పశ్చిమగోదావరి

సామాన్యులకూ తెలిసేలా పోలవరం వివరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, డిసెంబర్ 11 : పోలవరం ప్రాజెక్టుకు సంబందించిన పూర్తి వివరాలు సామాన్య ప్రజానీకానికి కూడా అర్ధమయ్యే రీతిలో పారదర్శకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. పోలవరం నిర్మాణ ప్రాంతంలో సోమవారం పర్యటించిన ఆయన పనులను పరిశీలించిన అనంతరం ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పనులు, ఇతర లెక్కలన్నీ జవాబుదారీగా వుండాలని, ఏ క్షణంలో ఎవరైనా వాటిని పరిశీలించేందుకు అనువుగా ఆన్‌లైన్‌లో పొందుపర్చాలన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఇప్పటికే సమగ్ర సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొందుపర్చారని, ఇదే విధానాన్ని తూర్పుగోదావరి జిల్లాలో కూడా అమలు చేయాలని ఆయన ఆదేశించారు. భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, నిర్వాసితులకు చెల్లించిన పరిహారం, భవిష్యత్తులో నిర్మించే ఇళ్ల వివరాలు తదితర సమాచారాన్ని ఆన్‌లైన్‌లో ఉంచాలన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మట్టి పనులతోపాటు కాంక్రీటు పనులను కూడా వేగవంతం చేయాలని, అప్పుడే నిర్ధేశించిన సమయానికి లక్ష్యాన్ని చేరుకోగలుగుతామని, రానున్న మూడునెలలు కాంక్రీటు పనులు చేయడానికి వాతావరణంగా అనుకూలంగా వుంటుందని చెప్పారు. 192 రేడియల్ గేట్లు పూర్తయ్యాయని, వీటిలో సంక్రాంతి నాటికి ఒక గేటు ఏర్పాటుచేసి దశల వారీగా అన్ని గేట్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. ఉభయగోదావరి జిల్లాలకు సంబంధించి 2596 కోట్ల రూపాయల విలువైన భూసేకరణకు సంబందించిన బిల్లులను ప్రభుత్వానికి సమర్పించారని చెప్పారు. కూలింగ్ ప్లాంట్‌నకు సంబంధించిన పనులన్నీ ఈ నెల 25వ తేదీ నాటికి పూర్తిచేయాలని చెప్పారు. కాంక్రీటు పనులను సమీక్షిస్తూ 34 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు చేయాల్సి వుండగా ఇంత వరకు 4.35 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు మాత్రమే పూర్తయ్యాయని, ఇకపై రోజువారీ లక్ష్యాన్ని నిర్ధేశించుకుని యుద్ధప్రాతిపదికపై పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ మాట్లాడుతూ ప్రాజెక్టుకు సంబంధించి నిర్వాసితులకు భూమికి భూమి బదలాయింపు, కుడికాలువ నిర్మాణం, ప్రాజెక్టు నిర్మాణం తదితర వాటికి సంబందించి భూసేకరణ ప్రక్రియ పూర్తి చేశామన్నారు. జీలుగుమిల్లి నుంచి బుట్టాయిగూడెం, కన్నాపురం మీదుగా కొవ్వూరు, పోలవరానికి సంబంధించిన రహదారిని జాతీయ రహదారిగా పేర్కొన్నారని, దీనికి భూసేకరణకు నిధులు ఇస్తే రహదారి నిర్మాణం చేపడతామని నిర్మాణ సంస్థ తెలియజేసిందని, నిధులు మంజూరు చేయాలని కోరగా ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా 1410 ఎకరాలు సేకరించాల్సి వుందన్నారు. జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ మాట్లాడుతూ ప్రాజెక్టుకు సంబంధించి ఆర్ అండ్ ఆర్ కింద 18వేల కోట్లు, భూసేకరణకు 14 వేల కోట్లు కేంద్రం మంజూరు చేయాల్సి వుందన్నారు. సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపిలు మాగంటి బాబు, తోట సీతారామలక్ష్మి, పోలవరం చీఫ్ ఇంజనీర్ రమేష్, పోలవరం ప్రాజెక్టు త్రిసభ్య కమిటీ సభ్యులు గుప్తా, వెంకటేశ్వరరావు, భార్గవ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్, జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు, ఎమ్మెల్యేలు మొడియం శ్రీనివాస్, గన్ని వీరాంజనేయులు, నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, ఐటీడీఏ పివోలు ఎం హరీంద్రప్రసాద్, దినేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధిలో ఆదర్శం... దత్తత గ్రామాలు
*హడ్కో సిఎండి రవికాంత్
ఉండి, డిసెంబర్ 11: పల్లెల్లో వౌలిక సదుపాయాలు కల్పించి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దటంలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ చేపట్టిన దత్తత గ్రామాలు ఆదర్శంగా నిలుస్తున్నాయని హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (హడ్కో) సిఎండి మేడిది రవికాంత్ అన్నారు. నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు దత్తత గ్రామం మహదేవపట్నంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సోమవారం ఆయన ప్రారంభోత్సవం చేశారు. రూ.2 కోట్ల వ్యయంతో 29 సీసీ రోడ్లు, 429 వ్యక్తిగత మరుగుదొడ్లు, అందరికీ ఉచిత మంచినీటి ట్యాప్ కనెక్షన్స్‌తో ఆదర్శవంతమైన అభివృద్ధి జరిగింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీలు కంతేటి సత్యనారాయణరాజు, మంతెన వెంకట సత్యనారాయణరాజు (పాందువ్వ శ్రీను), ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు పలు రహదారులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివరామరాజు, సర్పంచ్ జుత్తిగ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభలో ఎంపి గంగరాజు మాట్లాడుతూ ప్రధాని మోడీ ఆలోచనలకు ప్రతిరూపంగా పల్లెప్రగతి నిలుస్తుందన్నారు. ఇందుకు సహకరించిన మహదేవపట్నం గ్రామ ప్రజలకు, పంచాయతీకి కృతజ్ఞతలు తెలిపారు.
ఉండికి హడ్కో నిధులివ్వండి
సభలో పాల్గొన్న ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు ఉండి నియోజకవర్గంలో పలు డ్రెయిన్లు, రహదారుల అభివృద్దికి హడ్కో నిధులు మంజూరు చేయాలని కోరారు. అదే విధంగా మహదేవపట్నం - గొల్లలకోడేరు రహదారి అభివృద్ధికి కూడా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ జుత్తిగ శ్రీనివాస్, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు గోకరాజు రామరాజు, ఏఎంసీ ఛైర్మన్ సాగిరాజు సాంబశివరాజు, వైస్ ఛైర్మన్ జుత్తిగ నాగరాజు, ఎంపీపీ దలియా లక్ష్మి, ఎంపీటీసీ శ్రీనివాస్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.