పశ్చిమగోదావరి

జిల్లాలో ప్రప్రథమంగా ఆలం ట్రీట్‌మెంట్ ప్లాంట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాళ్ల, డిసెంబర్ 14: రాప్ట్రంలో మొట్టమొదటిసారిగా జిల్లాలో ఆలం ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. గురువారం మండలంలోని పెదఅమిరం గ్రామంలో రూ.15లక్షలతో నిర్మిస్తున్న ఆలం ట్రీట్‌మెంట్ ప్లాంట్ (నీటి శుద్ధి ప్లాంటు)కు ఉండి ఎమ్మెల్యే శివరామరాజుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ భాస్కర్ మాట్లాడుతూ మొదటిసారిగా ఉండి నియోజకవర్గంలోని 120 గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో ప్రతీ ఇంటికి మంచినీటి ట్యాప్ కనెక్షన్‌లు ఇవ్వాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. కుళాయి కనెక్షన్ లేని కుటుంబాలు సుమారు 3 లక్షల మంది ఉన్నారని గుర్తించామన్నారు. రూ.900 కోట్లతో ఆలం ట్రీట్‌మెంట్ నిర్మాణాలను చేపట్టడం ద్వారా నీటి సమస్య అధిగమిస్తామన్నారు. డెల్టా ప్రాంతంలో వీటి నిర్మాణ పనులు చేపట్టనున్నట్టు ఆయన వివరించారు. ఈ ప్లాంట్‌ల ద్వారా స్వచ్ఛమైన నీటిని అందించడమే కాకుండా ప్రజలకు సరిపడా నీరు అందించవచ్చన్నారు. రూ.370 కోట్లతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన వౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. ఎమ్మెల్యే శివరామరాజు మాట్లాడుతూ ఉండి నియోజకవర్గం శివారు ప్రాంతం కావడంతో నీటి ఇబ్బంది ఉందన్నారు. ఆలం ట్రీట్‌మెంట్ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా నీటి సమస్యలు అధిగమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బర్రె శ్రీవెంకటరమణ, సర్పంచ్ ఇళ్ల సీతామహాలక్ష్మి, గేదెల జాన్, మండల టీడీపీ అధ్యక్షుడు గుండాబత్తుల నాగేశ్వరరావు, కాలవ లక్ష్మి, తహసీల్దార్ తిలక్, ఎంపీడీఓ శివప్రసాద్, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ గిరి, ఏఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.