పశ్చిమగోదావరి

చెత్త నిర్వహణపై మరింత దృష్టి పెట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లిగూడెం, డిసెంబర్ 14: బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా మారిన పశ్చిమగోదావరిలో చెత్త నిర్వహణపై మరింత దృష్టి పెడితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేర్కొన్నారు. సీఎం చంద్రబాబుతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి మంత్రి మాణిక్యాలరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ జిల్లాలో నూరు శాతం మరుగుదొడ్ల నిర్మాణం, బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా రూపుదిద్దుకుందన్నారు. అయితే ఇక్కడ ఉత్పత్తి అవుతున్న చెత్త నిర్వహణపై దృష్టి పెడితే సత్ఫలితాలు వస్తాయన్నారు. పట్టణంలో అతి పెద్ద మార్కెట్ ఉండటం వల్ల చెత్త అధికంగా వస్తుందన్నారు. ఇక్కడ సాలిడ్ వేస్ట్ విద్యుదుత్పత్తి కేంధ్రం మంజూరైందన్నారు. దీనిని త్వరగా పూర్తి చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. దీనిపై సి ఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. దీనిపై చర్య తీసుకుంటామన్నారు. వచ్చే సమావేశం నుంచి ఈ తరహా ముఖ్య అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. ఈ సమావేశంలో కాపు కార్పొరేషన్ డైరెక్టర్ యర్రా నవీన్, తహసిల్దార్ పాశం నాగమణి, మున్సిపల్ ఇన్‌ఛార్జ్ కమిషనర్ ఎం.బ్రహ్మాజీ, ఎంపిడి ఓ వివి.రామాంజనేయశర్మ, మున్సిపల్ మాజీ చైర్మన్ ఈతకోట తాతాజీ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ యెగ్గిన నాగబాబు, బిజేపి నాయకులు పోతుల అన్నవరం, నరిశే సోమేశ్వరరావు, అయినం బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

జిల్లాస్థాయి పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం
*డిఎన్నార్ కళాశాల గ్రౌండులో మూడు రోజుల పాటు పోటీలు

భీమవరం, డిసెంబర్ 14: భీమవరం డిఎన్నార్ కళాశాల క్రీడామైదానంలో జిల్లాస్థాయి 22వ పాలిటెక్నిక్ సోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ గురువారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, విశిష్ఠ అతిధిగా మున్సిపల్ ఛైర్మన్ కొటికలపూడి గోవిందరావు హాజరయ్యారు. డిఎన్నార్ కళాశాల పాలకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు గోకరాజు వెంకట నర్సింహరాజు, గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు) పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే జాతీయ జెండాను ఆవిష్కరించారు. క్రీడాపోటీల పతాకాన్ని ఛైర్మన్ గోవిందరావు ఎగరవేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని 22 పాలిటెక్నిక్ కళాశాలల నుంచి వచ్చిన క్రీడాకారుల నుంచి ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గౌరవ వందనం స్వీకరించారు. మూడు రోజుల పాటు జరిగే పోటీల క్రీడాజ్యోతిని ఎమ్మెల్యే రామాంజనేయులు వెలిగించారు. శాంతి కపోతాలను ఎగురవేశారు. 100 మీటర్లు పరుగుపందెం పోటీలను జెండా లాంఛనంగా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని పిలుపునిచ్చారు. జిల్లాస్థాయి పోటీలు భీమవరంలో నిర్వహించడం, అందులోను చరిత్ర కలిగిన డిఎన్నార్ కళాశాలలో నిర్వహించడం విశేషమన్నారు. ప్రతీ సంవత్సరం డిఎన్నార్ క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చి జిల్లాస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పోటీలు నిర్వహిస్తున్నారని పాలకవర్గాన్ని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామాంజనేయులు, కళాశాల పాలకవర్గ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు)లను సత్కరించారు. కళాశాల ప్రిన్సిపాల్ యు.రంగరాజు అధ్యక్షత వహించారు. ప్రిన్సిపాల్ పి.రామకృష్ణంరాజు, పి.శ్రీనివాసయాగ, పాలకవర్గ సభ్యులు, ఆయా కళాశాలల పీడీలు పాల్గొన్నారు.