక్కులను కాపాడాలి
ఏలూరు, డిసెంబర్ 11 : బాలల, మహిళల హక్కులను కాపాడాల్సిన బాధ్యత సమాజంపై వుందని, రాజ్యాంగం వారి కోసం ప్రత్యేక హక్కులను కలగజేసిందని, ఆ హక్కులను విస్మరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేశారు. వరల్డ్ విజన్ జిల్లాశాఖ ఆధ్వర్యంలో సోమవారం ఏలూరు మండలం చాటపర్రు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన చైతన్య సభకు గ్రామ సర్పంచ్ దొడ్డిగర్ల భాగ్యశ్రీ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిధిగా హాజరైన చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ సమాజంలో ప్రతీ ఒక్కరూ కూడా సేవాభావంతో ఉండాలని, ఘర్షణలకు, వేధింపులకు దిగవద్దని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటిసి గుత్తా కాశీబాబు, నంబూరి నాగరాజు, వరల్డ్ విజన్ ఆఫ్ ఇండియా మేనేజర్ ఎన్ జేమ్స్ వాట్, సిబ్బంది డేనియల్ విక్టర్ బాబు, శ్యామ్, సిడి ఎఫ్ ఎస్‌లు మోహన్, డేవిడ్, యోబు, ఫిలిప్, సురేష్, చింతా నరేంద్ర, ఎంపిటిసిలు ద్వారంపూడి వీరబ్రహ్మం, కొలుసు సరస్వతి తదితరులు పాల్గొన్నారు.