పశ్చిమగోదావరి

రెండేళ్లలో ఎస్సీ హాస్టళ్లన్నీగురుకుల పాఠశాలలుగా మార్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఏప్రిల్ 14: జిల్లాలో ఎస్సీ విద్యార్ధుల వసతిగృహాలన్నింటినీ రానున్న రెండేళ్లలో గురుకుల పాఠశాలలుగా మార్పు చేస్తున్నట్లు జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ చెప్పారు. స్దానిక అంబేద్కర్ భవన్‌లో సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గురువారం ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి అధ్యక్షతన జరిగిన డాక్టరు బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి సభలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ విద్యార్ధులకు పూర్తి నాణ్యతతో కూడిన విద్య, మెరుగైన వసతి, భోజన సౌకర్యాలు కలిగించేరీతిలో ప్రస్తుతం ఉన్న వసతిగృహాల బదులుగా గురుకుల పాఠశాలలుగా మార్పు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే గిరిజన వసతిగృహాలను గురుకుల పాఠశాలలుగా మార్పు చేశామన్నారు. ప్రతి ఎస్సీ,ఎస్టీ కుటుంబాలకు మరో రెండు ఎల్‌ఇడి బల్బులు ఉచితంగా అందిస్తున్నామని, దీనివల్ల కరెంటుఖర్చు తగ్గుతుందన్నారు. ఎస్సీ విద్యార్ధులకు అందించే పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్‌లను నెలవారీ వారి బ్యాంకు ఖాతాలకే జమ చేస్తామన్నారు. సామాజిక సామరస్యత, సమానత్వం సాధించటం ద్వారానే అంబేద్కర్ కలలుగన్న సమసమాజాన్ని స్ధాపించగలమన్నారు. శాసనసభ్యులు బడేటి బుజ్జి మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అంతా అనుసరించాలన్నారు. బాబూజగజ్జీవన్‌రామ్ కాంస్య విగ్రహం ఏర్పాటుకు అయ్యే ఖర్చులో సగం తాను భరించేందుకు సిద్ధంగా ఉన్నానని, మిగిలిన సగం సమకూర్చేందుకు దాతలు ముందుకొస్తే వారు అడిగిన వెంటనే నిధులు అందిస్తానన్నారు. కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు రాము సూర్యారావు, నగర మేయర్ షేక్ నూర్జహాన్, దళిత నాయకులు పొలిమేర హరికృష్ణ, నేతల రమేష్, బురదగుంట క్రాంతి, డాక్టరు వామనానంద, కారం లెనిన్, ముప్పిడి మోషే, లారెన్స్, కె ప్రభాకర్, డి బాబు, రాజేశ్వరరావు, గెడ్డం చంద్రరావు, మేదర అజయ్‌బాబు తదితరులు ప్రసంగించారు. ఈసందర్భంగా పౌరులతో ఎమ్మెల్యే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జెసి పి కోటేశ్వరరావు, ఆర్డీవో ఎన్ తేజ్‌భరత్, ఎస్సీ కార్పోరేషన్ ఇడి ఝాన్సీరాణి, సాంఘిక సంక్షేమశాఖ డిడి రంగలక్ష్మి, మాజీ కార్పోరేటరు మున్నుల జాన్‌గురునాధ్ తదితరులు పాల్గొన్నారు. తొలుత అంబేద్కర్ చిత్రపటానికి కలెక్టరు భాస్కర్ పూలమాల వేసి నివాళులర్పించారు.