పశ్చిమగోదావరి

కీచక అధ్యాపకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకివీడు, డిసెంబర్ 14: విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ మండలంలోని దుంపగడప గ్రామంలోని ఎకెపిఎస్ జూనియర్ కళాశాల అధ్యాపకులపై విద్యార్థులు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఎ.లక్ష్మి, పి.సంగీత, జి.మనీషాతో పాటు పలువురు విద్యార్థినులు అధ్యాపకులపై ఆరోపణలు గుప్పించారు. కళాశాల ప్రిన్సిపాల్ ఎం.వరప్రసాద్, తెలుగు అధ్యాపకుడు జాన్ వెస్లీ గత కొంతకాలంగా తమను క్లాస్‌రూమ్‌లో అసభ్య పదజాలాన్ని వాడుతూ మానసిక క్షోభకు గురిచేస్తున్నారని విద్యార్థినులు ఆరోపించారు. గత కొన్ని రోజులుగా ద్వంద్వార్ధాలతో కూడిన డైలాగ్‌లతో వేస్తున్నారని ఆరోపించారు. తాము మానసిక క్షోభకు గురవుతూ ఇంట్లో చెబితే చదువు మాన్పించేస్తారనే భయంతో చివరకు బయటకు వచ్చామంటూ విద్యార్థినులు కన్నీటి పర్యంతం అయ్యారు. విద్యార్థినులకు కళాశాల విద్యార్థులతో పాటు ఎస్‌ఎఫ్‌ఐ, విద్యార్థి సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ప్రిన్సిపాల్ వరప్రసాద్‌తో పాటు తెలుగు లెక్చరర్ జాన్‌వెస్లీలను తక్షణం సస్పెండ్ చేయాలంటూ విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. విద్యార్థి సంఘ నాయకులు సాగర్‌వర్మ, అనిల్, శామ్యూల్, అప్పలనాయుడు, బి.కార్తీక్, యుగంధర్, గణేష్, రాంబాబు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అధ్యాపకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జరిగిన సంఘటనపై ప్రిన్సిపాల్ వరప్రసాద్ వివరణ ఇస్తూ సంఘటనకు, తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. కేవలం విద్యార్థి సంఘాలు తనపై లేనిపోని ఆరోపణలు గుప్పిస్తున్నాయన్నారు. ఒకానొక సమయంలో ప్రిన్సిపాల్ ప్రసాద్‌కు విద్యార్థినులు, విద్యార్థి సంఘ నాయకులకు వాగ్వాదం తారాస్థాయికి చేరింది. అయితే పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన పోలీసులు వారిని వారించారు. విద్యార్థులు తరగతులు బహిష్కరించారు. విషయం తెలుసుకున్న కళాశాల అభివృద్ధి కమిటీ అక్కడకు చేరుకుని విద్యార్థినులు, అధ్యాపకులతో చర్చించారు. అయితే ఆందోళన జరిగే సమయంలో కళాశాలకు తెలుగు అధ్యాపకుడు జాన్‌వెస్లీ లేకపోవడంతో పలుమార్లు ఆ ప్రాంతంలో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఆకివీడు ఎస్సై కె.సుధాకర్‌రెడ్డి విద్యార్థి సంఘ నాయకులతో చర్చించి బాధ్యులైన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించి తరగతులకు యధావిధిగా వెళ్లారు. విషయాన్ని తెలుసుకున్న ఇంటర్మీడియట్ కళాశాలల రీజినల్ డైరెక్టర్ వై.వి.సుబ్బారావు (రాజమండ్రి), డివైఇఒ కె.వెంకట్రామయ్య (ఏలూరు) గురువారం సాయంత్రం కళాశాలకు చేరుకుని విచారణ ప్రారంభించారు. ఈ సంఘటనకు సంబంధించి ఆకివీడు పోలీసులు కేసు నమోదుచేశారు. కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న పరిమితి సంగీత ఫిర్యాదుతో ఆకివీడు ఎస్సై కె.సుధాకర్‌రెడ్డి కేసు నమోదుచేశారు. ప్రిన్సిపాల్ ప్రసాద్ ద్వంద్వార్ధాలతో విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారన్న ఫిర్యాదుపై ఎస్సై సుధాకర్‌రెడ్డి వేధింపుల చట్టం, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.

స్తంభాలు పీకేశారు!
*కొనసాగుతున్న మద్యం దుకాణం వ్యతిరేక ఆందోళన
ఆకివీడు, డిసెంబర్ 14: ఆకివీడులోని సమతానగర్ ప్రాంతంలో మద్యం దుకాణాన్ని వ్యతిరేకిస్తూ రెండోరోజు గురువారం కూడా మహిళలు ఆందోళన నిర్వహించారు. ఈ ప్రాంతంలో మద్యం దుకాణం నిమిత్తం షెడ్డు నిర్మిస్తున్నారంటూ సీపీఎం, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న ఆకివీడు ఎస్సై కె.సుధాకర్‌రెడ్డి అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేవలం షెడ్డు నిర్మించుకుంటారే గానీ ఇక్కడ మద్యం దుకాణానికి పర్మిషన్ ఇవ్వలేదని ఎక్సైజ్ అధికారులు తేల్చారని ఎస్సై ఆందోళనకారులకు వివరించారు. అయినా వారు వినలేదు. మొదట షెడ్‌ను ఏర్పాటుచేసి తర్వాత మద్యం దుకాణం పెడతారంటూ ఆందోళనకు దిగారు. ఆ ప్రాంతం నుండి షెడ్ నిర్మాణానికి తీసుకువచ్చిన వాహనాన్ని, స్తంభాలను తీసివేయాలని డిమాండ్ చేశారు. పలువురు మహిళలు పోలీసులు ఉండగానే స్తంభాలు పీకేయడం మొదలుపెట్టారు. అనంతరం ఆ ప్రాంతం నుండి స్తంభాలను తొలగించడంతో గొడవ సర్దుమణిగింది. ఈ ఆందోళన కార్యక్రమానికి సీపీఎం నాయకులు గేదెల అప్పారావు, సందక సూరిబాబు, డోకల లక్ష్మి, సందా కేశవరావుతో పాటు పలువురు మహిళాసంఘాల నాయకులు పాల్గొన్నారు.