పశ్చిమగోదావరి

సంక్రాంతి సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జనవరి 16: ఎటుచూసినా జనం... ప్రధాన మార్కెట్లలో అడుగుమోపే ఖాళీ కన్పించలేదు. రోడ్లపై ఎక్కడ చూసినా జనమే. వస్తద్రుకాణాల్లో నైతే వాటిని ఉచితంగా ఇస్తున్నారేమోననే అనుమానం వచ్చేంత జనం. రైల్వేస్టేషన్లకు వెళ్తే సాధారణ టికెట్ల కౌంటర్ల వెలుపల వరకు వచ్చేసిన ప్రయాణీకులు. అటు ఆర్టీసీ కాంప్లెక్స్‌లోనూ దాదాపు ఇదే పరిస్దితి. దీనికి కారణం...సంక్రాంతి పండుగే. గతవారంరోజులుగా కళకళలాడుతున్నా మార్కెట్లలో సోమవారం పతాకస్ధాయి తాకిడి కన్పించింది. గతానికి భిన్నంగా ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు మరింత ఖరీదైన వ్యవహారంగా మారిపోయాయి. అయితే ఏడాదిలో వచ్చే మొదటి పండుగ కావటంతో ఆంధ్రులకు ఎంతో ప్రీతిపాత్రమైన పండుగ కావటంతో ప్రతి కుటుంబంలో పండుగ ఆర్భాటం కన్పించింది. పండుగ మార్కెట్ చూస్తే మాత్రం అత్యంత ఉత్సాహంగా కన్పించింది. ఈసారి కొనుగోళ్లకు వినియోగదారులు ఎక్కడా రాజీ పడలేదు. ధరలు ఆకాశాన్నంటుతున్నా పండుగును మాత్రం వైభవంగా చేసుకున్నారు. మార్కెట్లు చూస్తే ఈసారి వస్త్రాల మార్కెట్ ధగధగలాడిపోయింది. ప్రధానమైన వస్త్ర దుకాణాలన్నీ గత వారంరోజులుగా కిటకిటలాడిపోయాయి. ఏలూరు నగరంలో గత కొద్దిరోజుల్లో కొత్తగా ఏర్పడిన వస్త్ర దుకాణాల్లో వినియోగదారులను ఆకట్టుకునేందుకు భారీ ఎత్తున ఆఫర్లు అమలుచేశారు. పండుగ మూడురోజులు అయితే ఏ దుకాణం కూడా ఖాళీగా లేదు. ఇసుక వేస్తే రాలనంతంగా వినియోగదారులతో నిండిపోయింది. సంక్రాంతి సీజన్‌కు పెద్దసంస్ధలు రకరకాల స్కీములు పెట్టి వినియోగదారులను విపరీతంగా ఆకర్షించాయి. వీటితోపాటు మిగిలిన దుకాణాలకు కూడా వినియోగదారుల తాకిడి అధికంగానే కన్పించింది. రెడీమెడ్ వస్త్ర దుకాణాలన్నీ కోట్ల రూపాయల మేరకు అమ్మకాలు సాగించాయంటే ఆతిశయోక్తి కాదు. వస్త్రాల తర్వాత భారీ కొనుగోళ్లు చూసిన మార్కెట్ బంగారం. గత మూడురోజులుగా అధునిక డిజైన్లతో బంగారు అభరణాలను కొనుగోలు చేసే వారి సంఖ్య అధికంగానే ఉంది. ఇదిఇలాఉంటే పండుగ సందర్భంగా ఈసారి పిండివంటలు కూడా ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పప్పులు, ఉప్పులతోపాటు కూరగాయల ధరలు కూడా మిన్నంటాయి. ఇక నూనెధరలు చెప్పనక్కర్లేదు. సాధారణ వినియోగానికి ఉపయోగించే కూరగాయలు కూడా కనీసం 20 రూపాయలకు చేరిపోయింది. మరోవైపు పండుగ డిమాండ్‌ను ఆసరా చేసుకుని ఎక్కడికక్కడ తాత్కాలిక దుకాణాలు వెలిసిపోయాయి. ప్రధాన దుకాణాల్లోనే విపరీతమైన రద్దీ ఉందనుకుంటే తాత్కాలికంగా ఏర్పాటైన దుకాణాలు కూడా కొనుగోలుదారులతో కిటకిటలాడిపోయాయి. సండే మార్కెట్ మాదిరిగా ప్రధాన పట్టణాల్లో భారీఎత్తున ఇటువంటి రోడ్డుపక్కన దుకాణాలు హడావిడిగా వెలిశాయి. వీటిలో ఆధునిక డిజైన్లతో ఉన్న పాదరక్షల నుంచి ఖరీదైన దుస్తుల వరకు అన్నిరకాల వస్తువులను విక్రయించేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేవారినే లక్ష్యంగా ఎంచుకుని ఇటువంటి దుకాణాలు అన్నిచోట్ల ఏర్పాటుచేసేశారు. వీటికి కూడా ఊహించలేని డిమాండ్ నెలకొంది. ఇక ప్రధాన దుకాణాలకు ధీటుగా రహదారుల పక్కన ఉండే వస్త్ర దుకాణాలకు కూడా ఈ సంక్రాంతికి ఆదరణ బాగానే లభించింది. కాగా గృహోపకరణాల మార్కెట్‌లోనూ భారీగా విక్రయాలు జరిగాయి. సంక్రాంతి ఆఫర్లు భారీగానే ఉండటంతో ఫ్రిజ్‌లు, గీజర్‌లు, టివిలు వంటివి విపరీతంగా అమ్ముడుపోయాయి. ప్రధానంగా టివిల మార్కెట్‌లో ఎల్‌సిడి వంటి రకాల్లో విపరీతమైన ఆఫర్లతోపాటు ఆప్షన్లు కూడా అధికంగా ఇవ్వడంతో వీటి అమ్మకాల్లోనూ భారీ పురోగతి కన్పించింది. పండుగ పూట కొత్త వస్తువును ఇంటికి తెచ్చుకోవటం చాలామందికి సెంటిమెంట్ కావటంతోపాటు పంట సొమ్ము ఇళ్లకు వచ్చే తరుణంలో వాటిని ఇలాంటి కొనుగోళ్లపైనే పెట్టడం ఎంతోమందికి ఆలవాటు.
ఇక సినిమా ధియేటర్లు కూడా పండుగ పూట వచ్చే ప్రేక్షకులతో పండుగ చేసుకున్నాయి. సంక్రాంతి సీజనే లక్ష్యంగా కొత్త సినిమాలు అనేకం విడుదలయ్యాయి. వీటిలో పెద్ద స్టార్‌ల చిత్రాలు కూడా ఉన్నాయి. ఈపరిస్దితుల్లో సినిమా ధియేటర్లు పండుగ ప్రేక్షకులతో కిటకిటలాడిపోయాయి. ఇదే అదనుగా తీసుకున్న ధియేటర్లు టిక్కెట్ రేట్లను కూడా పెంచి విక్రయించేశాయి. ఇక బ్లాక్ మార్కెట్ విషయం చెప్పనసరం లేదు. మరుసటి రోజు టిక్కెట్లను కూడా కొన్ని ధియేటర్లలో ముందురోజే విక్రయించేశారంటే బ్లాక్ మార్కెట్ ఏ స్దాయిలో జరిగిందో అర్ధం చేసుకోవచ్చు. మరోవైపు ధియేటర్లలో కూల్‌డ్రింక్, పాప్‌కారన్ వంటి రేట్లను కూడా విపరీతంగా పెంచేసి విక్రయించారు. మొత్తంమీద ధియేటర్ల యాజమాన్యాలకు ఈ పండుగ కాసుల పంటను కురిపించింది.