పశ్చిమగోదావరి

ఖోఖో విజేత ఆంధ్రప్రదేశ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉంగుటూరు, డిసెంబర్ 12: ఉంగుటూరు మండలం నారాయణపురంలో నాలుగు రోజులుగా నిర్వహించిన జాతీయ స్థాయి ఖోఖో అండర్ -17 పోటీలు మంగళవారం ముగిశాయి. పోటీలు ఆఖరి రోజైన మంగళవారం నిర్వహించిన ఫైనల్స్‌లో ఆంధ్రప్రదేశ్ జట్టు విజేతగా నిలిచింది. మంగళవారం జరిగిన ఫైనల్స్‌లో ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర జట్లు తలపడ్డాయ. ఈ పోటీలో ఆంధ్రప్రదేశ్ 21-13 పాయంట్లతో మహారాష్టప్రై విజయం సాధించింది. కర్ణాటకపై ఢిల్లీ జట్టు 13-12 పాయంట్లతో విజయం సాధించి తృతీయ స్థానంలో నిలిచింది. ప్రథమ స్థానం సాధించిన ఆంధ్రప్రదేశ్ జట్టుకు కోచ్‌గా ప్రకాశం జిల్లా కాశీవిశ్వనాధ్‌రెడ్డి, జట్టు మేనేజర్‌గా కే హనుమంతురావులు వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ జట్టులో ఎస్కే ఆలిన్ నవాబ్ (ప్రకాశం), వెంకటేష్ (విజయనగరం), కిరణ్ కల్యాణ్ (విశాఖ), రామ్మోహన్ (కడప), అజయ్ (ప్రకాశం), రామ్మోహన్ (తూర్పుగోదావరి)లు ఆటలో అత్యంత ప్రతిభను కనబర్చారు. విజేతలకు ప్రముఖ దాత అప్పసాని శేషగిరిరావు, జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం సావిత్రి, నటుడు, మోహన్ ఆర్కెస్ట్రా అధినేత మోహన్, ఖోఖో టోర్నీ పరిశీలకులు బాటియా, సుధాకర్, సాయి శ్రీనివాస్, ఆర్గనైజింగ్ కార్యదర్శి కే కృష్ణారెడ్డి, క్రీడా నిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి సత్యనారాయణ, నారాయణపురం మాజీ ఉప సర్పంచ్ అడపా శ్రీనివాస్ జ్ఞాపికలను, పతకాలను అందజేసి అభినందించారు.