పశ్చిమగోదావరి

భారీగా బయటకొచ్చిన నల్లధనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జనవరి 16: డబ్బే...డబ్బు... గత మూడురోజులుగా ఎక్కడ చూసినా డబ్బే. గెలుపే ధ్యేయంగా పందేగాళ్లు నోట్లను వెదజల్లేరు. కోడిపందాలు, కోతాట, పేకాట, గుండాట, మద్యం... ఇలా అన్నివిధాలా ధనలక్ష్మి చేతులుమారింది. ఈ ధనప్రవాహం కొన్ని జీవితాలకు అనందం పంచగా మరికొందరికి మాత్రం తీరని విచారాన్ని మిగిల్చింది. సంప్రదాయం ముసుగులో అన్ని వ్యసనాలను ఒకేచోట నిర్వహించటం ద్వారా చాలామంది నిర్వాహకులు లక్షాధికారులయ్యారు. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్దితుల కారణంగా ఈసారి సంక్రాంతి జూదం భారీస్ధాయిలోనే జరుగుతుందని ముందస్తు అంచనాలున్నప్పటికీ దాన్ని మించి కోట్ల రూపాయలు చేతులు మారిపోయాయి. ఉత్తరకుమారుని ప్రగల్భాలు పలికిన ఖాకీలు చేష్టలుడిగి గమ్మున ఉండిపోవటంతో జిల్లా అంతటా ధనప్రవాహం చోటుచేసుకుంది. భోగి రోజు మధ్యాహ్నం రిబ్బన్ కటింగ్‌తో ప్రారంభమైన జూద క్రీడ నిర్విఘ్నంగా మూడురోజులపాటు కొనసాగింది. కొన్నిచోట్ల ప్రజాప్రతినిధుల సారధ్యంలో, మరికొన్నిచోట్ల స్ధానికంగా పలుకుబడి ఉన్న నేతల నాయకత్వంలో పందాలు కొనసాగాయి. తొలుత వేలల్లో ప్రారంభమైన పందాలు క్షణంక్షణం గడుస్తున్న కొద్ది లక్షలు, కోట్లకు కూడా చేరిపోయింది. 2000, 500 రూపాయల నోట్లతోనే పందాలు అన్నీ దాదాపుగా కొనసాగాయంటే ఆతిశయోక్తి కాదు. ఈ మూడురోజులు ఎటిఎం కార్డులకు కూడా క్షణం తీరికలేకుండా పోయింది. 20వేలు తీసుకువెళ్లటం అది కాస్తా పోతే మరోసారి ఎటిఎం సెంటరుకు పరిగెట్టడం తోనే చిన్నపాటి పందెగాళ్లు ఆలసిపోయారు. కొన్ని సందర్భాల్లో ఎటిఎంల్లో డబ్బు లేకపోవటంతో కాసేపు మిషన్లతో కుస్తీ పట్టి చివరకు ప్రయోజనం లేకపోవటంతో కొంతమంది నిరాశగా వెనుతిరగాల్సి వచ్చింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ప్రతి ఒక్కరిలోనూ కసి పెరిగిపోయి ఎలాగైనా సరే ఈసారి భారీమొత్తం సంపాదించాలన్న తాపత్రయం కన్పించింది. ఇక మోతుబరులు, బడాబాబులు సంచిల కొద్ది నల్లధనాన్ని పందెం బరులకు తరలించారు. కాస్తే లక్ష అన్నట్లుగా పందాల జోరును పెంచేశారు. మరోవైపు నకిలీనోట్లు కూడా ఈసారి బాగానే చేతులు మారాయని భావిస్తున్నారు.